Bigg Boss 5: RJ కాజల్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన శ్రీరామచంద్ర.. స్ట్రాటజీ అంటే ఇది!
బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతీ ఒక్కరు వారి స్ట్రాటజీనీ విభిన్నంగా ఫాలో అవుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కొన్నిసార్లు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఏదో ఒక సందర్భంలో తేడా కొట్టేస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రంగులు మార్చే కంటెస్టెంట్స్ అయితే చాలా మంది ఉంటారు. మొదట ఎంత తియ్యగా మాట్లాడినా కూడా అవసరం వచ్చినప్పుడు మాత్రం వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉంటారు. కాజల్ రామచంద్ర విషయంలో అదే జరుగుతోంది. ఈ వారం నామినేషన్లలో వీరి మధ్య జరిగిన గొడవ కాస్త హైలెట్ గా నిలిచింది. అయితే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ పుట్టలో వేలు పెడతాను అంటూ శ్రీ రామచంద్ర చాలెంజ్ చేశాడు. అనుకున్నట్లుగానే అతను ఆమెను డేంజర్ జోన్ లో పడేశాడు.

ఎంత తెలివిగా ఆలోచిస్తుంది అంటే..
కాజల్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అయితే ఆమె ఎన్ని ప్రణాళికలు రచించినా కూడా ఎవరో ఒకరు ముందే పసిగట్టేస్తున్నారు. కాజల్ ఎంత తెలివిగా ఆలోచిస్తుంది అంటే తన ప్రత్యర్ధులను ఢీ కొట్టడానికి ఒక బలమైన వారిని స్నేహంగా చేసుకొని ఉసిగొలిపుతుంది. ఆ విషయంలో నెగిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక హౌస్ నుంచి ఇప్పటివరకు వెళ్లిపోయిన అందరు కంటెస్టెంట్స్ కూడా కాజల్ పై చాలా కామెంట్స్ చేశారు.

ప్రత్యర్థి ఎవరైనా సరే
ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కాజల్ తనదైన శైలిలో ముందుకు వెళుతుంది. వీలైనంత వరకు తనకు నచ్చినట్లుగా ఆటను కొనసాగిస్తోంది. అయితే ప్రత్యర్థి ఎవరైనా సరే కూడా ఆమె ఏ సమయంలోనూ ఆమె వెనుకడుగు వేయలేదు. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తోంది. ఎదురుగా రవి ఉన్నా విశ్వ ఉన్నా సరే ఆమె సరాసరి గొడవలకు దిగేందుకు ప్రయత్నం చేసింది. కానీ కాజల్ చెప్పిన మాటలను మళ్లీ మార్చేసి మాట్లాడడం ఆమెపై కొంత నెగిటివ్ కామెంట్స్ ను అందించింది

శ్రీరామ్ తో గొడవ
ఇక ఈ వారం నామినేషన్స్ లో శ్రీరామ్ తో కూడా గొడవకు దిగింది. శ్రీ రామచంద్ర తనతో సరిగా మాట్లాడటం లేదు అని మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా కూడా అతను చాలా చిన్న చూపు చూస్తున్నాడు అని నెగిటివ్ గా స్పందించి నామినేట్ చేసింది. అయితే అంతకుముందే కాజల్ తనతో క్లోజ్ గా మాట్లాడద్దు అంటూ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మళ్ళీ నామినేషన్స్ లో అలా స్పందించడంతో శ్రీరామ్ కు ఒక్కసారిగా ఆగ్రహం మొదలైంది. నువ్వే జస్ట్ మేట్స్ అని చెప్పావు మళ్ళీ ఇప్పుడు మాట్లాడలేదు అని అంటున్నావు అని అక్కడే కౌంటర్ ఇచ్చేశాడు.

కాజల్ ను డేంజర్ జోన్ లో పడేసిన శ్రీరామ్
అయితే నామినేషన్ లో శ్రీరామచంద్ర కాజల్ కు ఒక ఛాలెంజ్ చేశాడు. నన్ను అనవసరంగా నామినేట్ చేశావు నా పుట్టలో వేలు పెట్టారు కాబట్టి తప్పకుండా నీ పుట్టలో కూడా వేలు పెడతాను అంటూ ఆమెకు తగ్గట్టుగానే డైలాగ్ వదిలాడు. అయితే మంగళవారం రాత్రి ఎపిసోడ్ లో ఒక టాస్క్ పెట్టిన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పది మందిని అందులో పాల్గొనేలా చేశాడు. బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుగా విభజించిన బిగ్ బాస్ బ్యాగేజ్ జోన్‌లో కంటెస్టెంట్ల ఫోటోలతో కూడిన బ్యాగ్ లను తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్‌లోకి రావాల్సి ఉంటుంది. అయితే తెలివిగా శ్రీ రామచంద్ర కాజల్ ఫోటో ఉన్న బ్యాగు పట్టుకుని సేవ్ చేయండి లోకి వెళ్లకుండా కావాలని ఆగిపోయాడు. రామచంద్ర డేంజర్ జోన్ లోకి వస్తాను అని తెలిసినప్పటికీ కూడా కాజల్ ఫోటో ఉందని ఆమెను డేంజర్ జోన్ లోకి నెట్టాలని స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. దీంతో కాజల్ ఈ వారం మళ్ళీ నామినేషన్ లోకి వచ్చింది. మరి కాజల్ డేంజర్ జోన్ లో నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











