Bigg Boss 5: రవిని బయటకు పంపేసి.. ఇప్పుడు రవి రవి అని అరుస్తున్నారేంట్రా?: సన్నీ కన్ఫ్యూజన్
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ కు చేరుకుంటున్న తరుణంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. పోటీ తీవ్రత ఎంత ఎక్కువ అయినప్పటికీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక టాప్ 5లోకి ఎవరు వెళతారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది. ఇక బుదవారం ఎపిసోడ్ లో అయితే సిరి, షన్ను హై డ్రామా క్రియేట్ చేశారు. అంతే కాకుండా రవిని తలచుకుంటూ బాధపడిపోయారు. ఇక వారి బాధను చూసి సన్నీ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు.

టికెట్ టూ ఫినాలే
టికెట్ టూ ఫినాలే టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఎంత కష్టమైనా సరే పోటీలో వెనక్కి తగ్గడం లేదు. చివరి వరకు నెవర్ గివప్ అదే తరహాలోనే పోరాడుతున్నారు. సన్నీ, సిరి మధ్యలో కూడా పోటీ తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈసారి ఐస్ లో కాళ్ళు పెట్టి ఎవరైతే వారి పక్కన ఉన్న బాల్స్ ను కాపాడుకుంటారో వారే మొదటి ఛాలెంజ్ లో విజేతగా నిలిచినట్లు లెక్క.

సన్నీ వర్సెస్ సిరి
టికెట్ టూ ఫినాలే టాస్క్ లో మొత్తం మూడు ఛాలెంజ్ లు ఉంటాయి. ఇక అందులో ఎవరు ఎక్కువ పాయింట్స్ తో ముందంజలో ఉంటారో వారికే బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సన్నీ అయితే ఈసారి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గేమ్ అడుతున్నాడు. సిరితో పోటీగా బాల్స్ లాగేసుకున్నాడు. అయితే సిరి అతని బాల్స్ ను మొండిగా లాగేసుకుంటోంది. కానీ సన్నీ లాగేసుకుంటే మాత్రం అప్పుడే ఎమోషనల్ అవుతోంది.

రవిని తలచుకుంటూ..
సిరి డ్రామా బాధను చూసి షన్ను కూడా అప్పుడే కరిగిపోయినట్లు మరో డ్రామా క్రియేట్ చేశాడు. ఆ బాధలో రవి అభిమానుల మద్దతు కావాలని అనుకున్నారో ఏమో గాని రవి రవి అంటూ తలచుకున్నారు. నీ కోసమే ఈ గేమ్ ఆడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. ఇక సిరి కూడా అదే తరహాలో ఏడుస్తూ రవిని తలచుకుంది. వారిద్దరిని చూసిన సన్నికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.

మధ్యలో వచ్చిన శ్రీరామ్
ఇక సన్నీ అంటే మొదటి నుంచి కూడా విభేదిస్తున్న శ్రీరామచంద్ర సడన్ గా మధ్యలోకి వచ్చి కావాలంటే నా బాల్స్ తీసుకో అంటూ త్యాగముర్తిగా దర్శనమిచ్చాడు. సిరికి అతను సహాయం చేస్తున్నట్లు మరో సీన్ క్రియేట్ చేశాడు. ఇక సన్నీ ఆటకు తగ్గట్టుగానే టైమ్ వచ్చినప్పుడు నీ బాల్స్ తీసుకుంటాను. నా గేమ్ నేను ఆడతాను అంటూ కౌంటర్ అయితే ఇచ్చాడు.
Recommended Video

రవి రవి అని అరుస్తున్నారేంట్రా?
ఇక షన్ను, సిరి రవిని గుర్తు చేసుకోవడం పై సన్నీ కన్ఫ్యూజ్ అయ్యాడు. అతన్ని నామినేట్ చేసి మరి హౌస్ లో నుంచి బయటకు పంపేశారు. ఇప్పుడు మళ్ళీ రవి రవి అని అరుస్తున్నారేంట్రా? అంటూ మానస్, కాజల్ తో చెప్పుకున్నాడు. ఏదేమైనా షన్ను సిరి ఈసారి క్రియేట్ చేసినా డ్రామా అంతా ఇంతా కాదు. మానస్ సిరికి హెల్ప్ చేస్తే తట్టుకోలేకపోయిన షన్ను అసలు నా దగ్గరికే రావద్దని అన్నాడు. కానీ మళ్ళీ చీకటి పడగానే ఎప్పటిలానే దుప్పట్లో దూరిపోవడం విశేషం.


Click it and Unblock the Notifications











