Bigg Boss 5: నియంత మాటే శాసనం.. కాజల్ పై రివెంజ్ ప్లాన్ చేసిన శ్రీరామ్.. కోల్డ్ వార్!
బిగ్ బాస్ మొత్తానికి 12 వారంలో కి చాలా ఆసక్తిగా అడుగుపెట్టింది. ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతాను అనే విషయం కూడా చా ఆసక్తి గా మారుతుంది. గత వారం అయితే ఆనీ మాస్టర్ వెళ్లి పోతుంది అని ప్రేక్షకులు ముందుగానే ఊహించారు. కానీ ప్రస్తుతం ఉన్న వారు మాత్రం చాలా బలంగా కొనసాగుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారో ఊహించడం కూడా కాస్త కష్టంగానే ఉంది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అనేది కూడా చాలా ముఖ్యం. పోటీ తీవ్రత అయితే ఊహించని విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రోజులు గడుస్తున్నకొద్దీ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా సీరియస్ గా చూసేస్తున్నారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలు కాబోతోంది. ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

నియంత మాటే శాసనం
12వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నియంత మాటే శాసనం అని బిగ్ బాస్ సరి కొత్త ఆటను స్టార్ట్ చేస్తున్నాడు. గార్డెన్ ఏరియా లో ఒక నియంత సింహాసనం ఉంది. అయితే బజర్ సౌండ్ రాగానే ఎవరు ముందుగా అందులో కూర్చుంటారో వారు సేవ్ అవ్వడమే కాకుండా నియంతగా కూడా వ్యవహరిస్తారు. అయితే మొదటి సారి సిరి చటుక్కున వెళ్లి సింహాసనం లో కూర్చోవడం విభిన్నంగా అనిపించింది. ఆమె వెంటనే ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు అంటూ మహేష్ బాబు డైలాగ్ కూడా కొట్టేసింది.

నియంతను ఒప్పించాలి
కెప్టెన్సీ టాస్క్ అయితే మెల్లగా నవ్వులతోనే మొదలైనప్పటికీ కూడా ఆ తర్వాత ఊహించని పరిణామాలను క్రియేట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. రవి సన్నీ ఇద్దరూ కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు. కానీ ముందు ముందు వారు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి వీలు లేదు. ఇక మిగతా కంటెస్టెంట్స్ అయితే వారిని వారు సేవ్ చేసుకోవడానికి మిగతా చాలెంజ్ లో పాల్గొనవలసి ఉంటుంది. ఇకపోతే చాలెంజ్ లో బాటమ్ 2 గా నిలిచిన సభ్యులు వారి నుంచి ఒకరిని సేవ్ చేయమని నియంత దగ్గరకు వెళ్లి తగిన కారణాలు చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది.

కాజల్ పై రివెంజ్ ప్లాన్
ఇక శ్రీరామ్ నియంతగా ఉన్న సమయంలో కాజల్ , రవి ఇద్దరు కూడా సేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ శ్రీరామచంద్ర గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాజల్ పై రివెంజ్ ప్లాన్ చేసినట్లు అతని మాటల్లోనే అర్ధమవుతుంది. కెప్టెన్ అంటే నీ దృష్టిలో ఏమిటి అని అడగడంతో నేను కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాను అంతే.. అంటూ కాజల్ శ్రీరామ్ కు సమాధానం ఇచ్చేసింది. మొన్న రెండు ఫొటోలు కాల్చేశావు కదా.. ఆ సమయంలో కెప్టెన్ గా నిర్ణయం ఏమిటి అంటూ శ్రీరామ్ మరో ప్రశ్న అడగడంతో కాజల్ మొండిగానే సమాధానం చెప్పింది.
Recommended Video
డొంక తిరుగుడు ఎందుకు?
అసలు కెప్టెన్ గా ఉంటే కాజల్ ఫైర్ ఇంజన్ లోనే కూర్చోదని చెప్పగా.. ఒకవేళ కూర్చుంటే ఎవరి ఫొటో కాల్చేస్తావని శ్రీరామ్ అడిగాడు. అసలు నేను కెప్టెన్ అయితే అక్కడ ఉండనే ఉండనని కాజల్ చెప్పగా.. అది కరెక్ట్ సమాధానం కాదని తాను రవిని కెప్టెన్ కంటెస్టెండర్ గా సెలెక్ట్ చేస్తున్నట్లు శ్రీరామ్ వివరణ ఇచ్చారు. అది నాకు ముందే తెలుసని చెప్పిన కాజల్ దానికి డొంక తిరుగుడు ఎందుకని మరో కౌంటర్ ఇచ్చింది. అర్హత కలిగిన వారే కెప్టెన్సీ బ్యాండ్ అందుకుంటారు అంటూ శ్రీరామ్ చప్పట్లు కొడుతూ ఆన్సర్ ఇచ్చాడు... మరి ఈ పరిణామాలు హౌస్ లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











