bigg boss 5: కోపం తట్టుకోలేక కొట్టే వరకు వెళ్లిన శ్రీరామ్.. బక్కోడే కానీ జెస్సి మామూలోడు కాదు!
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ మధ్యలో కొట్లాటలు జరగడం సాధారణమే అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బిగ్ బాస్ ఎక్కువగా కంటెస్టెంట్ ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. హింసకు తావు లేదు అంటూనే కంటెస్టెంట్స్ మధ్య లో చిచ్చు పెట్టే టాస్క్ లను ప్రవేశ పెడుతూ ఉంటారు. ఎలాంటి టాస్క్ లు మొదలైన కూడా కంటెస్టెంట్స్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రాజ్యానికి ఒక్కడే రాజు అనే గేమ్ లో కొంతమంది వారి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పటినుంచో ఫిజికల్ టాస్క్ లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న వారు కూడా ఈసారి అంతకుమించి అనేలా వారి బలాన్ని చూపించారు. అయితే జెస్సీ మరోసారి తన టాలెంట్ చూపించాడు. తన కంటే బలంగా ఉన్న వారిని కూడా ఎత్తి కింద పడేసి కసిని తీర్చుకున్నాడు. అయితే జెస్సిని శ్రీ రామచంద్ర కొట్టే వరకు వెళ్లాల్సి వచ్చింది.

ఇంట్రెస్టింగ్ టాస్క్
గత నాలుగు వారాలు కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం కొందరికీ అన్యాయం జరిగింది అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఎలాంటి టాస్క్ మొదలైన కూడా బిగ్ బాస్ అన్ని రకాలుగా సమన్యాయం చేయలేదు అనే ఆరోపణలు చాలానే వచ్చాయి. ఇక ఈసారి మాత్రం టాలెంట్ ఉన్న వారు బలంగా పోటీ పడేందుకు అంత అవకాశం ఇచ్చారు. టాస్క్ లో భాగంగా రాజ్యానికి ఒక్కడే రాజు అనే ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. సన్ని రవి ఇద్దరు కూడా ఇప్పటికే కొన్నిసార్లు కెప్టెన్ బ్యాండ్ లో చివరి దశలో చేజార్చుకోవలసి వచ్చింది.

తీవ్ర స్థాయిలో గొడవలు
ఇక ఈ సారి ఎలాగైనా కెప్టెన్ గా నిలబడాలని సన్నీ టీం సభ్యులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సన్నీ ఆలోచన విధానం రవి కంటే కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉందని అనిపించింది. మొదట సాధారణంగానే సరదాగా కొనసాగిన ఈ ఆట క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం గోడవలతో ముగుస్తోంది. ముఖ్యంగా కుస్తీ పోటీలు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు కూడా బాగానే కలిగించాడు. మొదట విశ్వ మానస్ మధ్యలో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

మానస్ vs విశ్వ
అయితే నాణాలను దొంగిలించడంలో షన్ను గ్యాంగ్ మోసాల్ని బాగానే ఫాలో అయ్యారు. ఒక వైపు సన్నీ రవి ఇద్దరు కూడా టాస్క్ లో భాగంగా బిజీగా ఉన్న సమయంలో షన్ను గ్యాంగ్ ఇంట్లోకి వెళ్లి నాణేలను దొంగలించడం తీవ్ర కలకలం సృష్టించింది ముఖ్యంగా రవి టీమ్ లో ఉన్నటువంటి విశ్వ చాలా సీరియస్ అయ్యాడు. సభ్యులు దొంగతనానికి పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ప్రతి సారి మా టీం సభ్యులు నిందించడం సరైనది కాదు అంటూ కూడా మానస్ తన కోపాన్ని చూపించాడు.
Recommended Video

కొట్టే వరకు వెళ్లిన శ్రీరామ్
ఇక మరొక టాస్క్ లో అయితే జెస్సి శ్రీరామచంద్ర ఇద్దరూ కూడా చాలా కోపంగా పోటీకి సిద్దం అవడంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే జెస్సి బక్కగానే ఉన్నప్పటికీ తన కంటే బలంగా ఉన్నటువంటి శ్రీ రామచంద్ర అనే వ్యక్తిని పడేశాడు. రవి తన టీమ్ నుంచి విశ్వ, శ్రీరామచంద్రను పంపించగా, సన్నీ టీమ్ నుంచి జెస్సి , మానస్ వెళ్ళారు. రెండు బోర్డ్ లలో ఇద్దరు పోటీ దారులు రాజుల ఫొటోలను పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యర్ధులు ఫొటోలను తీయాల్సి కూడా ఉంటుంది. అయితే మానస్ విశ్వను హ్యాండిల్ చేయగా జెస్సి శ్రీరామచంద్రను గట్టిగా పట్టేసుకున్నాడు. ఒకసారి జెస్సి ఎత్తి పడేయడంతో శ్రీరామ్ కొట్టే వరకు వెళ్ళాడు. ఆ క్రమంలో సన్నీ కూడా సీరియస్ అయ్యాడు. ఫైనల్ గా ఆ టాస్క్ లో సన్నీ టీమ్ గెలుస్తుంది. మరి ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











