twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ అగ్ని పరీక్ష.. జుట్టు పీక్కున్న రవి, శ్రీరామ్.. పింకీ మీద సన్నీ దారుణ కామెంట్లు

    |

    స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టాస్క్ లతో కుటుంబ సభ్యుల మధ్య ఊహించని గొడవలతో, వారి మధ్య బాండింగ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే హౌస్ లో నుంచి జెస్సీ బయటకు వెళ్లడం షాకింగ్ గా మారింది. ఇక తాజా ప్రోమోలో కూడా ఆసక్తి రేపే విధంగా మార్చాడు బిగ్ బాస్. ఆ వివరాల్లోకి వెళితే

    ఎమోషనల్

    ఎమోషనల్

    ఈ ఉదయం విడుదలైన ప్రోమో ప్రకారం ఆరోగ్యం ఇంకా కుదుట పడక పోవడం తో జెస్సీ ను హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అని బిగ్ బాస్ కోరడం జరిగింది. ఈ మేరకు జెస్సీ హౌస్ లో నుండి వెళ్లాల్సి వచ్చింది. జెస్సీ వెళ్తుంటే సిరి, షన్ముఖ్ అయితే షాక్ అయి చూస్తూ ఉండగా మిగతా హౌస్ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు.

    బయటకు పంపారు

    బయటకు పంపారు

    ఇక జెస్సీని హాస్పిటల్ కు పంపి, తిరిగి రీ-ఎంట్రీ ఛాన్స్ ఇస్తారని కొందరు అంటుంటే, లేదు ఆయన ఆరోగ్యం కుదుట పడే దాకా లోబో తరహాలో జెస్సీని సీక్రెట్ రూమ్ కి పంపి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని మరి కొందరు అంటున్నారు. అయితే అసలే ఆరోగ్యం బాగోని జెస్సీ ఒక్కడినే అలా ఒంటరిగా సీక్రెట్ రూమ్ లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి అతన్ని హాస్పిటల్ లో చేర్చడానికి బయటకు పంపారు అంటున్నారు కొందరు.

    అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది?

    ఆ సంగతి పక్కన పెడితే తాజా ప్రోమో ప్రకారం కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ ఓ గిఫ్ట్‌ పంపాడు. నోరూరించే ఫుడ్‌ ఐటమ్‌ను పంపి ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది? అని దాని మీద రాసి ఉంచాడు. దీంతో ఇంటి సభ్యులు ఇదేంటి? అసలు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? దీని మీద ఒకటి కాదు మూడు క్వశ్చన్ మార్క్ లు ఉన్నాయని చర్చించుకుంటున్నారు.

    తొక్కలో డిస్కషన్‌

    తొక్కలో డిస్కషన్‌

    ఇది చూసిన సన్నీ 'ఈ తొక్కలో డిస్కషన్‌ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్‌ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ అనీ మాస్టర్‌ మాత్రం వద్దని వారించింది. ఇక శ్రీరామ్‌ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాక బల్ల కింద ఏమన్నా ఉందా? అని కూడా చెక్ చేస్తూ హల్చల్ చేశాడు.

    Recommended Video

    Raja Vikramarka Pre Release Event సినిమాకి పాత రోజులు వచ్చాయి Vishwak Sen
    దారుణ కామెంట్స్

    దారుణ కామెంట్స్

    కానీ చివరగా అనీ.. తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటి సభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగా సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో పో లోపలికి వెళ్లి అంటూ దారుణ కామెంట్లు చేశాడు.

    ఆయన కావాలని అన్నాడో పొరపాటున అన్నాడో తెలియదు కానీ ఆ కామెంట్స్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక కేక్‌ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్ అయ్యేదాకా ఆగాల్సిందే.

    English summary
    In Boss Telugu 5 latest promo Sunny made serious comments on priyanka singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X