Bigg boss 5: పాపం సిరిపై నమ్మకంతో బొక్క బోర్లా పడ్డ షణ్ముఖ్.. ఇది కట్టప్ప కంటే పెద్ద వెన్నుపోటు!
బిగ్ బాస్ షోలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కాదు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ బిగ్ బాస్ హౌస్ లో అనే డైలాగ్ కూడా కరెక్ట్ సరిపోతుందేమో అయితే కావాలని రంగులు మార్చే వారు స్వార్థంగా ఎంతవరకు ఆలోచించారు అనేది మరొక ముఖ్యమైన అంశం. ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో అయితే చాలామంది రంగులు మారుస్తున్నారు. ఒకరిని అడ్డంపెట్టుకుని మరొకరిని ఈజీగా డామినేట్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక షణ్ముఖ్ మొదటి రోజు నుంచి కూడా తనదైన శైలిలో గేమ్ ఆడాలని చూస్తున్నాడు. కానీ ఎవరో ఒకరికి అతను ఈజీగా ఇన్ ఫ్లూయేన్స్ అయిపోతున్నట్లు అర్థమవుతుంది. కొన్ని సార్లు తనే ఓపెన్ గా ఆ విషయాన్ని చెప్పుకున్నాడు కూడా. ఆ కారణంతో కూడా ఇతరులను నామినేట్ చేయడం విశేషం.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

మోసం చేస్తున్నారు
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచించకపోతే మనుగడ సాగించడం చాలా కష్టమైన పని. ఫైనల్స్ వరకు ఉండాలి అంటే ఏదో ఒక ఐడియా లతో ముందుకు సాగుతూ ఉండాలి. ఉంటే విలన్ గా అయినా ఉండాలి లేదంటే హీరో అయినా అవ్వాలి అనే అంశాన్ని బిగ్ బాస్ హౌస్ చాలా సార్లు రుజువు చేసింది. అయితే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఆ దారిలో అయితే వెళ్లడం లేదు. దాదాపు అందరూ కూడా పాజిటివ్ గా నటిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ వారి బలమైన స్టేట్మెంట్ మాత్రం ఎవరూ ఇవ్వడం లేదు ఇక మరికొందరు అయితే మోసం చేస్తున్నట్లు చాలా ఈజీగా అర్థమవుతుంది.

షన్ను.. గేమ్ ఏంటో..?
బిగ్ బాస్ హౌజ్ లో ఎలాంటి ఆట ఆడినా కూడా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. కానీ కావాలని ఒకరిని టార్గెట్ చేసి కన్నింగ్ గా అడితే మాత్రం నెగిటివ్ కామెంట్స్ రావడం పక్క. ప్రస్తుతం హౌస్ లో కాస్త ఎక్కువగా పబ్లిసిటీ ఉన్న సెలబ్రిటీలు ఉన్నవారు కూడా అదే తరహా ఆటను కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా షణ్ముఖ్ అయితే అసలు హౌస్ లో ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎవరికీ అర్థం కావడం లేదు. అతను పోరాడకుండా ఎక్కువగా ఇతరులు నన్ను ఇన్ ఫ్లూయేన్స్ చేస్తున్నారు అని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. దీంతో తనను తానే కంట్రోల్ చేసుకోలేని వాడు బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా నిలదొక్కుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరోసారి సిరి వలలో..
ముఖ్యంగా సిరి విషయంలో అయితే షణ్ముఖ్ జస్వంత్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. హౌజ్ నుంచి ఇప్పటివరకు వెళ్లిపోయిన వారు అతని పై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. షణ్ముఖ్ జస్వంత్ ఎప్పుడు సిరి పక్కనే ఉంటాడు అంటూ సరయు కూడా నెగిటివ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉంటే మరొకసారి షణ్ముఖ్ జస్వంత్ అదే తప్పు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంతకు ముందు అతను సిరిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మళ్ళీ తన తెలివితో అతనే పక్కనే ఉండేలా జాగ్రత్త పడుతుంది.

సిరిని నమ్ముకుంటే అంతే..
రీసెంట్ గా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అందరూ కూడా రెండు జంటలుగా విడిపోవాలని అనుకున్నప్పుడు ముందుగానే సిరి షణ్ముఖ్ ను అట్రాక్ట్ చేసింది. ఎవరికైతే పవర్ రూమ్ యాక్సెస్ లభిస్తుందో వారు మరొక జంట ను సెలెక్ట్ చేసుకుని టాస్క్ లో పోటీపడవలసి ఉంటుంది. అయితే సిరి, షణ్ముఖ్ ను సెలెక్ట్ చేసుకోవాలని శ్వేత అని మాస్టర్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరూ కచ్చితంగా ఓడిపోతారని సిరిని నమ్ముకుంటే షన్ను కూడా అంతగా ఆడకపోవచ్చు అని వాళ్ళు తెలివిగా గేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. పైకి పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నా వారిని ఓడించాలని ఫిక్స్ అయ్యారు.

మరోసారి నిజమయ్యింది..
ఇక చిక్కుల్లో చిక్కుకోకు టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్ బాగానే పోరాడాడు. కానీ సిరి హడావిడి తప్ప చేసింది ఏమీ లేదు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్సీ టాస్క్ లో దారుణంగా ఓడిపోయాడు. ఇద్దరూ జెన్యూన్ గా ఉంటేనే విజయం సాధించవచ్చు అని శ్వేత ఆని మాస్టర్ నిరూపించారు. ఇక మరోవైపు సిరి మాత్రం అవసరం కోసం మాత్రమే అబ్బాయిలతో ఉంటుందని గతంలో సరయు చేసిన కామెంట్ మరోసారి రుజువైంది.
Recommended Video

సన్నీకి కట్టప్ప పోటు
మొదట సన్నీతో కూడా సిరి ఎంతగానో క్లోజ్ గా ఉండేది. అసలు హౌస్ లో ఇద్దరు మొదటి అడుగు పెట్టినప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా కొనసాగారు. షణ్ముఖ్ జస్వంత్ కూడా ముందు నుంచే పరిచయం ఉండడంతో మరొక దారిలో సిరి స్నేహాన్ని కొనసాగించింది. దాదాపు తనకి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో ఆ అబ్బాయిలను ఫ్రెండ్స్ గా చేసుకున్న సిరి చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వస్తోంసి అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఇక కెప్టెన్ గా అర్హత లేని వారిని కత్తులతో పొడవాలని చెప్పినప్పుడు సిరి శ్రీరామ్ శ్వేతాను కాకుండా సన్నీని పొడవడం మరొక షాకింగ్ విషయం. సన్నీ నిజంగా అది ఊహించలేదు. ముందుగానే షణ్ముఖ్ ను కూడా ఆమె తన మాటలతో సన్నీ వైపు ఉసిగొలిపింది. దీంతో షన్ను కూడా మరో సారి తన గేమ్ ఆడకుండా సిరి దారిలోనే వెళ్ళాడు. అసలు కెప్టెన్ అయితేనే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. కానీ నీకు అంత లేదు అంటూ షన్ను ఊహించని విధంగా స్పందించి సన్నీ పై అభిప్రాయాన్ని చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొకసారి సిరిపై నమ్మకంతో బొక్క బోర్లా పడ్డాడు. మరి తదుపరి అవకాశం వచ్చినప్పుడు అతను మళ్ళీ సిరి వైపే అడుగులు వేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











