Bigg Boss 5: నాకు ఓ బాబు ఉన్నాడు.. నాకు పుట్టలేదు కానీ..సిరి మనోవేదన

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఎవరు ఊహించలేరు. అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ పర్సనల్ లైఫ్ ఎమోషన్స్ తో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఎవరు ఎవరి కోసం త్యాగం చేశారు అనే అంశాలను కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ లో ఒక డిఫరెంట్ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.

కంటెస్టెంట్స్ ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి దూరమై 50 రోజులు పూర్తవుతుంది. ఇక వారికి ఎంతో ఇష్టమైన వారు ప్రత్యేకంగా లేఖలను కూడా పంపారు. అయితే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఆ లేఖలతోనే కొనసాగించడం విశేషం. దీంతో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక సిరి తన బాధలు చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది.

ఎమోషన్స్ తో ఆడుకుంటున్న బిగ్ బాస్

ఎమోషన్స్ తో ఆడుకుంటున్న బిగ్ బాస్

ఏడవ వారంలో ప్రియ ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. టోటల్ గా 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన సీజన్ ఫైవ్ లో ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నారు. ఇక వీరిలో హౌస్ నుంచి వెళ్లిపోయే తదుపరి కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఎంతో ఆసక్తిగా మారింది. సోమవారం రోజు 8వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇక ఈ సారి బిగ్ బాస్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన లేఖలను ముడిపెడుతూ కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుతున్నారు.

లేఖలతో నామినేషన్స్

లేఖలతో నామినేషన్స్

బిగ్ బాస్ హౌస్ లో పోస్ట్ మెన్ వచ్చినప్పుడు రెండు లేఖలు వస్తాయి. అయితే కంటెస్టెంట్స్ లో ఇద్దరు పేర్లను చెప్పినప్పుడు వారు సీక్రెట్ రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అ పోస్ట్ బ్యాగ్ ను తీసుకొని అందులో ఉన్న రెండు లేఖలలో ఎవరో ఒకరికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మరొకరి లేఖను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. లేక అందిన వారు ఈసారి నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. ఇక లేఖ అందని వారు మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చినట్లే.

ప్రియాంక కోసం లోబో త్యాగం

ప్రియాంక కోసం లోబో త్యాగం

మొదట శ్రీరామ్ మానస్ లకు పిలుపు రాగానే రూమ్ కి వెళ్తారు. అందులో ప్రియాంక లోబోలకు సంబంధించిన లేఖలు ఉండడంతో ఎవరో ఒకరికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రియాంక లోబో ఇద్దరు కూడా కొంత సేపు చర్చలు జరిపారు. మొదటి సారి నా జీవితంలో మా నాన్నగారు నా కోసం ఒక లేఖ రాసారు. అది నాకు చాలా ప్రత్యేకమైనది అంటూ ప్రియాంక చెప్పడంతో లోబో దాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే ప్రెగ్నెంట్ తో ఉన్న నా భార్య నుంచి వచ్చిన లేఖను అందుకోలేకపోయాను అని లోబో కొంత అప్సెట్ అయ్యాడు. తన లేఖను ముక్కలు చేస్తుంటే ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు.

విశ్వ కోసం సిరి త్యాగం

విశ్వ కోసం సిరి త్యాగం

ఇక రెండవ నామినేషన్స్ లో షణ్ముఖ్ రవి కూడా సీక్రెట్ రూమ్ కి వెళ్లారు. వారికి సిరి విశ్వ లకు సంబంధించిన లేఖలు వచ్చాయి. ఇక సిరి విశ్వ ఇద్దరు కూడా ఎమోషనల్ గా మాట్లాడుకున్నారు. తన భార్యను కొడుకును చాలా మిస్ అవుతున్నాను. ఇంతవరకు కొడుకు ఫోటో కూడా చూడలేదు ఆ లేఖ తనకు చాలా అవసరం అని చెప్పడంతో సిరి విశ్వ కోసం త్యాగం చేయక తప్పలేదు.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
 అందుకే త్యాగం చేశా

అందుకే త్యాగం చేశా

అయితే విశ్వ కోసం త్యాగం చేసిన సిరి చాలా ఎమోషనల్ అయ్యింది. జెస్సికి తన గతం గురించి చెప్పుకుంటూ మనో వేదనకు గురైంది. నాకు ఒక బాబు ఉన్నాడు కానీ నాకు అతను పుట్టలేదు. సంవత్సరం నుంచి కూడా తను నాతోనే ఉంటున్నాడు. పిల్లల ఏమోషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాడి నుంచి వచ్చిన లేఖను చదవలేదు అనే బాధ చాలా ఉంటుంది. నా బాబును నేను కనకపోయినా వాడితో ఎమోషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే విశ్వకి మాత్రం అప్పుడే పుట్టిన బాబు కాబట్టి అందుకే అతని కోసం త్యాగం చేశాను అంటూ సిరి జెస్సికి చెప్పుకుంటూ బాధపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X