అనీ మాస్టర్ కి ఇంగ్లీష్ ముద్దా? ఏం మాటలు సన్నీ.. ఆడుకుంటున్న నెటిజన్లు, సన్నీ ఫాన్స్ లాజిక్ ఏంటంటే?

బిగ్ బాస్ సీజన్ 5 ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడవ వారం జరుగుతుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా మానస్, విశ్వ, కాజల్, రవి, సన్నీ ఎంపికైన సంగతి తెలిసిందే. వీరికి బెలూన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో గెలిచిన సన్నీ చేసిన కామెంట్స్ మీద దుమారం రేగింది. ఆ వివరాల్లోకి వెళితే

నిన్న జరిగిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో సందర్భానుసారం బజర్ మోగినప్పుడు పెడస్టల్ పై ఉన్న గుండుసూది హౌస్ మేట్స్ తీసి.. ఎవరికైతే మద్దతు తెలుపుతారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్న సభ్యుల బెలూన్ ను పగలగొట్టవచ్చు. ముందుగా గుండుసూది జెస్సీకి దొరకడంతో దాన్ని కాజల్ చేతిలో పెట్టాడు. కాజల్ తన దగ్గరున్న పిన్ తో విశ్వ బెలూన్ ను పొడిచే ప్రయత్నం చేసింది.

ఆ రీజన్ చెప్పవద్దు

ఆ రీజన్ చెప్పవద్దు

అయితే అందుకు ఒప్పుకోని విశ్వ సరైన రీజన్ చెప్పి పొడవాలని అనగా.. 'నువ్వు రెండు సార్లు కెప్టెన్ అయ్యావ్' అని కాజల్ చెప్పగా.. కష్టపడి అయ్యాను ఆ రీజన్ చెప్పవద్దు అంటాడు విశ్వ. ఆ తర్వాత కాజల్ పొందడానికి చూడడంతో అక్కడి నుంచి విశ్వ పరుగెత్తగా.. యాక్సిడెంటల్ గా బెలూన్ పగిలిపోయింది.

 విశ్వపై ప్రియాంక ఫైర్

విశ్వపై ప్రియాంక ఫైర్

ఇక రెండోసారి బజర్ మోగిన వెంటనే పెడస్టల్ పై ఉన్న గుండు సూది కోసం పరిగెత్తుకుంటూ వెళ్లగా ప్రియాంక, విశ్వ, లోబో ఒకే సారి ముందుకు వెళ్ళారు. ఆ సమయంలో విశ్వ ప్రియాంకను తోసుకుంటూ ఆమె కింద పడిపోయింది. దీంతో విశ్వపై ప్రియాంక మండిపడింది. ఇక్కడ కండ బలం కామెంట్స్ రావడంతో ఇద్దరూ గొడవ పడ్డారు.

సంపాదించు.. అడుక్కోకు

సంపాదించు.. అడుక్కోకు

ఆ తర్వాత పిన్ అందుకున్న రవి.. మానస్ బెలూన్ ను పొడిచేశాడు. అనంతరం 'నేనవుతా రవి కెప్టెన్..' అంటూ కాజల్ కన్విన్స్ చేయగా 'సంపాదించు.. అడుక్కోకు' అని డైలాగులు వేశాడు రవి. మూడోసారి బజర్ మోగినప్పుడు లోబో గుండుసూది తీసుకొని రవి చేతిలో పెట్టగా.. ఆ పిన్ ని చూపిస్తూ కాజల్ డి పొడిచాడు రవి.

 కామెడీ చేసి

కామెడీ చేసి

నాలుగోసారి బజర్ మోగినప్పుడు అనీ మాస్టర్ పిన్ తీసుకొని సన్నీకి ఇవ్వగా అతడు రవి బెలూన్ ను పేల్చి.. కెప్టెన్ గా నిలిచాడు. ఆ తర్వాత అనీ మాస్టర్ కు బలంగా ముద్దు పెట్టాడు సన్నీ. ముందు షాకయినా తరువాత ఆమె అర్ధం చేసుకుంది. కెప్టెన్ బట్టలు వేసుకుని వచ్చి మళ్ళీ ఆమెతో మాట్లాడాడు సన్నీ. 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని' అంటూ కామెడీ చేసి నవ్వించాడు.

అలా అడగొచ్చా?

అలా అడగొచ్చా?

ఇక సన్నీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సన్నీ వయసు ఏంటి ? అనీ మాస్టర్ వయసు ఏంటి? అలా అడగొచ్చా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ సన్నీ మద్దతుదారులు మాత్రం సన్నీ తన సంతోషాన్ని అలా వ్యక్త పరిచాడని అంటున్నారు. అంతేకాక శ్వేతా, హమీదా లాంటి వాళ్ళు అమ్మ అంటున్నారు కానీ అనీ మాస్టర్ అంత వయసు ఉన్న వ్యక్తి కాదని సన్నీ వయసు 32 కాగా ఆమె వయసు 30 మాత్రమే అని అంటున్నారు. సన్నీ అలా అనడం తప్పే కానీ దాన్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X