Bigg Boss: పెళ్లిపై సిరి షాకింగ్ కామెంట్స్.. అతడినే చేసుకుంటా కానీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ

తెలుగులో చాలా రకాల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అయితే, అందులో అన్నీ సక్సెస్ కావడం లేదు. జనరంజకంగా సాగే కొన్ని షోలు మాత్రమే ఆదరణను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు చేరువ అయిన ఈ కార్యక్రమం.. తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా గత వారమే ఐదో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ సీజన్ మొత్తంలో ఎందరో హైలైట్ అయ్యారు. అందులో జంటగా పాపులర్ అయింది మాత్రం షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ మాత్రమే. హౌస్‌లో రచ్చ చేసిన వీళ్లిద్దరూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ నేపథ్యంలో తాజాగా సిరి హన్మంత్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చింది

టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చింది

ఇటీవలే ముగిసిన ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ కూడా ఉంది. ఆరంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అప్పుడే బాగా హైలైట్ అయింది.

అతడితో రొమాన్స్‌తో రచ్చ చేసింది

అతడితో రొమాన్స్‌తో రచ్చ చేసింది

ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. అతడికి బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. ఇక, సిరి హన్మంత్ ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా షన్నూతో రొమాన్స్ చేస్తూ ఎప్పుడూ కలిసే ఉండడంతో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి.

టాప్ 5లోకి వచ్చి.. అతడే గెలవాలని

టాప్ 5లోకి వచ్చి.. అతడే గెలవాలని

ఆరంభం నుంచే చక్కని ఆటతీరును కనబరిచిన సిరి హన్మంత్.. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది. తద్వారా టాప్ 5లో నిలవడంతో పాటు ఫినాలేకు చేరుకుంది. అయితే, ఆమె గ్రాండ్ ఫినాలో ఎపిసోడ్‌లో ఆరంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, షణ్ముఖ్‌ను మాత్రం టైటిల్ విన్నర్‌గా చేయాలని పాటు పడింది.

బాగానే సంపాదించింది.. విమర్శలు

బాగానే సంపాదించింది.. విమర్శలు


సిరి హన్మంత్ బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి వరకూ ఉండడంతో బాగానే సంపాదించిందని బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గానూ రూ. 30 లక్షల వరకూ రెమ్యూనరేషన్‌గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సిరి హన్మంత్ తన క్యారెక్టర్‌ను దిగజార్చుకుందని కూడా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

పెళ్లిపై స్పందించిన సిరి హన్మంత్

పెళ్లిపై స్పందించిన సిరి హన్మంత్

బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ చోటు అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. అదే సమయంలో అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఇందులో మాత్రం షణ్ముఖ్‌తో రొమాన్స్‌ను పడించింది. అలాగే, అతడికి కనెక్ట్ అయ్యానంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లిపై స్పందించిందామె.

అతడినే చేసుకుంటా అని ప్రకటన

అతడినే చేసుకుంటా అని ప్రకటన


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి హన్మంత్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆమె ఎన్నో ఇంటర్వ్యూల్లో సైతం పాల్గొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో సిరి చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంలో శ్రీహాన్, షణ్ముఖ్‌లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీంతో తన ప్రియుడు చోటూనే చేసుకుంటానని చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిరి హన్మంత్

చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిరి హన్మంత్

ఈ ఇంటర్వ్యూలో సిరి హన్మంత్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడే కదా బయటకు వచ్చాను. పెళ్లి గురించి అప్పుడే చెప్పలేను. ముందు చోటూతో మాట్లాడాలి. అతడు ఇప్పుడు ఏమంటాడో తెలీదు. అందుకే ముందు నాకు క్లారిటీ వచ్చిన తర్వాతనే పెళ్లి ఎప్పుడనేది చెప్తాను. ఈ విషయాన్ని ఇద్దరం కలిసే ప్రకటిస్తాము' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X