Bigg Boss: శ్రీరామ చంద్రకు బిగ్ బాస్ ఆఫర్.. పవర్‌తో టాప్ కంటెస్టెంట్‌ను బలి చేసిన మిస్టర్ కూల్

తెలుగు బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌లో సింగర్ శ్రీరామ చంద్రకు స్పెషల్ పవర్ సొంతం అయింది. దీంతో ఓ టాప్ కంటెస్టెంట్ బలైపోయాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఐదింతలు వినోదాన్ని పంచాలని ప్లాన్

ఐదింతలు వినోదాన్ని పంచాలని ప్లాన్

బిగ్ బాస్ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, లవ్‌తో పాటు బాధలు ఇలా అన్ని రకాల సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్‌లో వాటిని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. ఫలితంగా ఇది కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గానే ముందుకు సాగుతోంది.

 కెప్టెన్సీ పోటీదారులకు అలాంటి టాస్క్

కెప్టెన్సీ పోటీదారులకు అలాంటి టాస్క్

ప్రతివారం ఇంటి కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తుంటాడు. ఈ వారానికి కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేందుకు గానూ 'మీ ఇల్లు బంగారం కాను' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ముందుగా మైన‌ర్ హ్యాట్‌ల‌ను ప‌ట్టుకున్న‌వారికి గోల్డ్ మైన్‌లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

మధ్యలో పవర్ యాక్సెస్ ఇచ్చే బజర్లు

మధ్యలో పవర్ యాక్సెస్ ఇచ్చే బజర్లు

బజర్ మోగినప్పుడల్లా కంటెస్టెంట్లు హ్యాట్‌లను సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చాలా మందికి అవి దొరుకుతాయి. అలా దొరికినప్పుడల్లా బంగారాన్ని వెతుక్కుంటుంటారు. ఇక, మధ్య మధ్య పవర్ రూమ్‌లోకి ప్రవేశించే అర్హతను కల్పిస్తూ బిగ్ బాస్ జబర్ ఇస్తుంటాడు. అందులోకి వెళ్లిన కంటెస్టెంట్‌కు స్పెషల్ పవర్‌ను కూడా ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

శ్రీరామ చంద్రకు పవర్ రూమ్ యాక్సెస్

శ్రీరామ చంద్రకు పవర్ రూమ్ యాక్సెస్

ఈ వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునే 'మీ ఇల్లు బంగారం కాను' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఈరోజు మరికొందరు కంటెస్టెంట్లు హ్యాట్‌లను అందుకున్నారు. అందులో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. గోల్డ్‌మైన్‌లో బంగారాన్ని అన్వేషించే చాన్స్ పట్టేసిన అతడు.. పవర్ రూమ్ యాక్సెస్‌ను కూడా సంపాదించాడు. దీన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు.

శ్రీరామ చంద్రకు స్పెషల్ పవర్ లభ్యం

శ్రీరామ చంద్రకు స్పెషల్ పవర్ లభ్యం

పవర్ రూమ్‌లో యాక్సెస్‌ను అందుకున్న శ్రీరామ చంద్రకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తాజా ప్రోమోలో చూపించారు. అయితే, అదేంటి అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక, ఈ పవర్‌ను 'మీ దగ్గరే ఉంచుకుంటారా? ఎవరికైనా ఇస్తారా' అని బిగ్ బాస్ అతడిని అడిగగా.. తన వద్దే ఉంచుకుంటానని చెప్పాడు. దీంతో ఓ సుత్తి, లెటర్ పట్టుకుని హౌస్‌లోకి అడుగు పెట్టాడతను.

ఆ కంటెస్టెంట్లకు ఆఫర్ ఇచ్చిన శ్రీరామ్

బిగ్ బాస్ నుంచి స్పెషల్ పవర్ అందుకున్న శ్రీరామ చంద్ర బయటకు వచ్చిన వెంటనే కంటెస్టెంట్లతో డీల్ కుదుర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగానే అందరినీ నిల్చోబెట్టి 'నా దగ్గర ఉన్న స్పెషల్ పవర్‌ ఎవరికైనా కావాలా? అలా కావాలి అంటే మీ దగ్గర ఉన్న యాభై గోల్డ్ కాయిన్స్ నాకు ఇవ్వాలి. చెప్పండి ఎవరికైనా నా పవర్ కావాలా' అంటూ సూటిగా అడిగాడు.

Recommended Video

RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Filmibeat Telugu
డీల్‌కు ఒప్పుకుని బుక్కైన యాంకర్ రవి

డీల్‌కు ఒప్పుకుని బుక్కైన యాంకర్ రవి

శ్రీరామ చంద్ర దగ్గర ఏదో గొప్ప పవర్ ఉందని అనుకున్నాడో ఏమో.. అతడు ఆఫర్ ఇచ్చిన వెంటనే యాంకర్ రవి డీల్‌కు ఒప్పుకుంటున్నానని చెప్పాడు. ఆ వెంటనే తన దగ్గర ఉన్న యాభై గోల్డ్ కాయిన్స్‌ను తీసుకొచ్చి ఇవ్వగా.. శ్రీరామ్ తన పవర్‌కు సంబంధించిన లెటర్‌, సుత్తిని అతడికి అందించాడు. అది చదివి రవి షాక్ అయ్యాడు. అప్పుడు శ్రీరామ్ నవ్వుతూ కనిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X