For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  |

  బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దాదాపు ఐదు సంవత్సరాలుగా రారాజుగా వెలుగొందుతోందీ రియాలిటీ షో. ఎప్పటికప్పుడు కొత్త టాస్కులను పరిచయం చేయడంతో పాటు జనాలకు నచ్చే కంటెంట్‌ను ప్రసారం చేస్తూ మంచి రేటింగ్‌ను రాబడుతున్నారు షో నిర్వహకులు. ఇలా జాతీయ స్థాయిలో మన షో గుర్తింపును అందుకుంది. ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా మంచి ఆదరణను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ అర్ధరాత్రి ఒకే బెడ్‌పై రచ్చ చేశారు. ఓ లెటర్‌ రాసి మరీ రెచ్చిపోయారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఇది కూడా వాటికి తగ్గట్లుగానే రన్

  ఇది కూడా వాటికి తగ్గట్లుగానే రన్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఆరంభం నుంచే నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తున్నారు. తద్వారా షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేస్తూ మంచి రేటింగ్ రాబడుతున్నారు.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  షోలో రెచ్చిపోతోన్న షణ్ముఖ్, సిరి

  షోలో రెచ్చిపోతోన్న షణ్ముఖ్, సిరి

  ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో వీళ్లిద్దరూ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడడంతో వీళ్లు హైలైట్ అయ్యారు.

  వీళ్ల వల్ల ఫ్యాన్స్‌లో అయోమయం

  వీళ్ల వల్ల ఫ్యాన్స్‌లో అయోమయం

  బయట షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు.. దీంతో వీళ్ల మధ్య ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  నానా హడావిడి... నాగ్‌తో చివాట్లు

  నానా హడావిడి... నాగ్‌తో చివాట్లు

  గత వారం సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం వీళ్లిద్దరూ కాసేపు రొమాంటిక్‌గా కనిపించారు. ఆ తర్వాత మాత్రం గొడవ పడ్డారు. ఆ సమయంలో సిరి ఏకంగా బాత్రూంలో దూరిపోయి నానా హడావిడి చేసింది. దీంతో హోస్ట్ అక్కినేని నాగార్జున ఇద్దరికీ క్లాస్ పీకాడు. దీంతో మనసులోని బాధను బయటపెట్టుకున్నారు.

  వాళ్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ

  వాళ్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ

  హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి షణ్ముఖ్, సిరి మధ్య రాత్రి సమయంలో చర్చ జరిగింది. అప్పుడు 'అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంట్రా! ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. సన్నీ, రవి, శ్రీరామ్ అందరూ ఎవరికి వారే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఒకరిని ఒకరు పాయింట్ ఔట్ చేసుకుంటూ సంతోషిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు' అని చెప్పాడు షణ్నూ.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  తప్పు జరిగిందన్న షన్నూ.. సిరి

  తప్పు జరిగిందన్న షన్నూ.. సిరి

  షణ్ముఖ్ మాట్లాడుతోన్న సమయంలో సిరి 'ఇంతకీ మన పొజిషన్ ఏంటి' అని అడిగింది. అప్పుడతను 'గత వారం మనం తప్పు చేశాం. అనవసరంగా వాళ్లకు ఛాన్స్ ఇచ్చేశాం. అలా చేయకుండా ఉండాల్సింది' అని చెప్పుకొచ్చాడు. దీనికి సిరి ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వేస్ట్ అంటూ కామెంట్ చేసింది. తర్వాత 'నేను ఒంటరి' అని బెడ్‌పై అతికించుకుంది.

  చీవాట్లు పెట్టడంతో ఒకే బెడ్‌పైకి

  చీవాట్లు పెట్టడంతో ఒకే బెడ్‌పైకి

  సిరి 'ఇండివిజువల్' అని రాసుకోవడంతో షణ్ముఖ్‌కు కోపం వచ్చింది. 'అలాంటివి పెట్టి నిన్ను నువ్వు జోక్ చేసుకోకు. జనం నీ గురించి మాట్లాడుకోవాలనే అలా పెట్టావ్. మనద్దరి సీన్‌ అందరికీ చూపిస్తున్నావ్. దీన్నే అపుకుంటే మంచిది. ఇంకొకరు మన గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నావ్' అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో ఆ పేపర్ పడేసి షన్నూ బెడ్‌ మీదకొచ్చింది.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
   ఎంత చెప్పినా వినకుండా బెడ్‌పై

  ఎంత చెప్పినా వినకుండా బెడ్‌పై

  ఇప్పటికే ఎంతో మంది విమర్శలు చేసినా.. స్వయంగా నాగార్జునే స్వీట్ వార్నింగ్ ఇచ్చినా సిరి మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజా ఎపిసోడ్‌లో ఏకంగా షణ్ముఖ్ బెడ్‌పైకి వెళ్లిపోవడమే కాదు.. అతడి మీద పడి మరీ హగ్గులు ఇచ్చింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో కావడంతో వీళ్లిద్దరిపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ జంట మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Siri Hanmanth and Shanmukh Jaswanth Did Midnight Romance on the Bed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X