ఏం పీకలేడంటూ షణ్ముఖ్ తో కాళ్ళు నొక్కించుకున్న సిరి..నీది యావరేజ్ ఫిగర్..యిట్ ఇస్తున్నారంటూ సిరికి షన్ను షాక్!

బిగ్ బాస్ షోలో ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. కస్టమర్లు, హోటల్ స్టాఫ్ అంటూ రెండు టీములుగా విడిపోయిన ఇంటి సభ్యులు తమ బెస్ట్ ఇవ్వడానికి తపన పడుతున్నారు. అయితే మరో పక్క సిరి ఏమో డాన్ కూతురు అయిన కస్టమర్ గా ఉండగా ఆమె ఫ్రెండ్ షణ్ముఖ్ మాత్రం హోటల్ స్టాఫ్ గా ఉండటంతో వారి మధ్య అనేక సరదా సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

రొడ్డ కొట్టుడు టాస్కులు

రొడ్డ కొట్టుడు టాస్కులు


బిగ్ బాస్ షోలో ఎన్ని సీజన్లు వస్తున్నా ఆ పాత టాస్క్ లనే అటు తిప్పి ఇటు తిప్పి రొడ్డ కొట్టుడు టాస్కులు మాత్రం మారవు. అవే టాస్కులు తిప్పి తిప్పి కొంచెం మార్చి ఏదో జనాన్ని మాయ చేస్తున్న ఫీలింగ్ లో ఉంటారు. తెలుగు బిగ్ బాస్ క్రియేటివ్ టీం సరిగా లేదో అసలు లేదో తెలియదు కానీ కొత్త టాస్కులు ఏమీ పెట్టరు, ఇతర భాషల బిగ్ బాస్ టాస్కులను, గతంలో వాడేసిన టాస్కులనే ఇక్కడా పెడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ప్రతీ సీజన్‌లో ఉన్నట్టు ఈ సారి కూడా బీబీ హోటల్ టాస్క్‌ను పెట్టాడు.

బాగా ఒదిగిపోయి

బాగా ఒదిగిపోయి


ఇప్పుడు జరుగుతున్న టాస్క్ లో సిరి క్యారెక్టర్ డాన్ కూతురుగా వచ్చిన హోటల్ కస్టమర్ కాగా ఆ పాత్రలో బాగా ఒదిగిపోయింది. మరీ ముఖ్యంగా మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో? లేదో? అన్నట్టు అన్ని పనులు చేయించుకుంటుంది. ముందుగా షణ్ముఖ్‌ని డ్రింక్ తాగించమని కోరింది. ఆ డ్రింక్ ఆమె తొడలపై పడటంతో షణ్ముఖ్ తెగ తుడిచేసాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో తల పట్టించుకుంటూ కనిపించింది.

 ఏం పీకలేవ్

ఏం పీకలేవ్

నాతో చాలా సేవలు చేయించుకుంటున్నారు.. మీకు అర్థం కావడం లేదు.. ఈ టాస్క్ తరువాత ఎలా ఉంటుందో అని షణ్ముఖ్ బెదిరిస్తున్నట్టు అంటే ఎప్పటి లాగే నోటి దురదతో సిరి మీకు కూడా అర్థం కావడం లేదు.. ఈ టాస్క్ తర్వాత ఏం పీకలేవ్ అంటూ కామెంట్స్ చేసింది.

షాకిచ్చిన సిరి

షాకిచ్చిన సిరి

అలాగే తనను ఒక హీరోయిన్ లా ఫీల్ అయిపోతూ.. తన అందాన్ని షణ్ముఖ్‌తో కూడా పొగిడించుకోవాలనుకుని ప్లాన్ చేసిన సిరి చివరికి షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం హోటల్ గెస్ట్ అయిన డాన్ కూతురు రోల్‌లో జీవించేస్తున్న సిరి.. షణ్ముఖ్‌తో నేను బాగున్నానా? సిరి బాగుటుందా? అని షణ్ముఖ్‌ని అడిగింది. మీరే బాగుంటారు అని షణ్ముఖ్ చెప్పగా, అయితే సిరి బాగోదనా మీ ఉద్దేశం అని అనడంతో.. 'మీకు చాలా వెయిట్ ఇస్తున్నారు కానీ.. యావరేజ్ ఫిగర్ మీరు' అంటూ నవ్వుతూ షాకిచ్చాడు షన్ను దీంతో సిరికి నోట మాట రాలేదు.

Recommended Video

Sound Movie Opening | Arjun Varahi | Nirosha
విజేతలు ఎవరంటే?

విజేతలు ఎవరంటే?

ఇక ఇదిలా ఉంచితే ఓవరాల్ గా బీబీ హోటల్ టాస్క్ పూర్తయ్యేసరికి మానస్, సన్నీ, కాజల్, సిరి, రవి, ప్రియాంక అంటే కస్టమర్లుగా వచ్చిన టీమ్ విజేతలుగా నిలిచారని అంటున్నారు. అంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఈ ఆరుగురు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X