Bigg Boss 5: అతనే నా హీరో.. నాగార్జున ముందే నిజం ఒప్పేసుకున్న సిరి..!

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంతమంది బంధాలు మాత్రమే చాలా బలంగా ఉంటాయి. ఏలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా అవసరమైన సమయంలో కలిసి ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే వారి మధ్య లోనే బిగ్ బాస్ ఎక్కువగా ట్విస్ట్ లు పెడుతుంటాడు. టాస్క్ లలో భాగంగా ఒకరిపై మరొకరి ద్వేషం పెంచుకునేలా చేస్తాడు.

ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో ఆ డోస్ ఎంత పెంచుతున్న కూడా స్నేహితులుగా ఉన్న సిరి, షన్ను, జెస్సి కలిసికట్టుగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన సమయంలోనే గొడవ పడుతూ మళ్ళీ టాస్క్ ముగిసిన తర్వాత ఎప్పటిలానే కలిసిమెలిసి కనిపిస్తున్నారు. ఇక తనే నా హీరో అంటూ సిరి మరొకసారి నాగార్జున ముందు నిజం ఒప్పుకుంది.

టాస్క్ లలో డోస్ పెంచి..

టాస్క్ లలో డోస్ పెంచి..

బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఈ సారి కొంచెం హై రేంజ్ సెలబ్రిటీలను కూడా తెస్తారని అందరూ అనుకున్నారు. గత ఏడాది వచ్చిన సెలబ్రిటీల విషయంలో ప్రేక్షకులు కొంత వరకు అప్సెట్ అయ్యారు. ఈ సారి అంతకు మించి ఉంటుంది అని మొదట్లో రూమర్స్ బాగానే వచ్చాయి కానీ సీజన్ 5 లో కొంతమంది ఎంట్రీపై మాత్రం ప్రేక్షకులు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ టాస్క్ లలో డోస్ పెంచి మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

అతన్ని కెప్టెన్ చేయాలని..

అతన్ని కెప్టెన్ చేయాలని..

ఇక హౌస్ లో మొదటి నుంచి కూడా మంచి స్నేహితులుగా ఉన్న త్రిమూర్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షణ్ముఖ్ జస్వంత్ సిరి జెస్సి ముగ్గురు కూడా టీమ్ వర్క్ చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ముఖ్యంగా షన్నుని కెప్టెన్ చేయాలి అనే ఆలోచనతో సిరి జెస్సి ఇద్దరు కూడా సైలెంట్ గా అతనికి సపోర్ట్ చేశారని క్లియర్ గా అర్థమైంది.

గొడవలు ఎన్ని వచ్చినా

గొడవలు ఎన్ని వచ్చినా

అయితే సిరి షన్ను మధ్య ఇటీవల చాలా గొడవలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో అయితే దాదాపు విడిపోతున్నారు అనే రేంజ్ లో గొడవలు పెట్టుకున్నారు. కానీ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. షణ్ముఖ్ అలిగినప్పుడు సిరి ఓదారుస్తూ ఉంటే.. సిరి బాధలో ఉన్నప్పుడు షణ్ముఖ్ జస్వంత్ వెళ్లి ఓదారుస్తాడు. ఇక వీరిద్దరి చుట్టూ జెస్సీ తిరుగుతున్నాడు. కానీ అతనిని ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
అతనే నా హీరో..

అతనే నా హీరో..

ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హీరో ఎవరు విలన్ ఎవరు అని అడిగినప్పుడు సిరి చాలా ఓపెన్ గా షన్ను నా హీరో అని మరోసారి తన మనసులో మాటను చెప్పింది. అసలైతే షన్ను ప్రవర్తించిన తీరుకి సిరి ఈసారి అతని వైపు వెళ్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే షన్ను సూటిపోటి మాటలతో చాలా గోరంగా ఆమెను బాధపెట్టాడు. అయినప్పటికీ కూడా నాగార్జున ముందు సిరి అతనే నా హీరో అంటూ మనసు విప్పి మాట్లాడింది. ఇక ప్రియాంక సింగ్ విలన్ అని తేల్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X