శ్రీ హాన్ లవ్ స్టొరీ బయటపెట్టిన సిరి.. అతను ముస్లిం, నేను హిందూ.. రిజెక్ట్ చేశాడు.. అయినా సరే పట్టుబట్టి?

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఈ షో మన దగ్గర ఎవరూ ఊహించని రీతిలో ఆదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే సిరి హనుమంత్‌ తన లవ్ స్టోరీ వెల్లడించింది. గతంలో తన ఫస్ట్ లవ్ స్టోరీ వెల్లడించగా ఇప్పుడు తాజాగా తన సెకండ్ లవ్ స్టోరీ వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

 శ్రీహాన్ అనే నటుడితో

శ్రీహాన్ అనే నటుడితో

యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సిరి హన్మంత్.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఉయ్యాలా జంపాల', 'అగ్నిసాక్షి' సహా పలు ధారావాహికల్లో నటించింది. అలాగే, 'సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఈ క్రమంలోనే శ్రీహాన్ అనే నటుడితో ప్రేమలో పడింది. ఓ కార్యక్రమంలోనే వీళ్లకు ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. త్వరలోనే వాళ్ళు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో సిరి హన్మంత్‌కు బిగ్ బాస్ ఆఫర్ రాగా ఆమె హౌస్ కి వచ్చింది.

ఫస్ట్ లవ్ గురించి

ఫస్ట్ లవ్ గురించి


ఇక ఆ మధ్య తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చి తెగ ఏడ్చేసిన ఈ భామ ఇప్పుడు తన సెకండ్ లవ్ గురించి కూడా చెప్పింది. తన పదో తరగతిలోనే ఎదురింట్లో ఉండే విష్ణు అనే అబ్బాయిని ప్రేమించానని ఆమె చెప్పింది. తను ఎప్పుడు ఎప్పుడు చెప్తాడా? అని ఎదురు చూసి చివరికి అతను ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చేశాను అని, ఇద్దరం లేచిపోయి రిలేషన్ షిప్‌లో కొన్నాళ్లు ఉండి.. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చినట్టు కూడా చెప్పింది.

 విష్ణుతో లేచిపోయి

విష్ణుతో లేచిపోయి

తెల్లారితే వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ పెట్టుకుని విష్ణుతో లేచిపోయినట్టు చెప్పిన సిరి అతను యాక్సిడెంట్ కావడంతో చనిపోయాడని వెల్లడించింది. అయితే ఆ సమయంలో నిద్రపోతున్న తనకు మెలుకువ కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు శ్రీహాన్ అనే యూట్యూబ్ స్టార్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది.

కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశాం

కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశాం

శ్రీహాన్ నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశామని ఆ సమయంలో అతని కేరింగ్ నచ్చి అతనిపై ఇష్టంగా బాగా పెరిగిపోయిందని వెల్లడించింది. చాన్నాళ్లు తను ప్రపోజ్ చేస్తాడని వెయిట్ చేస్తే ఆయన చేయలేదని, ఇక అతను చెప్పలేక పోతున్నాడని గ్రహించి తానే వైజాగ్ బీచ్‌ రోడ్‌లో ప్రపోజ్ చేశానాని వెల్లడించింది. అయితే ఆయన రిజెక్ట్ చేశాడని, దీంతో నన్ను రిజెక్ట్ చేస్తాడా? నేనంటే ఇష్టం ఉంది కాబట్టే అతని దగ్గర ఓపెన్ అయ్యాను. కానీ అతను నా లవ్‌ని రిజెక్ట్ చేశాడని చెప్పుకొచ్చింది.

రిజెక్ట్ చేశారు

రిజెక్ట్ చేశారు

అప్పుడు నా బాధ లవ్ చేయలేదని కాదు.. రిజెక్ట్ చేశాడని అని చెప్పుకొచ్చింది. ఆయన ముస్లిం.. నేను హిందూ.. కావడం వల్ల ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్లని బాధపెట్టాలి.. నిన్ను కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కాదు అని సర్ది చెప్పాడని అన్నారు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు అయినా అతను అలా చెప్పేసరికి సమస్య లేదు నువ్ నాకు కావాలంతే అని చెప్పానని, వారంలో తిరిగి నువ్వే నా వెనుక పడేట్టు చేస్తాను.. లేదంటే నా పేరు మార్చుకుంటా అని చెప్పానని చెప్పుకొచ్చింది.

సరిగ్గా వారం తర్వాత

సరిగ్గా వారం తర్వాత

అలా ఛాలెంజ్ ప్రకారం సరిగ్గా వారం తర్వాత నేను అన్నట్టుగానే తనే నాకు తిరిగి ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది. వారం తర్వాత తనే వచ్చి నిన్ను ప్రేమించా.. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడితే అమ్మకి కూడా తనంటే చాలా ఇష్టం. అందుకే మొదట్లో ఒప్పుకోకపోయినా తరువాత ఓకే చేసిందని చెప్పుకొచ్చింది.

Recommended Video

Actor Harshavardhan Funny Interview With Raja Vikramarka Crew
మొండి దాన్ని

మొండి దాన్ని


నేను మొండిదాన్ని అని మా అమ్మకి బాగా తెలుసన్న ఆమె అతని విషయంలో కూడా అలాగే చెప్పానని, నువ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతనితోనే ఉంటానని చెప్పానని, దీంతో అమ్మ ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. కెరియర్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుందని పెళ్లిని వాయిదా వేస్తున్నామన్న ఆమె నేను యాక్ట్ చేయడం వాళ్ల ఫామిలీకి అభ్యంతరం లేదని, పెళ్లయిన తర్వాత కూడా అభ్యంతరం చెప్తారని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X