For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. అప్పుడు కూడా ముద్దులు.. కాజల్ అంత మాట అనడంతో ఏడ్చిన షణ్ముఖ్

  |

  ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో ఆదరణను అందించారు. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఇందులో కూడా అదిరిపోయే కంటెంట్‌ను చూపిస్తూ మంచి టీఆర్పీని రాబడుతున్నారు నిర్వహకులు. ఇక, ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో షోలో రొమాన్స్ శృతి మించింది. తొలిసారి షణ్ముఖ్ ఏడ్చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  మొత్తం అవే చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా

  మొత్తం అవే చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా

  తెలుగులో బిగ్ బాస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈ షో నుంచి ఎప్పుడు సీజన్ వచ్చినా దానిపై మరిన్ని అంచనాలు ఉంటున్నాయి. ఇలానే ఇప్పుడు ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే అవి నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఐదింతల ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ చూపిస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే లవ్ ట్రాకులు, గొడవలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఫలితంగా మంచి రేటింగ్‌ను రాబడుతున్నారు. ఇలా దీన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడుపుతున్నారు.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  షన్నూ.. సిరి రొమాన్స్‌తో విమర్శలు

  షన్నూ.. సిరి రొమాన్స్‌తో విమర్శలు

  ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ముందున్నారు. ఫాలోయింగ్ పరంగా టాప్‌లో ఉన్న వీళ్లిద్దరూ.. ఆటలోనూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఈ జంట షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో వీళ్లిద్దరూ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిత్యం రొమాన్స్ చేస్తూనే ఉంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ స్నేహితులుగా ఉన్నా.. ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

  చీవాట్లు తిన్నా అస్సలు తగ్గట్లేదుగా

  చీవాట్లు తిన్నా అస్సలు తగ్గట్లేదుగా

  షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బయట స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి గొడవలు పెట్టుకుని అలుగుతున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి అసలు ఏం జరుగుతుందోనన్న అనుమానాలు కలిగిస్తున్నారు. ఈ విషయంలోనే మొన్న నాగార్జున ఇద్దరినీ ఆడుకున్నాడు. అప్పుడు సిరి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  కెప్టెన్సీ టాస్కులో షణ్ముఖ్ హవాతో

  కెప్టెన్సీ టాస్కులో షణ్ముఖ్ హవాతో

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో చివరి కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా ప్రియాంక సింహాసనంపై కూర్చుంది. అప్పుడు సిరి, రవి చివరి స్థానంలో ఉండగా.. రవినే సేఫ్ చేసింది. ఆ తర్వాత షణ్ముఖ్ సింహాసనం ఎక్కగా.. ప్రియాంక, రవిలు మిగిలారు. వాళ్లిద్దరిలో రవిని సేఫ్ చేశాడు. ఇక, చివర్లో రవి, షణ్ముఖ్ మాత్రమే ఉండగా.. కంటెస్టెంట్లు ఓట్లు వేయాల్సి వచ్చింది. అప్పుడు శ్రీరామ్ మాత్రమే రవికి సపోర్ట్ చేయగా మిగిలిన వాళ్ల మద్దతుతో షన్నూ కెప్టెన్ అయ్యాడు.

  అంత మాట అనడంతో షన్నూ ఫైర్

  అంత మాట అనడంతో షన్నూ ఫైర్


  కెప్టెన్సీ టాస్క్ జరుగుతోన్న సమయంలో ప్రియాంక తనను సేవ్ చేయమంటూ షణ్ముఖ్‌ను వేడుకుంది. ఆ సమయంలో తాను ఒక్కసారైనా కెప్టెన్ అయితే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలుస్తానని చెప్పుకుంది. ఆ తర్వాత సన్నీ వచ్చి ప్రియాంక పుట్టినరోజు కదా ఆమెకు ఛాన్స్ ఇవ్వు అని అడిగాడు. అయినప్పటికీ షన్నూ మాత్రం రవికే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఆ సమయంలో వచ్చిన కాజల్ 'వాళ్ల కమ్యూనిటీని బట్టైనా పింకీకి అవకాశం ఇవ్వు' అని అడిగింది. దీంతో అతడిలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ మాట అన్న కాజల్‌పై ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  అనాల్సినవి అనేసి వెక్కి వెక్కి ఏడ్చి

  అనాల్సినవి అనేసి వెక్కి వెక్కి ఏడ్చి

  కాజల్ మాటకు షణ్ముఖ్‌కు చిర్రెత్తుకొచ్చింది. అప్పుడు 'ఏంటి కాజల్.. ఏం మాట్లాడుతున్నావ్? కమ్యూనిటీని ఎందుకు తీసుకు వస్తున్నావు? అలా అంటే ఇక్కడ డెసీషన్ తీసుకునే నేను ఎదవనా? నువ్వు చాలా తప్పుగా మాట్లాడావ్' అంటూ చెడామడా తిట్టేశాడు. ఆ సమయంలో కాజల్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా తగ్గలేదు. అప్పుడే షన్నూ ఏడవడం మొదలు పెట్టేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కాసేపటికి సిరి వైపు చూసి రా హగ్ చేసుకో అన్నట్లు సైగ చేయగానే ఆమె వచ్చి వాలిపోయింది. అప్పుడూ ఇద్దరి రొమాన్స్ పడింది.

  Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
  ముద్దులు.. హగ్గులు.. మరీ దారుణం

  ముద్దులు.. హగ్గులు.. మరీ దారుణం


  నిన్నటి ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్ మధ్య రొమాన్స్ శృతి మించింది. కెప్టెన్సీ టాస్కులో ఎలిమినేట్ అవడంతో లోపలికి వెళ్లి ఏడ్చిన సిరి.. షణ్ముఖ్ సింహాసనంపై కూర్చోగానే వచ్చి హగ్ చేసుకుని గట్టిగా బుగ్గపై ముద్దు పెట్టేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఇక, కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్.. ఆమెకు ముక్కుపుడక తీసుకెళ్లి ఇచ్చి అది పెట్టుకోవాలని డిమాండ్ చేశాడు. మొదట్లో అంగీకరించకపోయినా.. తర్వాత పెట్టుకుని చూపించింది. అనంతరం బెడ్‌పై పడుకున్న షన్నూపై పడిపోయింది. మొత్తానికి వీళ్లిద్దరూ హౌస్‌ను సొంతం హౌస్‌ అనుకుంటున్నట్లుంది.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Siri Hanmanth Gave Hug and Kiss to Shanmukh Jaswanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X