Bigg Boss 5: సిరి హన్మంతు సంపాదన మొత్తం ఎంతంటే.. మొదటిసారి అత్యధికంగా..

బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో సిరి హనుమంతు కూడా టాప్ ప్లేస్ లో ఉంది అని చెప్పాలి. ఆమె టైటిల్ విన్నర్ గా నిలవలేక పోయినప్పటికీ కూడా టాప్ 5 వరకు వచ్చే వరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా అయ్యారు. అయితే మధ్యలో సిరి చేసిన కొన్ని పొరపాట్లు కారణంగా నెగటివ్ కామెంట్స్ అందుకోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా సిరి హనుమంతు బిగ్ బాస్ షో ద్వారా మంచి ఆదాయాన్ని వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే..

ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే..

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సిరి హనుమంతు గత ఏడాదిలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసిందట. ఇక ఆమె మొత్తానికి సీజన్ 5 కి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి అమ్మడు మొదటివారంలోనే తన క్యారెక్టర్ని చాలా ఓపెన్ గానే బయటపెట్టేసింది. మొదటి నుంచి కూడా షణ్ముఖ్ జస్వంత్ తో ఎక్కువగా ఫ్రెండ్లిగా ఉంటూ వచ్చింది.

ఆ విషయంలో నెగిటివ్ కామెంట్స్

ఆ విషయంలో నెగిటివ్ కామెంట్స్

సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా అందమైన అమ్మాయి ఈసారి హైలెట్ కాబోతుంది అని అనేక రకాల ప్రశంసలు అందుకుంది. కానీ ఆమె క్యారెక్టర్ ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ విషయంలో సిరి హద్దులు దాటుతుంది అనే కామెంట్స్ ఎన్నో వచ్చాయి. ఇక ఆఖరికి సిరి తల్లి కూడా లిమిట్స్ దాటకుండా ఉంటే మంచిది అని హెచ్చరిక చేసే వరకు వచ్చింది.

అందువల్ల భారీగా ఓట్లు..

అందువల్ల భారీగా ఓట్లు..

ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ ద్వారా సిరి హనుమంతు మరొక స్థాయిలో క్రేజ్ అందుకుంది అనే చెప్పాలి. ఎక్కువగా షణ్ముఖ్ తో పాటు ఆమె సన్నీతో స్నేహన్ని కొనసాగించింది. మధ్యలో సిరి ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెకు షణ్ముఖ్ నుంచి మంచి సపోర్ట్ లభించడంతో ఓట్లు కూడా భారీగానే లభించాయి.

టాప్ 5 వరకు..

టాప్ 5 వరకు..

షణ్ముఖ్ జస్వంత్ తో సిరి కొనసాగించిన ప్రత్యేకమైన కెమిస్ట్రీ ఆమెకు బాగా హెల్ప్ అయింది. అయితే షణ్ముఖ్ పై మాత్రం తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రభావాన్ని చూపించింది. ఇక సిరి మధ్యలోనే వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నప్పటికీ చాలా తెలివిగా టాస్క్ లను పూర్తి చేస్తూ చివరి వరకు కొనసాగింది. ఇక టాప్ ఫైవ్ లో వరకు వచ్చిన బిగ్ బాస్ టైటిల్ అందుకోవాలని ఎంతగానో కష్టపడింది.

 సిరి రెమ్యునరేషన్ ఎంతంటే?

సిరి రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినప్పటికీ కూడా సిరికి రెమ్యునరేషన్ పరంగా ఇన్ని రోజులు ఉన్నందుకు మంచి అమౌంటు దక్కిందట. సిరి 15 వారాల పాటు కొనసాగింది కాబట్టి వారానికి ఆమెకు రెండు లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఆమెకు 25 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా తన కెరీర్లోనే ఇది అత్యధిక సంపాదన అని చెప్పవచ్చు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shanmukh - Siri Hanmanth Track Never Ends || Filmibeat Telugu
సన్నీ అందరికంటే ఎక్కువగా

సన్నీ అందరికంటే ఎక్కువగా

బిగ్ బాస్ సీజన్ 5 లో వీజే సన్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతనికి రెమ్యునరేషన్ తో పాటు భారీగా ప్రైజ్ మనీ కూడా వచ్చింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచినందుకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 25 లక్షల విలువగల ఫ్లాట్ కూడా ఇచ్చారు. ఇక లక్షన్నరకు పైగా విలువ చేసే ఒక బైక్ కూడా ప్రజెంట్ చేశారు. ఇక 20 లక్షల వరకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ కూడా దక్కింది. ఈ విధంగా బిగ్ బాస్ షో ద్వారా 97లక్షల వరకు ఆదాయాన్ని అందుకున్నట్లు చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X