బిగ్ బాస్ ఐదో సీజన్ డేట్ ఫిక్స్: ఆ స్పెషల్ డేన ప్రోమో రిలీజ్.. అలా జరుగుతోన్న కంటెస్టెంట్ల ఎంపిక

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలన్నీంటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం లేదు. అలాంటిది ఏదైనా కొత్త కంటెంట్‌తో నడిచే షో వస్తే.. అసలు అది క్లిక్ అవుతుందో లేదో కూడా చెప్పలేం. ఇలానే ఐదేళ్ల క్రితం తెలుగులోకి వచ్చి.. ఎవరూ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ షో. అంతేకాదు, ఇప్పటికే ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో దానిని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ మొదలయ్యే డేట్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఏకంగా నాలుగు సీజన్లు కంప్లీట్

ఏకంగా నాలుగు సీజన్లు కంప్లీట్

దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇది పలు భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా పరిచయమైంది. అప్పట్లో ఈ షోపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.

ముగ్గురు స్టార్ హీరోల సహాయం

ముగ్గురు స్టార్ హీరోల సహాయం

అన్ని భాషల కంటే తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ దీన్ని హోస్ట్ చేసిన హీరోలు కూడా ఈ సక్సెస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడు నాలుగు సీజన్లను నాగార్జున తమ తమ అద్భుతమైన హోస్టింగ్‌తో నడిపించడం కలిసొచ్చింది.

తెలుగు షో... జాతీయ స్థాయిలో

తెలుగు షో... జాతీయ స్థాయిలో

దేశంలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. అయితే, అన్ని చోట్ల కంటే తెలుగులో వచ్చే దానికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకే ఇక్కడ ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్టు చేసిన నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. దీంతో టీఆర్పీలో జాతీయ స్థాయి రికార్డులు కొట్టేసింది.

కరోనా వల్ల కష్టమే అని అన్నారు

కరోనా వల్ల కష్టమే అని అన్నారు

తెలుగులో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ఏడాదీ బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌కు సమయం ఆసన్నమైంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షో మొదలయ్యేది సందేహమే అని టాక్ వినిపించింది. అంతేకాదు, ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండదు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. దీంతో షో ఫ్యాన్స్ తెగ నిరాశకు లోనయిపోయారు.

ఐదో సీజన్‌పై ఎన్నెన్నో పుకార్లు

ఐదో సీజన్‌పై ఎన్నెన్నో పుకార్లు

ఐదో సీజన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కంటెస్టెంట్లు వీళ్లనంటూ కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు, ఆ నెలలో వస్తుంది.. ఈ నెలలో ప్రసారం అవుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఐదో సీజన్ విషయంలో అసలేం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అందరూ అయోమయానికి గురవుతున్నారు.

ఐదో సీజన్ ప్రారంభ తేదీ అప్పుడే

ఐదో సీజన్ ప్రారంభ తేదీ అప్పుడే

బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన తాజా సమాచారం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుందట. దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈయనకు సంబంధించిన ప్రోమో నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న విడుదల కానుందని సమాచారం.

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరిగేదిలా

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరిగేదిలా

బయట పరిస్థితులు బాగోకపోయినా బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. దాదాపు వంద మంది ప్రముఖుల్లో ఇటీవలే షార్ట్ లిస్ట్ తయారు చేశారని అంటున్నారు. వీరితో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పలువురిని ఫైనల్ కూడా చేశారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X