Bigg Boss: అమ్మ చెప్పినా షణ్ముఖ్‌ను అందుకే వదల్లేదు.. షోలో అలా బయట ఇలా అంటూ సిరి షాకింగ్‌గా!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. వాటిలో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకున్న షోలు కూడా ఉన్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఏకైక తెలుగు షో మాత్రం బిగ్ బాసే అని చెప్పాలి. అంతలా ఇది టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక, ఈ షో ద్వారా ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒకరు బాగా హైలైట్ అవుతుంటారు. కొందరైతే జంటలుగా ఫేమస్ అవుతున్నారు.
అలా ఈ సీజన్‌లో హాట్ టాపిక్ అయ్యారు షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్. హౌస్‌లో హగ్గులు.. ముద్దులతో రచ్చ చేసిందీ జోడి. అందుకే తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సిరి హన్మంత్.. షణ్ముఖ్‌తో రిలేషన్‌పై స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చారు.. జోడీగా మారారు
తాజాగా ముగిసిన ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి తరచూ విమర్శలను ఎదుర్కొన్నారు.

రొమాన్స్‌తో రచ్చ చేసిన జంట
బిగ్ బాస్‌లోకి రావడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో నిత్యం హాట్ టాపిక్ అయ్యారు.

ఆటలో అదుర్స్.. ఫినాలే ఎంట్రీ
షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఇద్దరూ ఆరంభం నుంచీ తమ తమ ఆటతీరుతో సత్తా చాటారు. ఎవరికి వారే చక్కగా ఆడుకుంటూ ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. దీంతో ఇద్దరూ ఇంటికి కెప్టెన్లుగా కూడా ఎంపికయ్యారు. అలా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను సైతం తప్పించుకున్నారు. ఇలా ఆరంభం నుంచీ ఆకట్టుకుంటూ సిరి, షన్నూ ఇద్దరూ టాప్ 5లో నిలిచారు.

చివర్లో కూడా రొమాన్స్ పండించి
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో శనివారం వరకూ ఫినాలే వీక్ జరిగింది. దీంతో కంటెస్టెంట్లకు పెద్దగా టాస్కులు లేకుండా పోయాయి. ఫలితంగా వాళ్లంతా తమకు నచ్చినట్లు ఉంటూ సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో సిరి, షణ్ముఖ్ కూడా జంటగానే కనిపించారు. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటూ, గొడవలు పడుతూ, హగ్గులు చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ మరింతగా రచ్చ చేసేశారు.

సిరి ఐదులో.. షణ్ముఖ్ రన్నర్‌గా
గత ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో టాప్ 5లో నిలిచిన ఏకైక లేడీ సిరి హన్మంత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుని ముందుగా ఎలిమినేట్ అయిపోయింది. ఇక, టాప్ 2 వరకూ వెళ్లిన షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా మిగిలిపోయాడు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు నిరాశగా ఉన్నారు.

షన్నూతో రొమాన్స్‌పై సిరి ఇలా
బయటకు వచ్చిన తర్వాత సిరి హన్మంత్.. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా 'హగ్గులు వద్దని అమ్మ చెప్పింది. కానీ, అప్పటికప్పుడు మారితే మేము యాక్టింగ్ చేస్తున్నామని అంతా అనుకుంటారు. అందుకే వాడిని వదల్లేదు. కానీ, బయట ఇంత నెగెటివిటీ ఉంటుందని మాత్రం అస్సలు ఊహించలేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











