Bigg Boss: అతడికి ఐలవ్యూ చెప్పిన సిరి.. ఒకే బెడ్‌పై పడుకుని అలా.. నోరు జారి అంత మాట అనేసిన షన్నూ
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ఇండియాలో మొదలైంది బిగ్ బాస్. చాలా కాలం క్రితమే హిందీలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. దీంతో దేశంలోని చాలా భాషల్లో దీన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా తీసుకొచ్చారు. అన్నింటి కంటే మన దగ్గర వస్తున్న షోకు మాత్రమే భారీ స్థాయిలో ఆదరణ లభించిందనే చెప్పాలి. అందుకే తెలుగు బిగ్ బాస్‌ను నేషనల్ రేంజ్‌లో రేటింగ్ లభించింది. ఇలా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని, ఇప్పుడు ఐదో దాన్ని కూడా నడిపిస్తున్నారు నిర్వహకులు. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. తాజాగా వీళ్ల మధ్య ఓ ఊహించని సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

ఆ సీజన్లను మించి పోయేలా చూపిస్తూ
తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్నింట్లోనూ కంటెస్టెంట్ల మధ్య ఫైటింగులు బాగానే కనిపించాయి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం అవి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరంభ వారంలో జరిగిన నామినేషన్స్ టాస్కు నుంచి మొదలుకొని తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో షో రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతూనే ఉంది. ఇవి మాత్రమే కాదు.. రొమాన్స్, లవ్ ట్రాకులు.. ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తూ షోను రంజుగా నడిపిస్తున్నారు నిర్వహకులు.

సోషల్ మీడియా స్టార్స్.. టైటిల్ బరిలో
తాజాగా ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది తమ తమ రంగాల్లో ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అయితే, వీళ్లందరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. ఇక, వీళ్లిద్దరూ బయట ఫ్రెండ్స్ కావడంతో షో ఆరంభం నుంచే హైలైట్ అవుతున్నారు.

అతడిది మైండ్ గేమ్.. ఆమె దూకుడుగా
బిగ్ బాస్ షోలో కొంత మంది శ్రమతో టాస్కులు ఆడితే.. మరికొందరు మాత్రం బుద్ధితో ఆడుతుంటారు. అలాంటి వారిలో ప్రస్తుత సీజన్‌లో షణ్ముఖ్ జస్వంత్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆరంభంలో చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. అందుకే మొదట్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ హౌస్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. అలాగే, ప్రతి దానిలో దూకుడుగా ఆడుతూ వస్తోంది.

దారుణమైన కామెంట్స్.. అందరూ అలా
బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేశారు. అలాగే, వీళ్లు షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో కూడా సిరి, షణ్ముఖ్ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి అయితే ఇంటర్వ్యూలోనే బూతులతో ఇద్దరినీ తెగ తిట్టేసింది కూడా.

దూరంగా ఉంటూనే.. మళ్లీ దగ్గరగా వచ్చి
ఎలిమినేట్ అయిన వాళ్లంతా స్టేజ్ మీద నుంచి సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ గురించి చెబుతున్న మాటలతో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ వీళ్లపైనే దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా షణ్ముఖ్.. సిరిని దూరం పెడుతున్నాడు. ఆమె ఎంతలా బ్రతిమాలినా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. దీంతో నాగార్జునే స్వయంగా ఆమెతో మాట్లాడమని షన్నూకు చెప్పాడు. దీంతో దూరం పెట్టినా వెంటనే ఆమెతోనే కలుస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరి తీరు ప్రేక్షకులను అయోమయంలో ఉంచేస్తోంది.

సరదాగా ప్రపోజ్ చేసేసుకున్న ఫ్రెండ్స్
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో 'బంగారు కోడిపెట్ట' టాస్క్ జరుగుతోన్న సమయంలో హౌస్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టాస్క్ జరుగుతోన్న తీరు గురించి త్రిమూర్తులు షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, జస్వంత్ పడాలల మధ్య ఓ చర్చ జరిగింది. ఆ సమయంలో జెస్సీ.. సిరికి ప్రపోజ్ చేశాడు. అయితే, ఆమె మాత్రం షన్నూకు ఐలవ్యూ అని చెప్పింది. అతడు కూడా స్పందించి ఐలవ్యూ అనేశాడు. అంతేకాదు, 'ఏరా నా గుడ్లు కావాలి కానీ నా లవ్ వద్దా.. దానికి ప్రపోజ్ చేస్తున్నావ్' అని జెస్సీని ఉద్దేశించి అన్నాడు షణ్ముఖ్. ఇది సరదాగా సాగింది.
Recommended Video

ఒకే బెడ్‌పై అలా.. అంత మాట అనేశాడు
ఇక, త్రిమూర్తుల మధ్య చర్చ జరుగుతోన్న సమయంలోనే షణ్ముఖ్ మాట్లాడుతూ.. 'అరే నీలా ఏ అమ్మాయి ఆడదు తెలుసా? చేతులకు ఇలా దెబ్బలు తగిలితే చాలా ఓవర్ చేస్తారు. నువ్వు మాత్రం ఎంతో కూల్‌గా ఉన్నావు. నాకు తెలిసి ఈ వారం నిన్ను పంపించేస్తారేమో' అంటూ నోరు జారాడు. దీన్ని సిరి కూడా లైట్ తీసుకోవడంతో సరదాగా సాగింది. ఇక, అంతకు ముందు షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఒకే బెడ్‌పై పడుకుని గుసగుసలు ఆడుకున్నారు. అప్పుడు బిగ్ బాస్ సబ్ టైటిల్స్ కూడా వేశాడు. ఇది వీక్షకులకు కొంచెం ఓవర్‌గా అనిపించింది.


Click it and Unblock the Notifications











