Bigg Boss: షణ్ముఖ్‌తో ఆ పని చేసి షాకిచ్చిన సిరి.. ఆమె గలీజ్ అమ్మాయి.. దారుణంగా చేస్తుంది అంటూ!

సరికొత్త కాన్సెప్టుతో తెలుగు బుల్లితెరపైకి వచ్చిన షోనే అయినా.. గతంలో దేనికీ దక్కనంత ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ.. ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది. గతంలో నాలుగు సీజన్లు భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఐదో సీజన్‌ను మొదలు పెట్టారు నిర్వహకులు. ఇది కూడా అదే రీతిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇందులో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. తాజా ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ అతడితో వింతగా ప్రవర్తించింది. దీంతో విమర్శలు ఎదుర్కొంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఎక్కువగా అవే చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా

ఎక్కువగా అవే చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా

గతంలో వచ్చిన నాలుగు సీజన్లు సక్సెస్ అవడంతో ఐదో దానిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని నిర్వహకులు చెప్పారు. అలాగే ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఆరంభం నుంచే వాళ్లు ప్లాన్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తున్నారు. తద్వారా షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేస్తూ మంచి రేటింగ్ రాబడుతున్నారు.

టైటిల్ ఫేవరెట్లు... ఆటతీరులో తేడానే

టైటిల్ ఫేవరెట్లు... ఆటతీరులో తేడానే

తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది తమ తమ రంగాల్లో ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అయితే, వీళ్లందరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి కారణం అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి అడుగు పెట్టింది. ఇక, వీళ్లిద్దరూ బయట కూడా స్నేహితులు కావడంతో షో ఆరంభం నుంచే ఫోకస్ అవుతూ దూసుకెళ్తున్నారు.

అందరూ వాళ్లనే టార్గెట్ చేస్తున్నారుగా

అందరూ వాళ్లనే టార్గెట్ చేస్తున్నారుగా

ఈ రియాలిటీ షోలో ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతుంది. అందుకే అందులో ఉన్న కంటెస్టెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో కూడా సిరి, షణ్ముఖ్ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి అయితే ఇంటర్వ్యూలోనే దారుణమైన కామెంట్లు చేశారు.

దూరంగా దగ్గరగా.. అసలేం నడుస్తుంది

దూరంగా దగ్గరగా.. అసలేం నడుస్తుంది

షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ స్నేహితులు కావడంతో హౌస్‌లో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కామెంట్లతో వీళ్లు అప్పుడప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి కలిసి ఆడుతున్నారు.. ఒక్కోసారి దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి రొమాన్స్ చేసుకుంటున్నారు.. ఒక్కోసారి దూరంగా కనిపిస్తున్నారు. ఇలా వీళ్లు బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో.. ఎందుకు అలా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ, బిగ్ బాస్ నిర్వహకులకు మాత్రం కావాల్సినంత కంటెంట్‌ను ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

సన్నీతో గొడవ.. ఒకరి కోసం ఒకరు వెళ్లి

సన్నీతో గొడవ.. ఒకరి కోసం ఒకరు వెళ్లి

గత వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'టవర్‌లో ఉంది పవర్‌'. ఇందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, యాంకర్ రవి, శ్రీరామ చంద్రలు పోటీ పడ్డారు. ఈ టాస్కు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. మరీ ముఖ్యంగా సిరి హన్మంత్‌తో ఓ విషయంలో సన్నీ వాదన పెట్టుకున్నాడు.

ఆ సమయంలో అప్పడం అయిపోతావు.. తంతా అంటూ సన్నీ కొన్ని పదాలను వాడాడు. దీంతో ఆ గొడవలోకి షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఫలితంగా వాళ్లిద్దరి మధ్య భారీ రేంజ్‌లో ఫైట్ జరిగింది. ఇది ఇద్దరి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది.

షణ్ముఖ్‌కు ప్రపోజ్ చేసి షాకిచ్చిన సిరి

షణ్ముఖ్‌కు ప్రపోజ్ చేసి షాకిచ్చిన సిరి

శుక్రవారం జరిగిన సన్నివేశాలను శనివారం ఎపిసోడ్‌లో చూపించారు. ఇందులో సన్నీతో గొడవ తర్వాత సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ మధ్య దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ కాసేపు అతడిపై విమర్శలు చేసుకున్నారు. అప్పుడు షణ్ముఖ్ ఒళ్లో పడుకుని ఉన్న సిరి.. ఐలవ్యూ అంటూ అతడికి చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్లీ ప్రపోజ్ చేసి మరీ హగ్ చేసుకుంది. దీంతో అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? అన్నది అర్థం కాక ప్రేక్షకులు జట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

Actor Harshavardhan Funny Interview With Raja Vikramarka Crew
 గలీజ్ అమ్మాయి.. దారుణంగా చేస్తుంది

గలీజ్ అమ్మాయి.. దారుణంగా చేస్తుంది

సన్నీ కూడా మానస్ దగ్గర కూర్చుని తన బాధనంతా వెల్లగక్కాడు. 'ఆడవాళ్లకు ఒక రూల్.. మగాళ్లకు ఒక రూల్‌ ఉంటుందా? ఆమె నా షర్ట్ పట్టుకుని లాగింది. మనం అయితే ఆడపిల్లల డ్రెస్ పట్టుకోగలమా? ఆమెకు కామెన్‌సెన్స్ లేకపోతే నాకు ఉంది. ఆ అమ్మాయి ఎంత దారుణంగా నోరు జారుతుందో. అంత గలేజ్‌గా మాట్లాడే అమ్మాయిని ఇంత వరకూ చూడలేదు' అని అన్నాడు. దీనికి మానస్ కూడా అవునంటూ తల ఊపేశాడు. ఇక, శనివారం ఎపిసోడ్‌లో ఇదే విషయంపై హోస్ట్ అక్కినేని నాగార్జున.. సన్నీని నిందిస్తూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X