బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ అప్డేట్.. అంతా రెడీ చేసుకున్న సమయంలో ఊహించని షాక్?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్నో రకాల కాంట్రవర్సీలతో ముందుకు సాగే ఈ షో త్వరలోనే సిజన్ 5 కోసం కూడా ప్లాన్ రెడీ చేసుకుంటోంది. కొంతమంది కంటెస్టెంట్ లిస్టును కూడా రెడీ చేసుకున్నారు. ఆల్ మోస్ట్ ఫిక్స్ అని అనుకున్న సమయంలో నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది.

 తక్కువ రేటింగ్ వచ్చినప్పటికీ

తక్కువ రేటింగ్ వచ్చినప్పటికీ

గత ఏడాది నాలుగవ సీజన్ కోవిడ్ కారణంగా ఆలస్యంగా మొదలైన విషయం తెలిసిందే. మధ్యలో కాస్త తక్కువ రేటింగ్ వచ్చినప్పటికీ చివరికి మంచి రేటింగ్స్ తోనే ముగిసింది. నాగార్జున హోస్టింగ్ మెగాస్టార్ స్పెషల్ గెస్ట్ కావడం వలన చివరి రోజు అయితే రికార్డు స్థాయిలో రేటింగ్ అందుకుంది.

అంతకు మించి అనేలా

అంతకు మించి అనేలా

అయితే గత ఏడాది కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓ వర్గం వారిని పూర్తిగా నిరాశపరిచారు. స్టార్ డమ్ ఉన్న సెలబ్రెటీలను తీసుకురాలేకపోయారు అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ఈ సారి నిర్వాహకులు అంతకు మించి అనేలా కొంచెం ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారిని సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయ్యారు.

 బిగ్ బాస్ 5లో కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ 5లో కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కోసం దాదాపు 30 మందిని సెలక్ట్ చేసుకొని అందులో బెస్ట్ 16 సెలబ్రెటీలను ఫైనల్ చేసినట్లు మొన్నటి వరకు టాక్ బాగానే వచ్చింది. ముఖ్యంగా టిక్ టాక్ స్టార్ దుర్గారావు, యూ ట్యూబ్ స్టార్ షణ్ముక్ వంటి వారిని ఫైనల్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. యాంకర్ రవి పేరు కూడా వైరల్ అయ్యింది.

Recommended Video

Himaja With Pawan Kalyan In PSPK 27
వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని.. వాయిదా

వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని.. వాయిదా


అయితే ఇప్పుడు ఆ ప్లాన్స్ మొత్తం తారుమారయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 5 ఇప్పట్లో మొదలవ్వదని తెలుస్తోంది. అసలైతే సెప్టెంబరు లో మొదలు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కు షిఫ్ట్ చేసినట్లు టాక్. ఎందుకంటే రోజురోజుకు కరోనా వ్యాప్తి ఎక్కువవ్వడంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని రిస్క్ తీసుకోవడం లేదట. ఇక ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం కన్నా కూడా వాయిదా వేసుకోవడం బెటర్ అని నిర్వాహకులు ఆలోచించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X