For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: ఇంట్లో పసిపాప ఏడుపులకు షాకైనా కంటెస్టెంట్స్.. సడన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్ బాస్

  |

  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుంది. మొదటి రెండు వారాలు కూడా కంటెస్టెంట్స్ మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలు అయితే చాలానే కొనసాగాయి. ఇక బిగ్ బాస్ కూడా టైమ్ చూసి టాస్క్ లతో రిలేషన్స్ లో గోడవలు పెట్టి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే కొందరి మధ్య విభేదాలు చాలానే వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో గొడవలు మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా హైలెట్ చేస్తూ ఉన్నారు.

  ఫ్యామిలీని మిస్ అవుతున్న వారికి కాస్త ఊరట లభించేలా కూడా సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా పసి పాప ఏడుపులు వినిపించాయి. కొద్దిసేపటి వరకు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.

  కావాలని చేస్తున్నారా?

  కావాలని చేస్తున్నారా?

  బిగ్ బాస్ హౌస్ ఎప్పటికప్పుడు కలర్ఫుల్ ఎమోషన్స్ తో భిన్నంగా మారుతోంది. కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వారి శక్తికి మించే పోటీపడుతున్నారు. అయితే మధ్య మధ్యలో కొందరు ఎమోషనల్ గా ఫీలవుతూ ప్రేక్షకుల మనసును గెలుచుకొని ప్రయత్నం చేస్తున్నారు. హౌజ్ లో ఎవరు కావాలని ఎమోషనల్ అవుతున్నారు అలాగే ఎవరు జెన్యున్ గా ఉన్నారు అనే విషయాలు కూడా ఈజీగా అర్థమవుతున్నాయి. కొందరు చెప్పే నిజాలు మాత్రం చాలా జెన్యూన్ గా ఉన్నాయి.

  వరస్ట్ పెర్ఫామెన్స్..

  వరస్ట్ పెర్ఫామెన్స్..

  ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కూడా కంటెస్టెంట్స్ కొందరు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. గడిచిన రెండు వారాలు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని ఆ తరువాత మళ్ళీ తీరిక సమయాల్లో క్షమాపణలు చెప్పుకొని నామినేట్ అవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ కొందరి ప్లాన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. టైమ్ చూసి కొందరు వరస్ట్ పెర్ఫామెన్స్ లో కూడా ప్రతిసారి ఒక్కరినే నామినేట్ చేస్తుండడం విశేషం. ఇక ఈ రోజు కూడా వరస్ట్ పెర్ఫామెన్స్ ఎవరు అనే విషయంలో గొడవలు గట్టిగానే జరగనున్నట్లు తెలుస్తోంది.

   షాక్ ఇచ్చిన బిగ్ బాస్

  షాక్ ఇచ్చిన బిగ్ బాస్

  ఇక లేటెస్ట్ గా బిగ్బాస్ కొద్దిసేపటి వరకు హౌస్ లో ఉన్న పోటీ దారులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆందోళన కూడా కలిగించాడు. అంతేకాకుండా నటరాజ్ మాస్టర్ కి సూపర్ సర్ ప్రైజ్ ఇవ్వడమే కాకుండా బ్యూటిఫుల్ మూమెంట్ ను కూడా అందించాడు. నటరాజ్ మాస్టర్ ఇప్పటికే తన భార్య గురించి హౌస్ లో చాలా సార్లు గుర్తు చేసుకున్నాడు. తొలిప్రేమ టాస్క్ లో కూడా తన మొదటి ప్రేమ కూడా తనే అంటూ వివరణ ఇస్తూ చాలా ఫీల్ అయ్యాడు.

  పసిపాప ఏడుపులు

  పసిపాప ఏడుపులు

  ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక పసిపాప ఏడుస్తున్న శబ్దం హౌస్ నలుదిక్కుల నుంచి వినపడింది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి ఆ సౌండ్ వస్తుందో అర్థం కాక అన్నివైపులా వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఎంత వెతికినా కూడా ఎవరికీ కొంత సేపటి వరకు ఏం జరుగుతుందనే విషయం కూడా అర్థం కాలేదు. ఆ పసిపాప శబ్దం విని నటరాజ్ మాస్టారు గర్భవతి తో ఉన్న తన భార్యని గుర్తు చేసుకొని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  నటరాజ్ మాస్టర్ కు సర్‌ప్రైజ్‌

  ఇక అందరూ కూడా టీవీ ముందు కూర్చుని ఉండగా ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది. నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇక టీవీలో సీమంతం వీడియో న్యూ ప్లే చేయడంతో నటరాజ్ మాస్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చప్పట్లతో వారి ఆనందం వ్యక్తం చేశారు.

  ఇక మాస్టర్ కోసం ఆయన సతీమణి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కూడా అందించారు. నువ్వు నైట్ మాట్లాడేవాడివి కదా అప్పుడు బేబీ కదిలేది. ఇప్పుడు బిగ్ బాస్ లో నీ వాయిస్ వింటూ బేబీ నాతో డిష్యుం డిష్యుం ఫైట్ చేస్తోంది.. అనగానే మాస్టర్ మరింత భావోద్వేగానికి గురయ్యారు అంతేకాకుండా వెంటనే టివి దగ్గరికి వెళ్లి తన భార్య ఫోటోకు ముద్దు కూడా పెట్టుకున్నారు. మరి ఇంకా ఈరోజు హౌస్ లో ఎలాంటి సన్నివేశాలు కనిపిస్తాయో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 promo sudden surprise to nataraj master
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X