Bigg Boss Telugu 5: సిరి, షణ్ముఖ్ రొమాన్స్‌పై కమెడియన్ ఘాటైన కామెంట్.. బయట మరో ఇద్దరంటూ పరువు తీశాడుగా!
గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు, రొమాంటిక్ సన్నివేశాలు, ఫైటింగులు ఇలా ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. ఇలా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోందీ షో. ఇప్పుడు ఐదో సీజన్ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్‌తో వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కమెడియన్ వీళ్ల రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే
తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సీజన్లు సక్సెస్ అవడంతో ఐదో దానిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తున్నారు. తద్వారా షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేస్తూ మంచి రేటింగ్ రాబడుతున్నారు. దీంతో ఈ షో రోజు రోజుకూ ఎంతో రసవత్తరంగా మారుతూ ప్రేక్షకులకు మజా ఇస్తోంది.

ఆ టీమ్ రాకతో సండే ఎంతో ఫన్‌గా
ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ ఆటపాటలతో ఫన్నీగా సాగుతుంటాయి. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నప్పటికీ.. దానికి ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ పోగొట్టేందుకు నిర్వహకులు అదిరిపోయే ఆటపాటలను ప్లాన్ చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఆదివారం కూడా కొన్ని రకాల ఆటలతో సరదాగా సాగింది. అలాగే, ఇందులో 'అనుభవించు రాజా' మూవీ నుంచి రాజ్ తరుణ్, కశీష్ ఖాన్, కమెడియన్ సుదర్శన్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగిందనే చెప్పాలి.

బొమ్మలు గీయించిన నాగ్, తరుణ్
ఈ ఆదివారం ప్రసారం అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎంతో ఫన్నీగా సాగింది. ఇందులో హౌస్‌మేట్స్ అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాలగేమ్స్ ఆడించాడు. ఇందులో ఇంటి సభ్యుల్లో ఒకరికి.. ఒక కంటెస్టెంట్ పేరు చూపించి.. మిగిలిన వాళ్లంతా గుర్తించేలా బోర్డుపై గీతలు గీయాల్సి ఉంటుంది. ఆ గీతలను ఆధారంగా చేసుకుని ఆ కంటెస్టెంట్ ఎవరో గుర్తు పట్టాలి. ఇందుకోసం హౌస్‌మేట్లను రెండు టీమ్‌లుగా విభజించాడు నాగ్. దీనికి రవిని సంచాలకుడిగా పెట్టాడు. ఈ టాస్క్ మొత్తం రాజ్ తరుణ్, సుదర్శన్ కంటెస్టెంట్లపై పంచుల వర్షం కురిపిస్తూ సందడి చేశారు.

వాళ్ల ప్రశ్నలను వాళ్లనే అడిగాడు
హౌస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి మరో కంటెస్టెంట్ మనసులో ఏమనుకుంటున్నారు? దానికి సదరు ఇంటి సభ్యుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడు? ఆ జవాబుపై మిగిలిన వాళ్లంతా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అనే గేమ్ కూడా ఆడించాడు నాగార్జున. ఇందులో భాగంగా ఎన్నో సీక్రెట్లను రాబట్టే ప్రయత్నాలు చేశాడు. ఇక, మిగిలిన హౌస్‌మేట్స్ థమ్స్‌అప్, థమ్స్‌డౌన్స్ బోర్డులు చూపించాలి. అందులో ఎవరికి థమ్స్‌డౌన్‌లు ఎక్కువగా వస్తాయో.. వాళ్లు కాకరకాయ జ్యూస్ తాగాలి. ఇందులో శ్రీరామ్ మినహా మిగిలిన వాళ్లంతా దాన్ని తాగేశారు.

ఆనీ మాస్టర్ ఔట్... ఎమోషనల్‌గా
గత వారం మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేషన్‌లో ఉండగా.. శనివారం ఎపిసోడ్‌లో శ్రీరామ్, సన్నీని సేఫ్ అయినట్లు వెల్లడించాడు నాగార్జున. ఇక, ఆదివారం కాజల్, మానస్, షణ్ముఖ్, సిరి హన్మంత్‌లు వరుసగా సేఫ్ అవుతూ వచ్చారు. ఇక, చివర్లో ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ మిగిలారు. వీళ్లిద్దరిని అడుగులు వేస్తూ ఎలిమినేషన్ బోర్డు దగ్గరకు రమ్మని నాగ్ చెప్పాడు. అలా ఇద్దరితో కాసేపు అడుగులు వేయించి.. ఆనీ ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. దీంతో హౌస్ అంతా ఎమోషనల్‌గా మారిపోయింది. శ్రీరామ్, రవి, పింకీ, సన్నీ సహా పలువురు కన్నీరు పెట్టుకున్నారు.

సిరి, షణ్ముఖ్ రిలేషన్‌పై సుదర్శన్
ఆదివారం ఎపిసోడ్‌లోకి 'అనుభవించు రాజా' మూవీ నుంచి రాజ్ తరుణ్, కశీష్ ఖాన్, కమెడియన్ సుదర్శన్‌లు ఎంట్రీ ఇచ్చారని ముందుగానే చెప్పుకున్నాం. వీళ్లు కంటెస్టెంట్ల గురించి తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా సుదర్శన్ అయితే తాను రోజూ బిగ్ బాస్ షోను చూస్తానని చెప్పి కంటెస్టెంట్లు అందరి గురించి మాట్లాడాడు. సన్నీకి ఎంతో కోపం అని వ్యాఖ్యానించాడు. అలాగే, మిగిలిన వాళ్ల గురించి కూడా ఫన్నీగా కామెంట్లు చేశాడు. ఇక, చివర్లో సుదర్శన్.. సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ రొమాన్స్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Recommended Video

బయట ఇద్దరు ఉన్నారు అంటూ
షోలో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ.. 'షణ్ముఖ్, సిరి మీరిద్దరూ బాగా చేస్తున్నారు. బయట ఇంకో ఇద్దరు ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి' అంటూ సెటైర్లు వేశాడు. తద్వారా 'హౌస్‌లో మీ రొమాన్స్ ఎక్కువైంది. బయట మీ ఇద్దరికీ పార్ట్‌నర్స్ ఉన్నారు' అంటూ పరోక్షంగా కామెంట్ చేశాడు. రాజ్ తరుణ్ కూడా 'బయట సంబంధాలు చూస్తున్నాం.. నీకు కాదు' అంటూ సిరికి పంచ్ వేశాడు.


Click it and Unblock the Notifications











