Bigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమే
ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఐదేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు పుట్టికొచ్చినా.. దీన్ని మాత్రం ఏది కూడా దాటలేకపోయాయి. అంతలా ఈ షో బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే తెలుగులో మొన్నటితో ఐదు సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. తాజాగా ముగిసిన ఐదో సీజన్‌లో సింగర్ శ్రీరామ చంద్ర ఓ టాస్కులో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అతడు కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ గాయాల గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు
ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ కావడంతో.. అతడికే ఎక్కువ హైప్ లభించింది. దీనికితోడు అతడు ఆరంభంలోనే చక్కని ఆటతో మెప్పించాడు.

ఆటపాటలతో ఆకట్టుకున్న శ్రీరామ్
బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే శ్రీరామ చంద్ర తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, గొడవలు పడినా టాస్కుల్లో మంచిగా ఆడాడు. అలాగే, ఆటపాటలతో తెగ సందడి చేశాడు. దీంతో చాలా మంది హృదయాలను దోచుకున్నాడు. ఇలా మొదట్లోనే శ్రీరామ చంద్ర తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు.

లవ్ ట్రాకుతో మరింత పాపులారిటీ
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో శ్రీరామ చంద్ర ఆరంభంలో ఎవరితో కలవకుండా ఉండేవాడు. కానీ, క్రమంగా హమీదాకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఉంటూ.. ఆమెతో కలిసి ఆడుతూ కనిపించాడు. అదే సమయంలో తరచూ ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం వంటి వాటితో రచ్చ చేసేశాడు. ఇలా ఈ లవ్ ట్రాకుతో అతడు మరింతగా పాపులర్ అయిపోయాడు.

టాస్కులో గాయపడిన కంటెస్టెంట్
'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా జరిగిన ఐస్ ఛాలెంజ్ టాస్కులో శ్రీరామ చంద్ర స్పర్శను కోల్పోయాడు. దీంతో అతడిని మెడికల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్లారు. దీంతో డాక్టర్లు అతడికి వైద్యం చేశారు. ఆ తర్వాత ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు భామ్ రాసి, వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో ఆ గాయాలు మరింత తీవ్రం అయిన విషయం అందరికీ తెలిసిందే.

మూడో స్థానంలోనే.. ఫ్యాన్స్ నిరాశ
ఎన్నో అంచానలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సింగర్ శ్రీరామ చంద్ర అదిరిపోయే ఆటతీరుతో ఫినాలేకు చేరుకున్నాడు. అందరి కంటే ముందే టికెట్ టు ఫినాలే ద్వారా టాప్ 5లోకి వెళ్లిన అతడు.. కాళ్లకు గాయాలు ఉన్నా తట్టుకుని నిలబడగలిగాడు. అయితే, గ్రాండ్ ఫినాలేలో మాత్రం మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణంగా
పదిహేను వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న శ్రీరామ చంద్ర.. కాళ్లకు అయిన గాయాలతోనే బయటకు వచ్చాడు. అయితే, అందరిలా కాకుండా అతడు ఇంటికే పరిమితం అయ్యాడు. దీనికి కారణం శ్రీరామ్ కాళ్లకు ఉన్న గాయాలే. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో అతడి రెండు కాళ్లపై చర్మం లేకుండా కనిపించాయి. ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్నట్లు కనిపించింది.

షాకింగ్ న్యూస్ చెప్పేసిన డాక్టర్లు
శ్రీరామ చంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడికి తాజాగా పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. అంతేకాదు, బయటకు అస్సలు రావొద్దని.. ఒకవేళ వస్తే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారట. చలికాలం అయ్యే వరకూ జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


Click it and Unblock the Notifications











