Bigg Boss Telugu 5: ఇంటి కెస్టెన్‌గా చలాకీ పిల్ల.. ఇక దేశముదుర్లను ఎలా తట్టుకొంటుందో?
బిగ్‌బాస్ ఇంటికి నాయకుడు ఎంత అవసరమో అందరికి తెలిసిందే. ఇంటికి నాయకుడిగా వ్యవహరించే కెప్టెన్ లేకపోతే.. క్లాస్‌లో టీచర్ లేకపోతే ఎలా గందరగోళం ఉంటుందో అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒకరు చెప్పేది మరొకరు వినరు. చెప్పింది పట్టించుకోకుండా తమకు తోచినట్టు వ్యవహరించడంతో ఇంటి సభ్యుల మధ్య గత నాలుగు రోజులుగా అదే కనిపించింది. ఎట్టకేలకు బిగ్‌బాస్ తెలుగు 5 షోలోని ఇంటికి ఇప్పుడు కెప్టెన్ వచ్చేశాడు. ఇంతకు కెప్టెన్ ఎవరంటే..

సూపర్ పవర్ టాస్క్‌తో
గత మూడు రోజులుగా ఇంటికి కావాల్సిన కెప్టెన్ ఎంపిక గురించి బిగ్‌బాస్ టాస్క్‌లు పెడుతున్నారు. సూపర్ పవర్ టాస్క్ ద్వారా కెప్టెన్ ఎంపికను నిర్ధారించేందుకు బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే విశ్వ, మానస్, సిరి హన్మంతు ముగ్గురు ఇంటిలో సూపర్ పవర్‌ను సాధించారు. తాజా సమాచారం ప్రకారం.. బుధవారం గేమ్‌లో హమీదా సూపర్ పవన్‌ను సాధించిన ఈ ముగ్గురికి జత కలిసింది.

కెప్టెన్సీ రేసులో నలుగురు
ఇక సూపర్ పవర్ సాధించిన నలుగురు యాక్టర్ విశ్వ, యాక్టర్ మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు, హమీదా ఖాతూన్ నలుగురు కెప్టెన్సీ టాస్క్‌కు సిద్దమని ప్రకటించారు. కెప్టెన్సీ పోటీ కోసం నలుగురికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ముగ్గురు ఎవరికి వారే ప్రతిభను చూపినట్టు తెలిసింది. ఈ పోటీలో తనకు నచ్చిన కంటెస్టెంట్‌కు కొందరు తమ మద్దతు ప్రకటించినట్టు సమాచారం.

తొలి కెప్టెన్‌గా సిరి హన్మంతు
అయితే యాక్టర్ విశ్వ, మానస్, హమీదాతో జరిగిన టఫ్ ఫైట్‌లో సిరి హన్మంతు కెప్టెన్ పదవిని చేజిక్కించుకొన్నట్టు సమాచారం. దీంతో బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ తొలి వారానికి సిరి హన్మంతు కెప్టెన్‌గా నిలిచింది. దాంతో ఈ సీజన్‌కు తొలి కెప్టెన్‌గా మహిళ కావడం విశేషంగా మారింది. అయితే మహా ముదుర్లను ఎలా తట్టుకొని కెప్టెన్‌గా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి..
సిరి హన్మంతు విషయానికి వస్తే.. న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత స్టార్ మాలో ఉయ్యాల జంపాలా సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి లాంటి సీరియల్స్ నటించి మెప్పించింది.

సిరి హన్మంతు సినిమా కెరీర్ ఇలా..
ఇక టెలివిజన్ రంగం నుంచి 2019లో సినీరంగంలోకి ప్రవేశించింది. ఇద్దరి లోకం ఒకటే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత విజయ్ కుమార్ కొండా దర్శకత్వం ఓరేయ్ బుజ్జిగా చిత్రాల్లో నటించారు. అలాగే పలుకే బంగారమాయేనా, క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవలే హే సిరి యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 5లోకి తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











