Bigg Boss Telugu 5: షోలో దారుణ సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే రియాలిటీ ఆధారంగా నడిచే షోలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే కొన్ని అలాంటి కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో చాలా తక్కువ ప్రోగ్రామ్‌లకు మాత్రమే ఆదరణ దక్కుతోంది. దీంతో అవి విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. వేరే భాషల్లో చాలా కాలంగా ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని.. ఇటీవలే ఐదోది కూడా మొదలు పెట్టారు నిర్వహకులు. ఇక, ఈ సీజన్‌లో ఎన్నో షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో సంచలన సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri టీషర్ట్‌లో VJ Sunny చేయి పెట్టాడని పెద్ద గొడవ || Filmibeat Telugu

Photo Courtesy: Star మా and Disney+Hotstar

భారీ టీమ్‌తో మొదలు.. ఒకరు బయటకు

భారీ టీమ్‌తో మొదలు.. ఒకరు బయటకు

బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లందరిలో చాలా మంది ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ఇక, మొదటి వారం షో నుంచి 7 ఆర్ట్స్ సరయు రాయ్ ఎలిమినేషన్ అయిన సంగతి విధితమే.

సరికొత్తగా ప్లాన్... ఆరంభం నుంచే ఆసక్తి

సరికొత్తగా ప్లాన్... ఆరంభం నుంచే ఆసక్తి

బిగ్ బాస్ ఐదో సీజన్‌ ప్రారంభానికి ముందే దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే నిర్వహకులు ఈ సారి ఐదింతల ఎక్కువ మజాను అందిస్తామని చెప్పారు. దీని ప్రకారమే.. అంగరంగ వైభవంగా మొదలైన ఐదో సీజన్‌ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లలో ఎప్పుడూ కనిపించని విధంగా ఇందులో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి వారం నామినేషన్స్ టాస్కు సమయంలో మొదలైన రచ్చ.. ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. దీంతో షో ప్రేక్షకులు అనుకున్న దాని కంటే ఎక్కువ మజాను పంచుతూ ఆసక్తికరంగా సాగుతోంది.

ఈ వారం కూడా అలాగే... బాగా దారుణం

ఈ వారం కూడా అలాగే... బాగా దారుణం

గత వారం పలు గొడవలు, కొట్లాటలు, విమర్శలు ప్రతి విమర్శలతో ఎంతో రంజుగా సాగిన బిగ్ బాస్ ఐదో సీజన్.. రెండో వారంలోనూ అలాగే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో ఓ రేంజ్‌లో ఫైటింగ్స్ జరిగాయి. షో చరిత్రలోనే తొలిసారి బూతు మాటలు కూడా వినిపించాయి. ఒకానొక సందర్భంలో మీద పడి కొట్టకుంటారా అన్నంత రేంజ్‌లో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో నామినేషన్స్ ప్రక్రియ త్వరగా ముగిసినా బాగుండు అని ప్రేక్షకులు అనుకున్నారు. అంతలా ఈ ఎపిసోడ్ రచ్చ రచ్చగా కనిపించింది.

 రెండో కెప్టెన్ కోసం.. పంతం నీదా నాదా?

రెండో కెప్టెన్ కోసం.. పంతం నీదా నాదా?

ప్రతి వారం కెప్టెన్సీ పోటీ దారుల కోసం టాస్కులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ కోసం పోటీ పడే వారిని ఎంపిక చేయడానికి 'పంతం నీదా నాదా' అనే టాస్కును మొదలు పెట్టారు. ఇందులో మొదటి రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లతో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే గేమ్‌ను ఆడించారు. ఇందుకోసం వాళ్లను నామినేషన్స్ టాస్కులో విడగొట్టిగనట్లుగానే రెండు టీమ్‌లుగా ఉంచారు. ఇందులో భాగంగా 'పిల్లో'లను ఎక్కువ సంపాదించిన జట్టే గెలిచినట్లు అని చెప్పారు. దీంతో వాటి కోసం కంటెస్టెంట్లు బాగా కష్టపడ్డారు.

కంటెస్టెంట్లు అంతా దారుణంగా ఫైటింగ్

కంటెస్టెంట్లు అంతా దారుణంగా ఫైటింగ్

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా ఎవరి టీమ్‌కు సంబంధించిన పిల్లోలను వాళ్లు సంపాదించుకోడానికి కంటెస్టెంట్లు అందరూ ఎంతగానో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి మరీ రెజ్లింగ్, బాక్సింగ్ తదితర ఆటలు ఆడినట్లుగా చూపించారు. ఈ క్రమంలోనే కొందరికి గాయాలు కూడా అయ్యాయి. మరీ ముఖ్యంగా లోబో లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా కింద పడిపోయాడు. దీంతో అతడిని డాక్టర్ రూమ్‌కు సైతం పంపించారు. ఈ అన్నింటి కారణంగా కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో ఫైటింగ్స్ జరిగాయి. కొంత మంది కొట్టుకునేంత పని చేసేశారు.

సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన ఆ కంటెస్టెంట్

సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన ఆ కంటెస్టెంట్

'దొంగలున్నారు జాగ్రత్త' టాస్కు కోసం అమ్మాయిలు, అబ్బాయిలు సమానంగా పోటీ పడ్డారు. పిల్లోలను దక్కించుకునే క్రమంలోనే ఒకరిపై ఒకరు గొడవలకు కూడా వెళ్లారు. ఈ టాస్కు మొత్తంలో బిగ్ బాస్ షోలోనే సంచలన సంఘటన జరిగింది. ఎదుటి టీమ్‌ను ఓడించేందుకు కంటెస్టెంట్లు.. ప్రత్యర్థి పిల్లోలు తీసుకోవచ్చని చెప్పారు. దీంతో అమ్మాయిలు తమ తమ టీషర్ట్‌లలో వాటిని దాచుకున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్ సిరి హన్మంత్ కూడా తన టాప్ లోపల వాటిని దాచుకుంది. దీంతో సన్నీ వచ్చి ఆమె టీషర్ట్‌లో చేయి పెట్టాడని పెద్ద గొడవ చేసిందామె.

అందరి ముందే బలవంతంగా.. సస్పెన్స్

అందరి ముందే బలవంతంగా.. సస్పెన్స్

బయట ఒంటరిగా ఉన్న సిరి హన్మంత్‌ను సన్నీ పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన టీమ్‌లోని అమ్మాయిలను పిలిచి ఆమె టీషర్ట్‌లో ఉన్న పిల్లోలను తీయమన్నాడు. ఆ సమయంలో అతడు కూడా తన టాప్ లోపల చేయి పెట్టాడని సిరి హన్మంత్ ఆరోపించింది. ఈ క్రమంలోనే అతడిపై గొడవకు దిగింది. దీంతో సన్నీ తాను లోపల చేయి పెట్టలేదని పలుమార్లు సమాధానం చెప్పాడు. అయినప్పటికీ సిరితో పాటు ఆమె టీమ్‌లోని కొందరు వచ్చి అతడితో గొడవ పడ్డారు. దీంతో ఒంటరిగా కూర్చున్న అతడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇంతకీ ఏం జరిగిందన్నది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X