Ticket to Finale Winner: ఊహించని కంటెస్టెంట్‌కు టికెట్ టు ఫినాలే.. సన్నీ సాయంతో ఫైనల్‌లో అడుగు

ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది తెలుగు బిగ్ బాస్ షో. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకుల మద్దతును అందుకుంటోన్న ఈ రియాలిటీ షో.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో నడుస్తోంది. ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారింది. టాప్ -5లోకి చేరాలన్న లక్ష్యంతో ఏడుగురు కంటెస్టెంట్లు పోటీపోటీగా ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం మొదలైన టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ను ఊహించని కంటెస్టెంట్ గెలిచినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, ఆ గెలుపునకు కారణం సన్నీనే అని కూడా లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం!

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

టాప్ 5 కోసం పోటీ.. రసవత్తరంగా

టాప్ 5 కోసం పోటీ.. రసవత్తరంగా

భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఫినాలే ఎపిసోడ్ కూడా జరగనుంది. దీంతో షో నిర్వహకులు షోను మరింత రంజుగా సాగేలా ప్లాన్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కఠినమైన టాస్కులు ఇచ్చి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా వీళ్లలో ఇద్దరు వెళ్లిపోనున్నారు.

ఒకరిని ఫినాలేలోకి పంపేందుకు

ఒకరిని ఫినాలేలోకి పంపేందుకు

ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ టాస్కు మూడు రకాలుగా జరగబోతుంది. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లే ఫినాలేకు నేరుగా చేరుతారు.

 మూడు రౌండ్లలో మానస్‌కే టాప్

మూడు రౌండ్లలో మానస్‌కే టాప్

'టికెట్ టు ఫినాలే' టాస్కుకు సంబంధించి ఇప్పటి వరకూ మూడు రౌండ్లు జరిగాయి. ఇందులో అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించిన మానస్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, సన్నీలు ఉన్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో తక్కువ మార్కులు ఉన్న ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్‌లు ఎలిమినేట్ అయ్యారు.

నాలుగో రౌండ్ ఎలా ఉంటుంది?

నాలుగో రౌండ్ ఎలా ఉంటుంది?

'టికెట్ టు ఫినాలే' టాస్కులో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు సరికొత్త ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ నలుగురికి ఫోకస్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. బిగ్ బాస్ కొన్ని సౌండ్లను ప్లే చేస్తాడు. అక్కడ ప్లే చేసే సౌండ్లు ఆధారంగా వాటిని క్రమం తప్పకుండా తమకిచ్చిన బోర్డులపై రాయాల్సి ఉంటుంది. ఎక్కువ గెస్ చేసిన వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి.

ఆఖరి రౌండ్ ఆ ఇద్దరి మధ్యనే

ఆఖరి రౌండ్ ఆ ఇద్దరి మధ్యనే

ఎంతో ఆసక్తికరంగా సాగబోతున్న 'టికెట్ టు ఫినాలే' టాస్కు నాలుగో రౌండ్‌లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. దీంతో ఫైనల్ రౌండ్‌ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్యనే జరగబోతుందట. ఇందులో స్విచ్‌లు, బల్బులతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని సరిగా ఎవరు అమర్చుతారో వాళ్లకే ఎక్కువ మార్కులు వస్తాయట. ఇది శ్రీరామ్, సిరి మధ్య జరిగిందని తెలుస్తోంది.

టికెట్ టు ఫినాలే అతడికేనట

టికెట్ టు ఫినాలే అతడికేనట

సీజన్ మొత్తానికే ఎంతో ముఖ్యమైన టికెట్ టు ఫినాలే టాస్కులో సింగర్ శ్రీరామ చంద్ర విజయం సాధించినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ టాస్కుకు సంబంధించిన ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఎక్కువ మార్కులు పొందిన కంటెస్టెంట్‌గా నిలిచిన అతడు.. రెండు వారాల ముందే నేరుగా ఫినాలేలోకి అడుగు పెట్టాడట. ఈరోజు ఎపిసోడ్‌లో దీన్ని చూపిస్తారని సమాచారం.

సన్నీ సాయంతో గెలిచిన రామ్

సన్నీ సాయంతో గెలిచిన రామ్

'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదటి రౌండ్‌లో శ్రీరామ చంద్ర కాళ్లకు గాయాలైన విషయం తెలిసిందే. దీంతో మూడో రౌండ్‌లో అతడి ఆటను సన్నీ ఆడాడు. అయితే, నాలుగో రౌండ్ మాత్రం అతడే ఆడుకున్నాడు. ఇక, విజేతను నిర్ణయించే చివరి రౌండ్‌లో సన్నీనే శ్రీరామ్ తరపున ఆడి గెలిపించాడట. ఇక, సిరి తరపున షణ్ముఖ్ చివరి రౌండ్‌ను ఆడినట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X