Bigg Boss: షణ్ముఖ్ జస్వంత్‌ను బయటకు పంపే కుట్ర.. చెడ్డ పేరుతో పాటు ఎలిమినేషన్‌కు ప్లాన్!
సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందనను అందుకుంటూ.. ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇండియాలో పలు భాషల్లో ఎప్పుడో మొదలైన ఈ కార్యక్రమం.. కొన్నేళ్ల క్రితమే తెలుగులోకి ప్రవేశించింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయమైన ఇది నాలుగు సీజన్లను సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను మొదలు పెట్టారు నిర్వహకులు. ఇది కూడా అదే రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. అయితే, అతడి వెనుక భారీ కుట్ర జరుగుతుందని సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

వాటన్నింటినీ మరిపించేలా ప్లాన్ చేసి
ముందు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని నిర్వహకులు చెప్పారు. దీంతో ఈ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తూ షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.

టైటిల్ కోసం వాళ్లిద్దరూ కూడా ఫైటింగ్
ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది తమ తమ రంగాల్లో ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అయితే, వీళ్లందరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి కారణం అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి అడుగు పెట్టింది. ఇక, వీళ్లిద్దరూ బయట కూడా స్నేహితులు కావడంతో షో ఆరంభం నుంచే ఫోకస్ అవుతూ గేమ్ ఆడుతున్నారు.

బుద్ధితో ఒకరు.. స్ట్రాంగ్‌గా మరొకరు సత్తా
బిగ్ బాస్ షోలో నెగ్గుకు రావాలంటే ఫాలోయింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు. తమ సత్తాను చూపించే విధంగా ఆట కూడా ఆడాలి. అలాగే, శ్రమను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు.. బుద్ధితో నెగ్గుకు రావాలి. ఇప్పుడు ఐదో సీజన్‌లో షణ్ముఖ్ జస్వంత్ ఇదే చేస్తున్నాడు. ఆరంభంలో చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ హౌస్‌కు కెప్టెన్ అయింది. అలాగే, ప్రతి దానిలో దూకుడుగా ఉంటూ ముందుకెళ్తోంది.

దారుణమైన కామెంట్లతో పరువు తీసేసి
బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతుంది. అందుకే అందులో ఉన్న కంటెస్టెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో కూడా సిరి, షణ్ముఖ్ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి అయితే ఇంటర్వ్యూలోనే దారుణమైన కామెంట్లతో పరువు తీసేశారు.

దూరంగా దగ్గరగా.. అసలేం నడుస్తుంది
బయట స్నేహితులు కావడంతో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ హౌస్‌లో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు.. ఒక్కోసారి దూరంగా కనిపిస్తున్నారు. ఇలా వీళ్లు బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో.. ఎందుకు అలా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ, బిగ్ బాస్ నిర్వహకులకు మాత్రం కావాల్సినంత కంటెంట్‌ను ఇస్తూ తెగ హైలైట్ అయిపోతున్నారు.

షణ్ముఖ్ జస్వంత్ పేరు చెడగొట్టే కుట్ర
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ ఎప్పుడూ మోజ్ రూమ్‌లోనే గడుపుతున్నాడు. అతడితో పాటే సిరి హన్మంత్ కూడా ఉంటుంది. ఆమె తరచూ అతడిని ఇబ్బంది పెడుతున్నట్లు షోలో చూపిస్తున్నారు. మీద మీదకు పడిపోవడం.. ఒకే బెడ్‌పై పడుకోవడం.. అలగడం.. హగ్గులు ఇవ్వడం వంటివి చేస్తోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో ఏకంగా ముద్దు కూడా పెట్టేసింది. అసలు ఆమె ఎందుకిలా చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనివల్ల ఆమెకు కూడా చెడ్డపేరు వస్తుంది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ పేరు చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Recommended Video

చెడ్డ పేరుతో పాటు ఎలిమినేషన్‌కు ప్లాన్
నిజానికి షణ్ముఖ్ జస్వంత్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి అనుగుణంగానే హౌస్‌లో టాస్కులు ఆడగల సామర్ధ్యం కూడా ఉంది. ఇవి సజావుగా జరిగితే అతడు టైటిల్ విన్నర్ అవుతాడు. ఈ తరుణంలో సిరి హన్మంత్ రూపంలో అతడికి ప్రమాదం పొంచి ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. చక్కగా ఆడేవాడిని తప్పుదోవ పట్టిస్తుందని.. రొమాన్స్ చేస్తూ చెడ్డపేరును కూడా తీసుకొస్తుందని అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, షన్నూకు చెడ్డపేరు తేవడంతో పాటు ఎలిమినేట్ చేసే ప్లాన్ జరుగుతుందా అన్న అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











