Bigg Boss 5 Telugu Contestants: హౌస్‌లో మరో జంట ఎంట్రీ: వరుణ్-వితిక తర్వాత వీళ్లే.. పెళ్లి కాకముందే రచ్చ!

సాదాసీదాగా తెలుగులోకి పరిచయం అయినా.. ఊహించని విధంగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది బిగ్ బాస్ షో. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినా.. అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకున్న ఇది ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే ఐదో సీజన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐదో సీజన్‌లో ఓ ప్రేమ జంట ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా కపుల్? పూర్తి వివరాలు మీకోసం!

ముగ్గురితో నాలుగు సక్సెస్‌‌గా

ముగ్గురితో నాలుగు సక్సెస్‌‌గా

హిందీలో ఎప్పటి నుంచో వస్తున్న బిగ్ బాస్ షో.. కొన్నేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన రావడంతో ఇది సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. వీటిలో మొదటి దానికి ఎన్టీఆర్, రెండోది నాని, మూడు నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున విజయవంతంగా నడిపించారు.

ఐదో సీజన్ ప్రారంభంపై ప్రచారం

ఐదో సీజన్ ప్రారంభంపై ప్రచారం

నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అవడంతో.. ఐదో దానిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని గురించి ఎన్నో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అందిన సమచారం ప్రకారం.. ఐదో సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఆగస్టులో కొన్ని ప్రోమోలు వస్తాయని కూడా టాక్ వినిపిస్తోంది.

లీక్ అవుతోన్న కంటెస్టెంట్ల పేర్లు

లీక్ అవుతోన్న కంటెస్టెంట్ల పేర్లు

బిగ్ బాస్ ఐదో సీజన్ ఎలాగైనా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. దాదాపు వంద మంది ప్రముఖుల్లో ఇటీవలే షార్ట్ లిస్ట్ తయారు చేశారని అంటున్నారు. వీరితో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కొందరి పేర్లు కూడా ఒక్కక్కొటిగా బయటకొస్తున్నాయి.

అప్పుడు ఆ జంటతో ప్రయోగం

అప్పుడు ఆ జంటతో ప్రయోగం

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. అందుకే నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో చరిత్రలోనే తొలిసారి భార్య భర్తలైన వరుణ్ సందేశ్, వితిక షేరును మూడో సీజన్‌లో జంటగా పంపించారు. అది సక్సెస్ అయింది. దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగింది.

ఐదో సీజన్‌లోకి మరో ప్రేమజంట

ఐదో సీజన్‌లోకి మరో ప్రేమజంట

వరుణ్ సందేశ్, వితిక షేరు జంట మాదిరిగానే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌లో మరో జోడీని పంపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్లెవరో కాదు.. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సిరి హన్మంత్.. శ్రీహాన్ జంట. అవును.. వీళ్లిద్దరినే ఈ సారి కంటెస్టెంట్లుగా పంపించబోతున్నట్లు తెలిసింది. వాస్తవానికి సిరి పేరు ఈ మధ్యనే బయటకు వచ్చింది.

Recommended Video

Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
పెళ్లి కాకముందే హౌస్‌లో రచ్చ

పెళ్లి కాకముందే హౌస్‌లో రచ్చ

సిరి హన్మంత్.. శ్రీహాన్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి గతంలో స్క్రీన్ షేర్ చేసుకుని పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆ తర్వాత ఓ కార్యక్రమంలోనే వీళ్లకు ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. అప్పటి నుంచి జంటగా హల్‌చల్ చేస్తోన్న వీళ్లిద్దరికీ కలిసి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అంటే పెళ్లి కాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X