Bigg Boss 5: స్నేహితుల మధ్య అగ్ని పరీక్ష.. నేను సరిగ్గా ఆడితే తట్టుకోలేవు.. జెస్సికి సన్నీ హెచ్చరిక

వారంలో ఆరు రోజులు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉన్నా కూడా సోమవారం వచ్చేసరికి కంటెస్టెంట్స్ మధ్యలో ఒక్కసారిగా ఆగ్రహజ్వాలలు మొదలవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ స్నేహితులం అంటూ తిరిగిన వాళ్లు కూడా నామినేషన్స్ కు వచ్చేసరికి ఒక్కసారిగా శత్రువులుగా మారిపోతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదట్లోనే రామ్ గోపాల్ వర్మ సినిమాలో తరహాలోనే మొదలైందని ఇటీవల హైపర్ ఆది చేసిన కామెంట్ కూడా ఒక విధంగా నిజమే. ఎందుకంటే కేవలం పరిచయాలతో నే కాస్త స్నేహంగా ఉండే కంటెస్టెంట్స్ నామినేషన్స్ కు వచ్చే సరికి ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోతున్నారు. ఇక ఎప్పటి నుంచో మంచి మిత్రులుగా ఉన్నటువంటి సన్నీ, జెస్సి మధ్యలో కూడా అగ్నిపరీక్ష మొదలయింది. సోమవారం నామినేషన్ లో ఈ ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగి పోయింది అని తెలిసిపోయింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఒకరికి ఒకరు సహకరించుకుంటూ

ఒకరికి ఒకరు సహకరించుకుంటూ

బిగ్ బాస్ మొదలైనప్పుడు చాలామంది గ్రూపులుగా ఏర్పడ్డారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో కొంతమంది మాత్రమే చాలా జెన్యూన్ గా ఆడుతూ వస్తున్నారు. షణ్ముఖ్ గ్యంగ్ వీలైనంత వరకు ఒకరినొకరు నామినేట్ చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. వీలైనంత వరకు వాళ్లు కూడా ఒకరిని టార్గెట్ చేస్తుండడం విశేషం. షణ్ముఖ్ సిరి జెస్సి ముగ్గురు ఒక గేమ్ ప్లాన్ లో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ బాగానే ముందుకు సాగుతున్నారు.

 దూరం పెరుగుతోంది..

దూరం పెరుగుతోంది..

ఇక షణ్ముఖ్ క్యాంప్ లో జెస్సీ చేరకముందు ఎక్కువగా సన్నీతోనే చాలా ఫ్రీ గా ఉండే వాడు. ఎలాంటి గొడవలు వచ్చినా కూడా వీరిద్దరూ కలిసికట్టుగా ఆటలో పాల్గొనేవారు. వీలైనంత వరకు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జాగ్రత్త పడేవారు. అయితే మొన్నటి వరకు కూడా ఎంతమంది చిచ్చుపెట్టినా కూడా గొడవ పడలేదు. వెంటనే కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా సన్నీ జెస్సితో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే షన్ను గ్యాంగ్ లో చేరాడు అప్పటి నుంచి వీరి మధ్య దూరం పెరుగుతోంది.

అందుకే నామినేషన్

అందుకే నామినేషన్

సోమవారం జరిగిన నామినేన్స్ లో ఎవరూ ఊహించని విధంగా మొదటి సారి ఒకరికి ఒకరు నామినేట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. సన్నీ జెస్సి ఇద్దరు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముందుగా సన్నీ, జెస్సిని నామినేట్ చేసి రాజా టాస్క్ మొదలైనప్పుడు నాణేలను దొంగతనం చేయడం తో పాటు చివరికి పట్టాభిషేకం జరిగేటప్పుడు కూడా ప్రత్యర్థులకు ఎక్కువగా మద్దతు ఇవ్వడం ఏ మాత్రం నచ్చలేదని అన్నాడు. అందుకే నామినేట్ చేస్తున్నాను అంటూ సన్నీ తెలిపాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నేను గేమ్ ఆడితే అస్సలు తట్టుకోలేవు

నేను గేమ్ ఆడితే అస్సలు తట్టుకోలేవు

ఇక తర్వాత జెస్సి కూడా అదే తరహాలో తన అభిప్రాయాలను తెలుపుతూ గేమ్ ఆడటానికి వచ్చాను అని అనవసరంగా నన్ను నామినేట్ చేసావు అని అప్సెట్ అయ్యాడు. ఇక నేను గేమ్ ఆడితే అస్సలు తట్టుకోలేవు అంటూ మరోసారి సన్నీ హెచ్చరిక జారీ చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ మొదటి సారి ఇద్దరు స్నేహితుల మధ్య బాగానే అగ్ని పరీక్షను మొదలుపెట్టాడు. మరి వారికి మస్య దూరం ఎంత వరకు ముందుకు సాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X