Bigg Boss: హమీదాపై శ్రీరామ్ ఊహించని కామెంట్స్.. తొలిసారి చెబుతున్నా అంటూ మేటర్ రివీల్ చేసేశాడుగా!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు పుట్టికొచ్చినా.. దీన్ని మాత్రం ఏది కూడా దాటలేకపోయాయి. అంతలా ఈ షో బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే తెలుగులో నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో సక్సెస్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా విజయవంతంగా పూర్తి కాబోతుంది. ఇప్పుడు చివరి వారంలో ఉన్న ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫినాలేకు చేరుకున్న శ్రీరామ చంద్ర మరో కంటెస్టెంట్ హమీదా గురించి ఊహించని కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఐదుగురి మధ్య అసలైన పోటీ

ఐదుగురి మధ్య అసలైన పోటీ

భారీ అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

ఫినాలే వీక్‌లో స్పెషల్ ట్రీట్స్

ఫినాలే వీక్‌లో స్పెషల్ ట్రీట్స్

ప్రస్తుతం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలే వీక్ జరుగుతుంది. దీంతో ఈ వారం మొత్తం ఎలాంటి టాస్కులూ ఉండబోవన్న విషయం తెలిసిందే. కానీ, గ్రాండ్ ఫినాలే వరకూ ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటూనే ఉంటుంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఎన్నో సరికొత్త ప్లాన్లతో నిర్వహకులు రెడీగా ఉన్నారు. దీంతో ప్రేక్షకుల కావాల్సిన మజా ఈ వారం రోజుల్లోనే దొరకబోతుంది.

జర్నీ వీడియోలు చూపించారు

జర్నీ వీడియోలు చూపించారు

బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో టాప్ 5లో నిలిచి ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్లకు షో నిర్వహకులు వాళ్ల వాళ్ల జర్నీ వీడియోలను చూపిస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఫినాలే కంటెస్టెంట్లకు వాటిని చూపించారు. దాదాపు మూడు ఎపిసోడ్లలోనూ ఇదే చూపించింది బిగ్ బాస్ యూనిట్. దీంతో ఈ వారం మొదట్లోనే హౌస్‌లో ఎన్నో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి.

రెండు ఫొటోలతో స్టోరీ చెప్పాలి

రెండు ఫొటోలతో స్టోరీ చెప్పాలి

జర్నీ వీడియోలను చూపించే క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహకులు ఆయా కంటెస్టెంట్లకు సంబంధించిన ఫొటోలను కూడా ఉంచారు. ఇక, ఆ వీడియోలు చూపించిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ రెండు ఫొటోలు తీసుకుని.. అందులో ఒకదాని గురించి అందరితో పంచుకోవాలని.. ఆ ఫొటోపై ఏదైనా తమకు తోచిన సందేశాన్ని రాసి బిగ్ బాస్‌కు తిరిగి ఇచ్చేయాలని సూచించాడు.

శ్రీరామ్ ఊహించని కామెంట్స్

శ్రీరామ్ ఊహించని కామెంట్స్


ఈ టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ తమ మనసులోని భావాలను మిగిలిన ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఆయా ఫొటోలపై కొన్ని కొటేషన్స్ రాసి బిగ్ బాస్‌కు తిరిగి ఇచ్చేశారు. ఈ టాస్కులో భాగంగా శ్రీరామ చంద్ర ఊహించని విధంగా ఈ సీజన్ కంటెస్టెంట్ హమీదా గురించి మాట్లాడాడు. దీంతో ఆమెపై ఇష్టాన్ని బయట పెట్టేశాడు.

Recommended Video

Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
 ఇది ఎప్పుడూ బయట పెట్టలే

ఇది ఎప్పుడూ బయట పెట్టలే

హమీదాతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను తీసుకున్న శ్రీరామ చంద్ర 'ఈ ఇంట్లో నాకు మంచి బాండ్‌ కుదురిన ఫస్ట్‌ పర్సన్‌ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. ఆమెను చాలా మిస్‌ అవుతున్నాను. ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్‌ రేంజర్‌ అన్న ట్యాగ్‌ వచ్చేది కాదని ఫీల్ అవుతున్నా' అంటూ అసలు మేటర్‌ను లీక్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X