Bigg Boss 5: బలవంతంగా షన్నుకు సిరి హగ్గులు.. ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొందరు మాత్రం ఎప్పటిలానే వారి ప్రవర్తనతో కాస్త చిరాకు తెప్పిస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ కూడా కొన్నిసార్లు సహనం కోల్పోయి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నామినేషన్ లోనే అసలు సమస్యలు తెరపైకి వస్తాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 12 వారాల అనంతరం మరింత ఆసక్తికరంగా మారింది. టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు ఉంటారు అనే విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈ వారం కెళ్లిపోయే బలమైన కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రేటింగ్స్ అయితే తగ్గడం లేదు
బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ ఆయునప్పుడు కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు ఈసారి అంతగా మెప్పించలేదు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక అలాంటి కామెంట్స్ ఇప్పటికి వస్తున్నా కూడా షో రేటింగ్స్ అయితే తగ్గడం లేదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్ లలో వారి తెలివిని ఉపయోగిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్నారు.

రవి ఎలిమినేషన్ పెద్ద మిస్టరీ
ఇక యాంకర్ రవి గత వారం ఎలిమినేట్ అవ్వడం పెద్ద మిస్టరీ అంటూ అతని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అతని కంటే మిగతా కంటెస్టెంట్స్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయా? అనే అనుమానాలు చాలానే వచ్చాయి. హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా యాంకర్ రవి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రవి ఉంటే బాగుండేది అని అందరు మాట్లాడుకుంటున్నారు.

షన్ను వద్దన్నా సిరి హగ్గులు
ఇక బిగ్ బాస్ 86వ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ హడావుడి కొనసాగుతున్న క్రమంలో కొందరు ఎప్పటిలానే వారి స్వభావంతో హైలెట్ అయ్యేలా కనిపించారు. ఇక రవి టాప్ 3లో రవి తప్పకుంటా ఉంటాడని అనుకున్నట్లు షన్ను వివరణ ఇవ్వగా సిరి ఎప్పటిలానే హగ్గులతో ఇబ్బంది పెట్టేసింది. షన్ను ఎంత వద్దంటున్నా కూడా వినకుండా సిరి కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేసింది.

బిగ్ బాస్ వార్నింగ్
ఇక ప్రియాంక అయితే రవి లేకపోవడాన్ని తట్టుకోవడం లేదు. అతని లేని లోటు కనిపిస్తోందని సిరితో చెప్పుకొని బాధపడింది. అంతే కాకుండా సిరిని పక్కనే ఉండాలని కూడా కోరుకుంది. వీరిద్దరి మధ్య కొంత సేపు ఎమోషనల్ ట్రాక్ అయితే గట్టిగానే నడిచింది.
ఇక నామినేషన్ సమయంలో ప్రియాంక ఎవరిని నామినేట్ చేయాలో కూడా అర్థం కావడం లేదని కొంత సేపు సమయాన్ని వృధా చేయగా ఆమెకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. నామినేట్ చేయకపోతే నేరుగా నువ్వే నామినేట్ అవుతావాబి బిగ్ బాస్ హెచ్చరించడంతో ప్రియాంక సిరిని కాజల్ ను నామినేట్ చేసింది.
Recommended Video

లేకపోతే విమర్శలు తప్పవు?
ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి. కాజల్ కూడా పోటీలో ఉందని అంటున్నారు. ఆమె టైటిల్ గెలిస్తే ఈసారైనా ఒక మహిళ బిగ్ బాస్ లో సత్తా చాటింది అనే మంచి పేరు ఈ షోకు దక్కుతుంది. లేకపోతే విమర్శలు తప్పవని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











