Bigg Boss Telugu 5: సన్నీ, షన్ను ఫాన్స్ కు షాక్.. సైలెంట్ గా టాప్ పొజిషన్ కు మరో కంటెస్టెంట్.
బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరింది. ఇప్పటి దాకా వారం వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే లెక్కలు సాగుతూ ఉండగా ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉంటారు అనే దాని మీద లెక్కలు వేస్తున్నారు. అయితే ఊహించని కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

ఆట తీరును చూసి
బిగ్ వాష్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో షన్ను, సన్నీ ఇద్దరూ టాప్ 2లో ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు.ప్రస్తుతం షన్నుకి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. సన్నీకి మొదట్లో అంత ఫాలోయింగ్ లేక పోయినా బిగ్ బాస్‌లో అతడి ఆట తీరును చూసి అభిమానులు పెరుగుతున్నారు. దానికి తోడు సన్నీకి బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత ఉండడంతో అతని మెట్యూరిటీకి ఫాన్స్ పెరుగుతున్నారు.

మరి కొన్ని రోజులే
అయితే బిగ్ బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలేకి మరి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మనందరికీ తెలిసిన సంగతే శ్రీరామ చంద్ర ఫైనల్ టిక్కెట్ గెలుచుకున్నాడు. ఈ దెబ్బతో శ్రీరామ చంద్ర అభిమానులు తిరిగి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌స్ లోకి వచ్చారు. తమ అభిమాన కంటెస్టెంట్ ఫైనల్ టిక్కెట్ గెలుచుకున్న క్రమంలో ఉత్సాహంగా ఉన్నారు. ఈ షోలో శ్రీరామ చంద్ర కచ్చితంగా రన్నరప్ లేదా విజేత అవుతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్ ఐడల్ 5లో
వారి అంచనాలను పక్కన పెడితే, శ్రీరామ చంద్ర ఫుల్ సపోర్ట్ తో తిరిగి వచ్చాడని చెప్పాలి. శ్రీరామ చంద్ర అభిమానులు తెలుగు రాని వారని, ఆయనకు ఉత్తరాది నుంచి మద్దతు లభిస్తోందని కొన్ని వెబ్‌సైట్లు చెబుతున్నాయి. శ్రీరామ చంద్ర సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 5లో తన పెర్ఫార్మెన్స్ తో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించి, సీజన్ టైటిల్ ను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

శ్రీ రామ్ కు సపోర్ట్
చాలా మంది టాప్ బి టౌన్ సెలబ్రిటీలు శ్రీరామ్ కోసం ఓట్లు వేయమని వారి అభిమానులను అభ్యర్థిస్తున్నారు. ఒకరకంగా శ్రీరామ మరియు షన్ను సమాన స్కోర్‌తో ఒకే స్థాయిలో ఉన్నారని అంటున్నారు. ఫైనల్స్‌కు వెళ్లే సమయంలో శ్రీ రామ చంద్ర, షన్ను యొక్క పాపులారిటీని గనుక ఇప్పుడు పరిశీలిస్తే షన్ను కంటే తమ వాడికే పాపులారిటీ పెరిగిందని అభిమానులు నిర్ధారించుకుంటున్నారు.

షన్ను vs శ్రీరామ్
ఒకప్పుడు షన్ను vs సన్నీ అన్నట్టు ఉండే ఫ్యాన్ వార్ ఇప్పుడు షన్ను vs శ్రీరామ్ అన్నట్టు మారింది. ఒకరకంగా ఇప్పుడు షన్ను, లేదా సన్నీని బీట్ చేసి రన్నరప్, లేదా టైటిల్ కూడా శ్రీ రామచంద్ర గెలుచుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒకవేళ షన్ను - శ్రీ రామచంద్ర టైటిల్ కోసం పోటీ పడితే సన్నీ ఫాన్స్, లేక సన్నీ - శ్రీ రామచంద్ర పోటీ పడితే షన్ను ఫాన్స్ బాధ పడటం ఖాయం. ఐస్ టాస్క్ సమయంలో తిమ్మిర్లు రావడంతో శ్రీరామ్ ఆట మందగించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మరి శ్రీరామ్ తన అభిమానుల కలలను నిజం చేస్తాడో లేదో వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











