Bigg Boss: చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన సిరి.. ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు.. అరే షన్నూ ఏంట్రా ఇదీ!

గతంలో ఎప్పుడూ చూడని టాస్కులు, కుట్రలు కుతంత్రాలు, గ్రూపు తగాదాలు, మిడ్ నైట్ మసాలా సన్నివేశాలు ఇలా ఎన్నో రకరకాల పరిణామాలతో సాగే ఏకైక షో బిగ్ బాస్. అందుకే అసలే మాత్రం తెలియని కాన్సెప్టుతో వచ్చినా.. తెలుగు ప్రేక్షకుల దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌‌గా నిలిచింది. అదే సమయంలో ఏకంగా నాలుగు సీజన్లను కూడా ఏకధాటిగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ ఐదో సీజన్‌ను కూడా నిర్వహకులు ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టారు. దీనికి సైతం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో సరికొత్త టాస్కులతో సందడి చేస్తోన్న బిగ్ బాస్.. ఇప్పుడు మరొకటి పరిచయం చేశాడు. ఇందులో సిరి హన్మంత్ ఊహించని పని చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

వాళ్లందరి మద్దతు.. అదే రేంజ్‌లో స్టార్ట్

వాళ్లందరి మద్దతు.. అదే రేంజ్‌లో స్టార్ట్

తెలుగులో బిగ్ బాస్‌ షో ఇంతలా సక్సెస్ అవడానికి సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలూ దీన్ని ఆదరించడమే కారణం. ఫలితంగా ఈ షోపై అంతకంతకూ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ వైభవంగా ప్రారంభం అయింది. ఇక, దీన్ని గ్రాండ్‌గానే నడుపుతున్నారు. నిర్వహకులు ముందుగా చెప్పినట్లుగానే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు, ప్రేమ కహానీలు, రొమాన్స్ తదితర అంశాలను చూపిస్తూ మజాను పంచుతున్నారు. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది.

19 మంది ఎంటర్... టైటిల్ ఫేవరెట్‌గా

19 మంది ఎంటర్... టైటిల్ ఫేవరెట్‌గా

ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర లేదా వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకోగా.. అందులో ప్రముఖ నటి సిరి హన్మంత్ ఆడవాళ్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలోనే తన సత్తాను నిరూపించింది. తద్వారా బిగ్ బాస్ హౌస్‌కు మొట్టమొదటి కెప్టెన్‌గా ఎంపికైంది. అలా తన స్టామినాను చాటి చెబుతూ క్రమంగా బలపడుతోంది.

ఎప్పుడూ అతడితో కనిపిస్తోన్న బ్యూటీ

ఎప్పుడూ అతడితో కనిపిస్తోన్న బ్యూటీ

ఐదో సీజన్ ఆరంభం నుంచే సిరి హన్మంత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ ఐదో సీజన్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. దీంతో టైటిల్ వేటలో తాను ఉన్నానని చాటుకుంటూ మిగిలిన వాళ్లకు హెచ్చరికలు పంపింది. టాస్కులు కూడా బాగా ఆడుతూ వస్తోంది. కానీ, ఎప్పుడూ తన స్నేహితులు షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసే ఉంటుంది. అతడి కోసమే హౌస్‌లోకి అడుగు పెట్టినట్లు.. అతడి కోసమే టాస్కులు ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అతడు మాట్లాడకపోతే పంచాయతీలు పెడుతుంది. ఇలా ఎప్పుడూ షణ్ముఖ్ జపమే చేస్తోందీ భామ.

రంజుగా రాజ్యానికి రాజు ఒక్కడే టాస్క్

రంజుగా రాజ్యానికి రాజు ఒక్కడే టాస్క్

ప్రతి వారం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఓ టాస్కు జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' పేరిట ఇద్దరు రాజుల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. ఇందులో ఒక రాజ్యానికి రవి, మరో రాజ్యానికి సన్నీ యువరాజులుగా ఉంటారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇది పలు రకాల టాస్కులతో జరుగుతుంది. వీటిలో ఎక్కువ గెలిచిన యువరాజు.. రాజుగా నిలుస్తాడు. అతడి టీమ్‌లోని సభ్యులు కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారు. ఈ టాస్క్ మొత్తం ఎంతో రంజుగా సాగుతోంది.

మూడు టాస్కులు.. ఆమె మాత్రం అలా

మూడు టాస్కులు.. ఆమె మాత్రం అలా

'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్కులో భాగంగా రెండు టీమ్‌లకు బిగ్ బాస్ పలు రకాల గేమ్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది 'మట్టిలో మహాయుద్ధం' గేమ్‌ను రవి టీమ్ గెలుచుకుంది. ఆ తర్వాత 'రాజు గారి గోడ', 'లాక్కో లాక్కో తాడు' గేమ్‌లలో సన్నీ టీమ్ విజయం సాధించింది. వీటిలో మంచి ప్రదర్శన చేసిన వాళ్లకు యువరాజు కాయిన్స్ ఇస్తాడు. అదే సమయంలో కొందరు మాత్రం రాజు గారి ఖజానాను దొంగతనం చేస్తుంటారు. బయట టాస్కులు జరుగుతుండగా.. షణ్ముఖ్, సిరి మాత్రం కాజేయడం మీద దృష్టి సారించారు. అలా రవికి ఎర్ట్ పెట్టేశారు.

చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన సిరి

చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన సిరి


ఆరంభం నుంచే షణ్ముఖ్ జస్వంత్ ఎక్కడ ఉంటే సిరి హన్మంత్ అక్కడ ఉంటోంది. అతడు ఎవరికి సపోర్ట్ చేస్తే.. ఆమె కూడా అతడికి మద్దతు తెలుపుతోంది. అయితే, 'రాజ్యానికి రాజు ఒక్కడే' టాస్కులో మాత్రం షణ్ముఖ్.. సన్నీకి, సిరి.. రవికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తమ తమ టీమ్‌ల కోసం కన్నింగ్‌గా, శ్రమాధిక్యతతో ఆడారు. అయితే, రవి ఒక టాస్క్ గెలిచిన తర్వాత సిరి హన్మంత్ ఉన్నట్లుండి ప్లేటు ఫిరాయించింది. రవికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతూ.. సన్నీ టీమ్‌లోకి వెళ్లిపోయింది.

Recommended Video

MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచి

ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచి


తనకు సపోర్ట్ ఇవ్వమని రవి అడిగిన సమయంలో సిరి హన్మంత్ అతడికి ప్రామిస్ చేసింది. అలాగే, ఫ్రెండ్ అంటూ అతడిని గట్టిగా నమ్మించింది. చివరికి తన అసలు ఫ్రెండ్ ఉన్న సన్నీ టీమ్‌లోకి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన రవి అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, షణ్ముఖ్, సిరి ప్లాన్ ప్రకారమే అలా ఆడారని, కీలక సమయంలో తప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆమె తీసుకున్న నిర్ణయం షణ్ముఖ్ సూచనతోనే జరిగి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక, సిరి వచ్చిన తర్వాత రవి ఓ టాస్కు ఓడిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X