Bigg Boss 5: దీప్తి సునైనా బాటలోనే శ్రీహన్ కూడా.. సిరి హన్మంతుతో బ్రేకప్.. కారణమదేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోని టాప్ ఫైవ్ వరకు వచ్చిన సిరి హన్మంతు ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలవాలని అనుకుంది. అయితే చివరి దశలో ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. సిరి, షన్ను ఒకరితో ఒకరు మంచి బాండింగ్ ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభావం వీరి రియల్ లైఫ్ పై కూడా పడినట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్ - దీప్తి సునైనా బ్రేకప్ చేసుకోగా ఇప్పుడు శ్రీహాన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

పర్సనల్ లైఫ్ పై ప్రభావం

పర్సనల్ లైఫ్ పై ప్రభావం

బిగ్ బాస్ హౌస్‌లో సిరి షన్ను ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచారు. ఫైనల్ వరకు కలిసి ఉన్నారు. ఇక టాప్ లో సిరి ఎలిమినెట్ అవ్వగా షోలో షణ్ముఖ్ జస్వంత్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక సిరి, షన్ను పర్సనల్ లైఫ్ ప్రభావం చూపేలా వారి కెమిస్ట్రీ కొనసాగింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోయారు. జనవరి 1వ తేదీన దీప్తి సునైనా షణ్నుతో తన సంబంధాన్ని ముగించుకోబోతున్నట్లు ప్రకటించింది.

దీప్తి , షన్ను బ్రేకప్

దీప్తి , షన్ను బ్రేకప్

ఇక మరోవైపు దీపూ నిర్ణయాన్ని గౌరవిస్తానని షన్ను తెలియజేసిన విషయం తెలిసిందే. సిరి కారణంగానే షణ్ముఖ్, దీప్తి బంధానికి తెరపడినట్లు కొందరు నెటిజన్లు కూడా అనేక రకాల కామెంట్స్ చేశారు. ఇక సిరి, శ్రీహన్ కూడా బ్రేకప్ బాట పట్టబోతున్నారని పుకార్లు మొదలయ్యాయి.

ఎమోషనల్‌గా కనెక్ట్..

ఎమోషనల్‌గా కనెక్ట్..

సిరి మరియు షన్ను కేవలం స్నేహితులు మాత్రమే కాదని వారు ఒకరికొకరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారని చెప్పారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి, షణ్ణులు తాము మంచి స్నేహితులమని, అంతకు మించి కాదని క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ ఆగడం లేదు.

సిరి పోస్ట్ వైరల్

సిరి పోస్ట్ వైరల్

ఇక సిరి లవ్ విషయంలో కూడా ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. సిరి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసిన విధానం అనుమానాలను కలుగజేసింది. జీవితం చాలా కఠినంగా ఉంటే, నేను దాని కంటే కఠినంగా ఉన్నాను అంటూ చెప్పిన విధానం చూస్తుంటే సిరి కొంత కఠినమైన దశను దాటుతున్నట్లు కనిపిస్తోంది.

శ్రీహాన్ అప్సెట్..

శ్రీహాన్ అప్సెట్..

ఇక రీసెంట్ గా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సోషల్ మీడియా నుండి వారి గత ఫొటోలను కూడా తొలగించినట్లు తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షణ్ముఖ్‌తో సిరి సంబంధంపై సిరి ప్రియుడు అప్సెట్ అయినట్లు రూమర్స్ గట్టిగానే వచ్చాయి. సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహన్ ఆమెతో మాట్లాడటం లేదని, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కారణం అదేనా?

కారణం అదేనా?

బిగ్ బాస్ షో చివరిలో ఇద్దరు మధురమైన జంటల సంబంధాలను బ్రేక్ చేసినట్లు కనిపిస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటాము అని నిన్నా మొన్నటి వరకు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చిన వారు కూడా సడన్ గా బ్రేకప్స్ చెప్పేస్తుండడంతో మిగతా వారిపై వస్తున్న కథనాలు కూడా నెటిజన్లు నిజం అనుకుంటున్నారు. శ్రీహన్ బ్రేకప్ చెప్పడానికి కారణం షన్ను - సిరి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తలపై ఇంకా స్పందించని శ్రీహన్, సిరి ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X