Bigg Boss: ట్విస్టుల మీద ట్విస్టులు..కాజల్ బ్రేకప్, ఆనీ మాస్టర్ vs శ్వేతా, షణ్ముఖ్ కి షాక్

తెలుగు బిగ్ బాస్ పై ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా ఆరో వారం లోకి కూడా ఎంటర్ అయింది. ఐదు వారాలకు గాను ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన నామినేషన్లు కూడా వాడీవేడీగా సాగాయి. నామినేషన్ల తరువాతి రోజు హౌస్ సభ్యులలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు విడుదలైన ప్రోమో లో కూడా ఇదే చూపించారు. ఆ వివరాల్లోకి వెళితే

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

సరదాగా

సరదాగా


బిగ్ బాస్ హౌస్ లో నిన్న రాత్రి జరిగిన నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. హౌస్ సభ్యులు ఒకరినొకరు ధూషించుకొంటూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చెలరేగిపోయారు. ఆనీ మాస్టర్ విశ్వతో గొడవపడగా ప్రియాంక, లోబోతో గొడవ పడింది. సన్నీ, ప్రియ అలాగే జస్వంత్ తో గొడవ పడినట్లు గా చూపించారు. ఇక తాజా ఎపిసోడ్ లో హౌస్ సభ్యులు అందరూ ఆనందంగా గడుపుతున్నట్లు గా చూపించారు.

కాజల్ బ్రేకప్

కాజల్ బ్రేకప్


కిచెన్ లో శ్రీరామ్, హమీదాలను సన్నీ ఇమిటేట్ చేసి హౌస్ సభ్యులందరినీ కాసేపు నవ్వించాడు. ఇక శ్రీరామ్ తన తమ్ముడు అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న కాజల్ స్శ్రీ రామ్ తో తనకు బ్రేకప్ అయిందని చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ లకు మొదటి బ్రేకప్ మనదే అవుతుంది అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.. జస్వంత్ ను శ్రీరామ్ ఏదో అన్నాడు అని శ్రీ రామ్ ను నేను నామినేట్ చేస్తే అది చాలా దరిద్రమైన పని అని షణ్ముఖ్ జస్వంత్ తో అనడం కనిపించింది. మరోపక్క శ్వేతా హౌస్ సభ్యులలో ఎవరి మీదో ఫైర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఆనీ మాస్టర్ మీద షన్ను చాడీలు

ఆనీ మాస్టర్ మీద షన్ను చాడీలు


ఇక శ్వేత మాట్లాడుతూ వాష్ రూమ్ లో మనల్ని రెచ్చగొడితే మన రెండో కోణాన్ని చూపిస్తామని అనుకోవడం చాలా తప్పు అని అంటే మన అగ్లీ సైడ్ ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని అనుకోవడం చాలా తప్పు అని చెప్పుకొచ్చింది. ఆనీ మాస్టర్ గురించి షణ్ముఖ్ మాట్లాడుతూ మన ముగ్గురం వెళ్లి శ్రీరామ్ మీద పడుతున్నామని ఆమెకి అనిపించింది కానీ అందరూ వచ్చి మన మీద పడుతున్నామని ఆమె కనిపించలేదని అంటూ షణ్ముఖ్ చెప్పడం డా ప్రోమో లో చూపించారు.

ఆనీ మాస్టర్ తో శ్వేతా ఫైట్

ఆనీ మాస్టర్ తో శ్వేతా ఫైట్

ఇక ప్రోమోలో చూపించనివి కూడా జరిగాయని అంటున్నారు. శ్వేత ఆనీ మాస్టర్ మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు అలాగే బిగ్ బాస్ షణ్ముఖ్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి గేమ్ ఆడకుండా అతను వేరే వాళ్ల గురించి మాట్లాడుతున్న మాటలు క్లిప్పింగ్స్ చూపించినట్టు తెలుస్తోంది. అలా చూపించి ఇకమీదట అయినా ఈ గ్రూపు పక్కనపెట్టి ఆట మీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

Recommended Video

Most Eligible Bachelor Trailer | Akhil Akkineni | Pooja Hegde
షణ్ముఖ్ కి షాక్

షణ్ముఖ్ కి షాక్

నిజానికి సిరి, షణ్ముఖ్, జస్వంత్ ముగ్గురు కలిసి ఎప్పటికప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. వారు ఇతర హౌస్ సభ్యుల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తామని వారు చెప్పుకుంటున్నారు కానీ చూసి జనానికి మాత్రం ఇది ఏ మాత్రం నచ్చడం లేదనే చెప్పాలి. అందుకే బిగ్ బాస్ కల్పించుకుని షణ్ముఖ్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి మరీ షాక్ ఇచ్చారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X