Bigg Boss 5: ఆమె కట్లపాము.. అతను నల్ల నక్క.. వాళ్ల పరువు తీసేసిన సన్నీ.. షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌస్ లో తిట్టుకోవడం రొమాన్స్ చేయడం చాలా కామన్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే కొన్నిసార్లు అవి పరిధులు దాటి తీవ్ర స్థాయిలో విమర్శలకు దారి తీస్తాయి. అసలు తెలుగులో బిగ్ బాస్ షో మొదలైనప్పుడు ఫస్ట్ సీజన్ లోనే సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా వచ్చాయి. ఇలాంటి కాంట్రవర్సీ షోను నడపడం అంత సాధారణమైన విషయం కాదు అని అందరికి తెలిసిందే. కానీ స్టార్ మా మాత్రం చాలా తెలివిగా డోస్ పెంచకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక సీజన్ 5లో కంటెస్టెంట్స్ ఒక విధంగా కొన్నిసార్లు హద్దులు దాటినప్పటికి మ్యానేజ్ చేసుకుంటూ వస్తున్నారు.

బిగ్ బాస్ స్క్రిప్ట్
కొన్నిసార్లు రియాలిటీ షోలు కొనసాగే విధానంలో ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. పక్కా ప్రణాళికలతోనే షోను కొనసాగించినప్పటికి కూడా కొన్నిసార్లు రేటింగ్స్ కోసం స్క్రిప్ట్ తరహాలో కొనసాగిస్తూ ఉంటారు అనే ఆరోపణలు కూడా రుజువయ్యాయి. ఇటీవల కాలంలో బిగ్ బాస్ లో కొనసాగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉంటే నిజంగానే ఆ తరహాలో ముందుకు సాగుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ బాస్ పై మాత్రం సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట వస్తున్నాయి.

నాగార్జున హోస్టింగ్ పై కామెంట్స్
ఇక 11వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సీజన్ 5 పరవాలేదు అనే విధంగా కొనసాగుతోంది. గత వారం అయితే షో చాలా చెప్పగా కొనసాగింది అనే కమేంట్స్ వస్తున్నాయి. నాగార్జున హోస్టింగ్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. అసలు ఆయన గేమ్ ను ఫాలో అవుతున్నారా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. గత మూడు సీజన్స్ లలో కూడా సమానంగా అందరికి న్యాయం చేసి మంచి హోస్ట్ గా క్రేజ్ అందుకున్న నాగ్ ఈసారి మాత్రం దారి తప్పుతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

నటరాజ్ స్టైల్ లో సన్నీ
ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియతో చాలా ఘాటుగా మొదలైన బిగ్ బాస్ షోలో మరోసారి కంటెస్టెంట్స్ గట్టిగానే తిట్టేసుకున్నారు. ముఖ్యంగా సన్నీ అయితే ప్రధాన కంటెస్టెంట్స్ ను నటరాజ్ మాస్టర్ స్టైల్ లో తిట్టేశాడు. నటరాజ్ మాస్టర్ రవికి గుంటనక్క అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. కానీ సన్నీ మాత్రం ఈ సారి షణ్ముఖ్ జస్వంత్ కు నల్లనక్క అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Recommended Video

కట్ల పాము నల్లనక్క..
ఆనీ మాస్టర్ అయితే ఖచ్చితంగా పాము అని చెప్పిన సన్నీ యాంకర్ రవికి నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే పర్ఫెక్ట్ పేరు గంటనక్కే అని జవాబు ఇచ్చాడు. ఇక సిరి అయితే కట్లపాము అంటూ షణ్ముఖ్ అయితే నల్ల నక్క అని వివరణ ఇచ్చారు. ఇక తనకు తాను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేరు పెట్టడం బెటర్ అని చెప్పిన సన్నీ కొంత ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలు కావడంతో సన్నీ మెడలో ఉన్న గిల్టీ బోర్డ్ ను తీసేయ్యాలని బిగ్ బాస్ యాంకర్ రవికి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











