పాపం సన్నీ.. నోరి జారి లేదని బుకాయింపు.. వీడియోలతో అడ్డంగా దొరికేయడంతో ఆడుకున్న నాగ్!
బిగ్ బాస్ ఇంట్లో పదో వారాంతం ఆట ఆసక్తికరంగా సాగింది. హౌస్ లో సభ్యులు తగ్గుతున్న కొద్దీ గొడవలు పెరుగుతున్నాయి. ఆటల్లో గొడవలు వ్యక్తిగతాల దాకా రావడంతో శనివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి అందరికీ వార్ణింగ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా నాగార్జున సన్నీని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

నోరు జారి
మొన్న కెప్టెన్సీ టాస్క్ లో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరికొకరు నోటికి ఎంతోస్తే అంత మాటా అనేశారు. అవతల ఒకరు కంట్రోల్ తప్పి పోతుంటే.. ఇవతలి నుంచి ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారు. అలా సన్నీ ఎప్పటిలాగే రెచ్చి పోయి నోరు జారి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. సిరి ఇంకా రెచ్చగొట్టగా షన్ను, సిరి కలిసి సన్నీ టెంపర్ లేచేలా చేశారు.

నాగ్ ముందే నాగిని డాన్స్
దీంతో అప్పడం అవుతావ్.. తంతా.. అనే పదాలను వాడాడు. మధ్యలో షన్ను ఎంట్రీ ఇవ్వడంతో ఆడవాళ్లను అడ్డుపెట్టి ఆడుతున్నావు అని అనడమే కాక అతని ఫెషన్ యూట్యూబ్ మీద కూడా సెటైర్ వేశాడు. అయితే భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిని డాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది.

తంతానన్నా
ఆ తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని సన్నీ బుకాయించాడు. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో సన్నీ పరువు పోయినట్టు అయింది.

కవరింగ్
నాగార్జున కవరింగ్ అంటున్నా సరే సన్నీ మాత్రం తాను బ్రిక్స్‌నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వకాల్తా పుచ్చుకుని మరీ వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు.

మరో వీడియోలో దొరికేసి
దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, అనీ అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నునే సపోర్ట్ చేశారు. అయితే అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ అభిప్రాయడింది.
Recommended Video

పండగ చేసుకుంటూ
సిరి, సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే దానికి నాగార్జున మాత్రం అసలు కాజల్ అనీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందని తేల్చాడు. మొత్తం మీద సిరి, షన్ను తప్పులేదన్నట్టు వెల్లడించారు. ఈ దెబ్బతో షన్ను ఫాన్స్ పండగ చేసుకుంటూ ఉండగా సన్నీ ఫాన్స్ మాత్రం నాగార్జునను ట్రోల్ చేస్తున్న పరిస్థితి.


Click it and Unblock the Notifications











