Bigg Boss 5: షణ్ముఖ్ పై రివెంజ్ తీర్చుకున్న సన్నీ.. కరెక్ట్ టైమ్ లో దెబ్బ కొట్టాడు!

బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకుంటున్న సమయంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వారి ప్రత్యర్ధులను గట్టిగానే డీ కొడుతున్నారు. ఇక మరోవైపు బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో డోస్ ఎంత పెంచుతున్నా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇక సరైన సమయంలో షణ్ముఖ్ పై సన్నీ రివెంజ్ తీర్చుకున్నాడు. మొన్నటివరకు వీరి మధ్యలో కోల్డ్ వార్ అయితే గట్టిగానే కొనసాగింది. ఇక టికెట్ టూ ఫినాలే లో అయితే ఆ డోస్ మరింత ఎక్కువైంది అనే చెప్పాలి.

 రెండో ఛాలెంజ్ లో..

రెండో ఛాలెంజ్ లో..

గురువారం ఎపిసోడ్‌లో సన్నీ-షణ్ముఖ్‌ ఇద్దరు కూడా అసలైన దాయదులుగా పోటీ పడ్డారు. జరిగిన రెండో ఛాలెంజ్ లోనే టైమ్ చూసుకొని మానస్ టాస్క్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మానస్ చెప్పినట్టుగా సన్నీ టైమ్ ను గమనించిన చివరి స్థానలో నిలిచాడు. మొదటి స్థానంలో మానస్ నిలువగా ఆ తరువాత షణ్ముఖ్ , సిరి , శ్రీరామ్ , ప్రియాంక టాప్ 5లో నిలిచారు. ఇక కాజల్ 6, సన్నీ ఏడోస్థానంలో నిలిచారు.

వారికి బదులుగా

వారికి బదులుగా

మూడో రౌండ్ లో ఏడుగురు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోటీ పడగా.. సిరి, శ్రీరామ్‌ లు అస్వస్థతకు గూరవ్వడంతో వారికి బదులుగా మరో ఇద్దరికి ఛాన్స్ దొరికింది. ఇక సన్నీ తన పాత శత్రువు శ్రీరామ్ కోసం రంగంలోకి రాగా షణ్ముఖ్ ఎప్పటిలానే సిరి కోసం ముందుకి వచ్చాడు. కాళ్ల నొప్పులు ఉన్నప్పటికీ కూడా సిరి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. షన్ను రంగంలోకి దిగే సమయంలోనే అమ్మడు కాళ్ల నొప్పులు ఉన్నాయని అయినా కూడా అడతానని ఎమోషనల్ గా డ్రామా క్రియేట్ చేసింది.

సిరి కోసం షన్ను

సిరి కోసం షన్ను

ఇక షన్ను సిరి మధ్యలో కొంత రొటీన్ సెంటిమెంట్ అనే తరహాలో డ్రామా నడిచింది. ఈసారి మాత్రం నా గేమ్ నేనే ఆడతాను అంటూ ముందుకు రాగా బిగ్ బాస్ మాత్రం ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. సిరి ఆడేందుకు బిగ్ బాస్ ఒప్పుకోకపోవడంతో సిరి తరుపున షన్ను ఆటలోకి దిగాడు. టాస్క్ విషయానికి వస్తే.. వాటర్ పోసి బాల్స్‌ని టబ్‌లలో పడేలా చేయాలి. ఇక ఎవరైతే వేగంగా వాటర్ పోసి.. ఆ బాల్స్ అన్నీ తొందరగా పడేలా చేసి బెల్ కొడతారో వాళ్లే ఈ టాస్క్‌లో విజేతగా నిలుస్తారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
దెబ్బ కొట్టిన సన్నీ

దెబ్బ కొట్టిన సన్నీ

ఇక పోటీపోటీగా పోరాడిన సన్నీ షన్ను ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రేక్షకులనే కాకుండా కంటెస్టెంట్స్ లలో కూడా చాలా ఆసక్తిని రేపింది. ఇద్దరు కూడా పాత శత్రుత్వాన్ని గుర్తు చేసుకొని మరి స్ట్రాంప్ గా ఆడినట్లు అనిపించింది. షన్ను అయితే సిరి కోసం ప్రాణం పెట్టేసినట్లు అనిపించింది. కానీ చివరికి ఈ పోరులో సన్నీ గెలిచాడు. సాధారణంగా షన్ను తన గేమ్ లో ఓడినా కూడా అంతగా బాధపడేవాడు కాదేమో. ఇక సన్నీ అయితే గతంలో షన్ను ఇచ్చిన కౌంటర్ కి కరెక్ట్ సమయంలో రివెంజ్ తీర్చుకున్నాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X