Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్
తెలుగు బుల్లితెర పైకి పరిచయం ఐదేళ్లు అవుతోన్నా ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా జేజేలు అందుకుంటోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు, సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతున్నా.. ఇక్కడి ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించడం వల్లే ఇది విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 14వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అతడికి శ్రీరామ చంద్ర ఫ్యాన్స్ హ్యాండిచ్చారట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మిగిలిన నలుగురు ఎవరనే ఆసక్తిగా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో అంతకు ముందు వారం జరిగిన 'టికెట్ టు ఫినాలే' టాస్కులో శ్రీరామ చంద్ర విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. దీంతో ఐదుగురిలో నలుగురు మాత్రమే తుదిపోరులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో వీజే సన్నీ రెండో ఫైనలిస్టుగా నిలిచాడు. ఇక, మిగిలిన వారిలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

14వ వారం కాజల్ వెళ్లిపోయిందని
14వ వారానికి సంబంధించి నామినేషన్స్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే వీజే సన్నీ ఫినాలేకు చేరినట్లు నాగార్జున ప్రకటించాడు. ఇక, మిగిలిన షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, మానస్, ఆర్జే కాజల్‌లలో ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ వారానికి సంబంధించి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయిపోయినట్లు ఇప్పటికే బిగ్ బాస్ నుంచి లీకులు కూడా వచ్చేశాయి.

టైటిల్ ఫేవరెట్... చివర్లో మారింది
ఎన్నో అంచనాలతో మొదలైన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే.
అందుకు అనుగుణంగానే షణ్ముఖ్ జస్వంత్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. దీంతో రెండో ఫైనలిస్టుగా అతడే ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ, చివర్లో ఓటింగ్ మారిపోవడంతో షణ్ముఖ్ ర్యాంక్ పడిపోయిందట.

ఆమెతో అలా చేసి.. పరువు పోయేలా
షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరూ షోలో జంటగా మారిపోయారు. తరచూ కలిసే ఉంటున్నారు.. కలిసే ఆడుతున్నారు. ఒక్కోసారి హగ్ చేసుకుంటారు.. ఒక్కోసారి ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాదు, ఏకంగా ఒకరి మీద ఒకరు పడుకుంటారు. దీంతో వీళ్లిద్దరిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో సిరి అయితే షణ్ముఖ్‌తో కనెక్ట్ అయిపోయానని స్వయంగా ఒప్పుకుంది. కానీ, గత వారం సిరిని అతడు మెంటర్‌గా టార్చర్ చేసినట్లు చూపించారు.

షణ్ముఖ్‌కు మరో దెబ్బ తగిలిందట
14వ వారంలో షణ్ముఖ్ జస్వంత్ టాస్కు విషయంలో వీజే సన్నీ తనను ఇమిటేట్ చేస్తున్నాడని గొడవ పడ్డాడు. ఆ తర్వాత సిరి హన్మంత్‌పై నోటికొచ్చిన మాటలు అన్నాడు. పాపం ఆమె చాలా సైలెంట్‌గా ఉన్నప్పటికీ షణ్ముఖ్ మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో సిరి తట్టుకోలేక ఏడ్చేసింది. ఇది అతడికి బాగా మైనస్ అయిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందుకే అతడు టాప్ ప్లేస్‌ను కోల్పోయాడని.. అదే సమయంలో సన్నీ బాగా పుంజుకున్నాడని అంటున్నారు. అందుకే అతడు శనివారం జరిగిన ఎపిసోడ్‌లో రెండో ఫైనలిస్టుగా నిలిచాడనే టాక్ వినిపిస్తోంది.

3వ ర్యాంక్‌కు పడిపోయిన షణ్ముఖ్
14వ వారానికి సంబంధించి నామినేషన్స్‌లో అందరూ బలమైన కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ పోటాపోటీగా జరిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాప్ ప్లేస్ కోసం షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపించిందని అనుకున్నారు. అయితే, చివరి రెండు రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. గత వారం షణ్ముఖ్ ర్యాంక్ మూడుకు పడిపోయిందట. అందుకే ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో అతడిని నాలుగో ఫైనలిస్టుగా ప్రకటించబోతున్నారని తెలిసింది.

శ్రీరామ చంద్ర ఫ్యాన్స్ ఓట్లు ఆమెకే
అంతకు ముందు వారం 'టికెట్ టు ఫినాలే' టాస్క్ గెలుచుకున్న శ్రీరామ చంద్ర మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. దీంతో అతడు ఈ వారం నామినేషన్స్‌లో లేడు. ఇది సిరి హన్మంత్‌కు బాగా కలిసొచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీరామ చంద్ర అభిమానుల ఓట్లు ఈ వారం సిరి హన్మంత్‌కే పడ్డాయట. దీంతో ఆమె షణ్ముఖ్‌ను దాటేసి రెండో స్థానానికి చేరుకుందని తెలిసింది. అంటే ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ఫినాలేకు చేరుకున్న మూడో కంటెస్టెంట్‌గా సిరినే ప్రకటించబోతున్నారట. ఇది షణ్ముఖ్‌కు భారీ షాక్ అనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











