Bigg Boss: ఫినాలే ముందు షాకింగ్ ఎలిమినేషన్ .. సిరిని ఎలిమినేట్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. ఇదే చివరి వారం కాగా ఆదివారం నాడు ఫినాలే జరగనుంది. ఆరోజే ఈ సీజన్ ఎవరు గెలిచారో తేలిపోతుంది. అయితే ఈ క్రమంలో సిరి ఎలిమినేషన్ షాకింగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్
చివరి మూడు రోజులు కావడం వల్ల అందరి దృష్టీ బిగ్‌బాస్‌పైనే ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఓట్ల శాతం గురించి చర్చ సాగుతోంది ఈ టైటిల్ కోసం పోటీ పడ్డ 19 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ టైటిల్ వరిస్తుంది. ఈ సీజన్‌లో బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు.

ఒక్కరే
ప్రస్తుత్తం హౌస్ లో ఉన్న ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, మానస్ నాగులపల్లి, సిరి హనుమంతు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ అయిదు మందిలో విన్నర్‌గా నిలిచేది మాత్రం ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరనేది ఆదివారం రాత్రి నాటికి అధికారికంగా తేలిపోతుంది. టాప్ 3లో ఎవరు నిలుస్తారు అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

దాదాపు లేనట్టే
అయితే ఓటింగ్ విషయానికి వస్తే ముందు నుంచి వీజే సన్నీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న షన్ను కంటే ఓట్ల మధ్య తేడా భారీగా ఉంటోంది. ఈ ఓటింగ్ లో ఈ సీజన్ ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫిమేల్ కంటెస్టెంట్ సిరి హనుమంతు చివరిలో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. తొలి మూడు స్థానాల్లో చోటు దక్కే అవకాశాలు దాదాపు లేనట్టే.

షాకింగ్ ఎలిమినేషన్
అయితే బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతోందని అంటున్నారు. ఫినాలే స్టేజ్ పైన కాకుండా ముందుగానే బిగ్ బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో సిరిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది కంప్లీట్ గా ఫేక్ ఎలిమినేషన్ అని అంటున్నారు.

సిరిని ఎలిమినేట్ చేసి
అందుతున్న సమాచారం మేరకు ఒక గంట పాటు సీక్రెట్ రూమ్ లో పెట్టి సిరికి హౌస్ లో హౌస్ మేట్స్ రియాక్షన్ ని చూపించి పంపి చేసినట్లు సమాచారం. హౌస్ మేట్స్ అందరూ ఇది నిజమైన ఎలిమినేషన్ అనే అనుకున్నారు కానీ, బిగ్ బాస్ ఒక గంట తర్వాత ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. సిరిని మళ్లీ హౌస్ లోకి పంపిస్తూ ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక హౌస్ లో మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మాజీ కంటెస్టెంట్స్ వాయిస్ తో జ్యోతిష్యం చెప్పించబోతున్నారట. చూడాలి షో ముగిసే లోపు ఎన్ని ట్విస్టులు బిగ్ బాస్ దాచాడు అనేది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.


Click it and Unblock the Notifications











