Bigg boss 5 Telugu: హగ్స్, కిసెస్‌పై తల్లి సీరియస్... సిరి అప్సెట్.. కంటతడి పెట్టుకున్న షణ్ముక్!
బిగ్ బాస్ లో ఎన్ని కొట్లాటలు జరిగినా కూడా హౌస్ మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే సమయానికి అందరూ కూడా చాలా స్నేహంగా మారిపోతుంటారు. ఎలాంటి గోడవలైనా సరే కుటుంబ సభ్యులు రాగానే మర్చిపోయి చాలా సరదాగా గడుపుతుంటారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్న సమయంలో కంటెస్టెంట్స్ అందరికి కూడా బిగ్ బాస్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మరింత ఎమోషనల్ అయ్యారు. గత ఎపిసోడ్ లో కాజల్ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక గురువారం ఎపిసోడ్ లో శ్రీరామ్, మానస్ , సిరి కుటుంబ సభ్యులు వచ్చారు. దీంతో హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Recommended Video

అక్కా అని పిలవండి
మొదట శ్రీరామచంద్ర సోదరి చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సరే గెలిచే ఇంటికి రావాలి అంటూ పాజిటివ్ గా స్పందించారు. అలాగే ఎదుటి వారిని అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. ఇక మానస్ తల్లి వచ్చి రాగానే హౌస్ లో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందరితో ను చాలా ఫ్రెండ్లిగా మాట్లాడుతూ అందరూ తనను ఆంటీ అనకుండా అక్కా అని పిలవాలని కోరారు. దీంతో అందరూ ఒక్క క్షణం వరకు షాక్ అయ్యారు.

షన్ను అప్సెట్
ఇక సిరి తల్లి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కసారిగా షన్ను మూడ్ మారిపోయింది. మొన్నటి వరకు ఒక తరహాలో ఉన్న షన్ను సిరి తల్లి ఇచ్చిన డోస్ కు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. అంతే కాకుండా తనలో తానే తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా షన్ను చాలా అప్సెట్ అయినట్లు అర్ధమయ్యింది. ఇక సిరి విషయంలో అతను డిస్టన్స్ మెయింటైన్ చేయడమే కరెక్ట్ అని కూడా అర్ధమయ్యింది.

హగ్గులు చేసుకోవడం నచ్చలేదు
నువ్వు హగ్ చేసుకోవడం ఏ మాత్రం నచ్చలేదు అంటూ సిరి తల్లి షన్నుకి డైరెక్ట్ గా చెప్పేసింది. తండ్రి లేని పిల్ల కదా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నట్లుగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు అనిలించింది. అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవ్వడం ఏ మాత్రం నచ్చలేదు అంటూ.. ముఖ్యంగా హగ్గులు చేసుకోవడం అస్సలు నచ్చలేదని ముక్కు సూటిగా కౌంటర్ ఇచ్చేసింది. ఇక ఆమె అలా చెప్పగానే షన్ను నోట మాట రాలేదు.

కంట్రోల్ చేసిన సిరి
ఇక సిరి తన తల్లిని వెంటనే పక్కకు తీసుకు వెళ్లి అలా అనకూడదు అంటూ నచ్చజెప్పింది. అయితే తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉందని అనడంతో అందరిముందు కాకుండా పర్సనల్ గా తనకు ప్రత్యేకంగా పక్కకు పిలిచి చెప్పాలి కదా అంటూ తల్లిని కంట్రోల్ చేసింది. ఇక ఆ తరువాత షన్ను బాధపడ్డాడు అని హగ్గుల విషయంలో సిరి కూడా అప్సెట్ అయ్యింది.

టాప్ 5 లో ఉండాలి
ఇక సిరి టాప్ 5లో ఉండాలి అని తల్లి శ్రీదేవి చాలా బలంగా కోరుకుంది. అంతే కాకుండా కుటుంబ పరిస్థితులను గురించి చెప్పికొని ఎంతగానో బాధపడింది. పాన్ షాప్ ద్వారా పిల్లలను పోషించినట్లు వివరణ ఇచ్చారు. ఇక షన్ను సిరి మదర్ మాటలకు తనలో తానే బాధపడుతూ డిస్టన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక విదంగా అతను ఆ మాటలు గుర్తు చేసుకొని ఏడ్చేశాడు కూడా. మరి వీరి బాండింగ్ ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి.'


Click it and Unblock the Notifications











