For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Telugu Indian Idol: అల్లు ఇలాకాలోకి శ్రీరామ్.. సన్నీ కంటే ముందే భారీ ఆఫర్.. రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

  |

  తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతూ.. దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. టెలివిజన్ హిస్టరీలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని రికార్డులు కొట్టేసింది. ఇక, ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. మరికొందరు తమ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకున్నారు.

  అలాంటి వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. గతంలో ఇండియన్ ఐడల్ గెలిచిన అతడు.. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు భారీ ఆఫర్ పట్టేశాడు. ఆ వివరాలు మీకోసం!

  టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు

  టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు

  ఇటీవల ముగిసిన ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ కావడంతో.. అతడికి హైప్ లభించింది. అందుకు అనుగుణంగానే ఇక్కడా హైలైట్ అయ్యాడు.

  తెలుగు హీరోలపై నాని సంచలన వ్యాఖ్యలు: వకీల్ సాబ్ నుంచే అసలు సమస్య.. వాళ్లు అలా చేయడం వల్లేనంటూ!

  ఆమెతో రొమాన్స్ చేస్తూ హాట్ టాపిక్

  ఆమెతో రొమాన్స్ చేస్తూ హాట్ టాపిక్

  ఐదో సీజన్‌లో శ్రీరామ చంద్ర ఆరంభంలో ఎవరితో కలవకుండా ఉండేవాడు. కానీ, క్రమంగా హమీదాకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఉంటూ.. ఆమెతో కలిసి ఆడుతూ కనిపించాడు. అదే సమయంలో తరచూ ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం వంటి వాటితో రచ్చ చేసేశాడు. ఇలా హమీదాతో లవ్ ట్రాకుతో ఈ టాప్ సింగర్ మరింతగా హాట్ టాపిక్‌గా అయిపోయాడు.

  ఆటపాటలతో ఫినాలేలోకి ఎంటర్

  ఆటపాటలతో ఫినాలేలోకి ఎంటర్

  హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే శ్రీరామ చంద్ర తన మార్కును చూపించే ప్రయత్నాలు చేశాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, గొడవలు పడినా టాస్కుల్లో మంచిగా ఆడాడు. అలాగే, ఆటపాటలతో తెగ సందడి చేశాడు. దీంతో చాలా మంది హృదయాలను దోచుకున్నాడు. ఇలా మొదట్లోనే శ్రీరామ చంద్ర తెలుగు వాళ్లకు మరింత చేరువ అయ్యాడు.

  Bigg Boss Remunerations: సన్నీ, షన్నూ కంటే అతడికే ఎక్కువ.. మధ్యలో వెళ్లినా కోటి పైనే.. ఎవరికి ఎంత?

  షోలో గాయపడ్డ శ్రీరామ్.. దారుణం

  షోలో గాయపడ్డ శ్రీరామ్.. దారుణం

  బిగ్ బాస్ షోలో భాగంగా జరిగిన 'టికెట్ టు ఫినాలే' టాస్కులో ఐస్ ఛాలెంజ్ టాస్కులో శ్రీరామ చంద్ర స్పర్శను కోల్పోయాడు. దీంతో అతడిని మెడికల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్లారు. దీంతో డాక్టర్లు అతడికి వైద్యం చేశారు. ఆ తర్వాత ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు భామ్ రాసి, వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో ఆ గాయాలు మరింత ఎక్కువ అయిన విషయం తెలిసిందే.

  3త స్థానంతోనే సరిపెట్టుకున్నాడు

  అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సింగర్ శ్రీరామ చంద్ర అదిరిపోయే ఆటతీరుతో ఫినాలేకు చేరుకున్నాడు. అందరి కంటే ముందే టికెట్ టు ఫినాలే ద్వారా టాప్ 5లోకి వెళ్లిన అతడు.. కాళ్లకు గాయాలు ఉన్నా తట్టుకుని నిలబడగలిగాడు. అయితే, గ్రాండ్ ఫినాలేలో మాత్రం మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. కానీ, కొన్ని కోట్ల మంది హృదయాలు గెలిచాడు.

  హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

  భారీ ఆఫర్ పట్టేసిన శ్రీరామ చంద్ర

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే శ్రీరామ చంద్ర అదిరిపోయే ఆఫర్‌ను అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా 'తెలుగు ఇండియన్‌ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామ చంద్రను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించింది.

   రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారట

  రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారట

  'తెలుగు ఇండియన్‌ ఐడల్' షోకు హోస్టుగా వ్యవహరించేందుకు సింగర్ శ్రీరామ చంద్రకు ఆహా ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించడానికి ఒప్పందం చేసుకుందని తాజాగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ షోలో ఒక్క ఎపిసోడ్‌కు మూడు లక్షలు చార్జ్ చేసిన శ్రీరామ్.. 'తెలుగు ఇండియన్‌ ఐడల్' కోసం ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట.

  English summary
  Bigg Boss 5th Season Completed Successfully. Now This Show Contestant Sreerama Chandra Host Telugu Indian Idol in AHA
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X