Bigg Boss: ఏడ్చేసిన మానస్, సన్నీ.. ఎమోషన్స్ తో ఆడుకుంటుందిరా అంటూ సన్నీ ఆవేదన!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు వారాలు విజయవంతంగా పూర్తి కాగా నలుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఈ వ్యవహారంలో మాటా మాటా పెరిగింది అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంలో సన్నీ అలాగే మానస్ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడం తాజా ప్రోమో లో చూపించారు. ఆ వివరాల్లోకి వెళితే

కెప్టెన్సీ టాస్క్
తాజాగా బిగ్ బాస్ లో నలుగురు సభ్యులు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. యాంకర్ రవి, శ్వేత వర్మ, ప్రియా అలాగే అని మాస్టర్ ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు. ఈ కెప్టెన్సీ టాస్క్ ప్రకారం ఈ వారానికి గాను కెప్టెన్‌ను ఎంచుకొనేందుకు.. 'పది వేళ్ళు సరిపోదు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

షన్ను సంచాలకుడిగా
ఈ సందర్భంగా నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు నాలుగు రంధ్రాలు ఉండే నీటి ట్యాంక్ ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంధ్రాలను మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.
ఏడ్చేసిన సన్నీ
అయితే ఈ టాస్క్ లో సభ్యుల మధ్య మాటా మాటా పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి ఇష్టమైన కంటెస్టెంట్ లకు వారు సపోర్ట్ చేస్తూనే తమకు ఇష్టం లేని కంటెస్టెంట్ బ్యాంకుల నుంచి నీరు వృధా చేయవద్దని బిగ్ బాస్ సూచించడంతో పోటాపోటీగా ఈ టాస్క్ జరిగింది. ఇక ఈ టాస్క్ గురించి సన్నీ అలాగే మానస్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. నేను వాళ్లను పనిష్ చేయాలి అని అనుకోలేదని , వదిలేద్దాం అని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు. మనాస్ ఏడుస్తుండగా లోబో ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశాడు.

ఏడ్చేసిన మానస్
అయితే ఎంత అడిగినా నా మనసు మాత్రం ఏమీ లేదు అని మానస్ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశాడు. సన్నీ ఏడుస్తూ ఒకపక్క ఇష్టపడని వాళ్ల బకెట్ నీళ్లు తీయాలని ఉంది మరోపక్క ఇష్టపడే వాళ్ల బకెట్లో పోయాలని ఉంది అంటూ ఏడుస్తూ ఉండడంతో విశ్వ కల్పించుకున్నారు. నీకు ఒక్కరు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే పరిస్థితి వేరు కానీ అందరూ మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్? ఏంటి మామ ఇది ఎమోషన్స్ తో ఆడుకుంటుంది అంటూ మళ్లీ సన్నీ ఏడవడం చూపించారు.

ప్రియా కెప్టెన్ గా
మొత్తం మీద ఈ రోజు విడుదలైన మొదటి ప్రోమోలో శ్రీరామచంద్ర వర్సెస్ షన్ను గ్యాంగ్, అలాగే కాజల్ వర్సెస్ రవి అన్నట్లు సాగగా ఈ ప్రోమో లో మాత్రం మానస్ అలాగే సన్నీ ఇద్దరు ఏడవడం తో మొత్తం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ప్రియా హౌస్ కెప్టెన్గా ఎన్నికైనట్లు ప్రచారం జరుగుతూ ఉండగా కాజల్ వరస్ట్ ఫార్మర్ గా ఎంపికైందని ఆమె జైలుకు కూడా వెళ్ళింది అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











