For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ హౌస్‌లో కొట్లాట: వెధవ** అంటూ రెచ్చిపోయిన కంటెస్టెంట్.. ముఖంపై గట్టిగా కొట్టడంతో!

  |

  తెలుగులో ప్రసారం అయ్యే మిగిలిన షోలతో పోలిస్తే ఎక్కువ ఆదరణను అందుకుంటూ దూసుకుపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, కొట్లాటలకు మరింత ఎక్కువ స్పందన దక్కుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సీజన్‌లో కొన్ని వారాలు పూర్తైన తర్వాత ఈ తరహా పరిస్థితులు కనిపించేవి. కానీ, ఇటీవల మొదలైన ఐదో సీజన్‌లో ఆరంభం నుంచి ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం జరిగే టాస్కులోనూ రచ్చ రచ్చ జరిగింది. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  వారం గడిచింది.. ఒక్కరు వెళ్లిపోయారు

  వారం గడిచింది.. ఒక్కరు వెళ్లిపోయారు

  బిగ్ బాస్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐదో సీజన్‌ సెప్టెంబర్ 5న అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో గత వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అవగా.. బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయింది. ఇక, ఈ వారం మొత్తం అన్ని రకాల ఎమోషన్స్‌తో మజాను పంచారు.

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

  ఈ వారం అసలైన రచ్చ ఉంటుందని

  ఈ వారం అసలైన రచ్చ ఉంటుందని

  ఐదో సీజన్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు పూర్తయ్యాయి. ఈ మధ్యలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. దీంతో ఒకరిపై ఒకరు తమకు తోచిన విధంగా అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. దీన్ని నాగార్జున ముందే చాలా మంది వ్యక్త పరిచారు. ఫలితంగా ఈ వారం కంటెస్టెంట్ల మధ్య అసలైన రచ్చ ఉండబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  రెండో వారం నామినేషన్ ప్రక్రియ ఇలా

  రెండో వారం నామినేషన్ ప్రక్రియ ఇలా

  తాజాగా రెండో వారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీని ప్రకారం.. నామినేషన్ ప్రక్రియ రెండు గ్రూపుల మధ్య జరగబోతుంది. ఇంట్లోని సభ్యులందరినీ రెండు జట్లుగా విభజించిన బిగ్ బాస్.. రెడ్ కలర్ అనే టాస్క్ ఇవ్వబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇందులో ఎన్నో గొడవలు కూడా జరిగాయి.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

   ఉమాదేవి.. విశ్వ ఫైట్.. బూతు మాటతో

  ఉమాదేవి.. విశ్వ ఫైట్.. బూతు మాటతో

  ఈ ప్రోమోలో నామినేషన్స్ టాస్క్ సమయంలో కొందరు గొడవ పడిన దాన్ని హైలైట్ చేసి చూపించారు. మరీ ముఖ్యంగా విశ్వ .. ఉమాదేవిని నామినేట్ చేస్తూ ‘మన శత్రువైన అడిగితే అన్నం పెట్టాలి' అన్నాడు. అప్పుడామె ‘నాగార్జున గారు ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా నేనిస్తే.. నేనెంత వెధవ**నో తెలిసిపోద్ది జనాలకు' అంటూ బూతు మాట వాడడంతో అంతా షాకయ్యారు.

  యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చిన లోబో

  యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చిన లోబో

  ఆరంభం నుంచే ఎంతో స్నేహంగా ఉంటూ వచ్చిన యాంకర్ రవి, లోబో మధ్య గొడవ జరిగినట్లు కూడా ఈ ప్రోమోలో చూపించారు. అంతేకాదు, రవిని నామినేట్ చేసిన లోబో ‘రవి, లోబో దోస్తానా ఇంక వద్దు. దగడ్ రవి అంటారు చూడు.. ఇక్కడ దగడ్ లోబో' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే, ఇది నిజంగా జరిగిందా? లేక గత వారంలా యాక్టింగ్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  శ్వేత వర్మ తొలిసారి... వాళ్లిద్దరిపై ఫైర్

  హౌస్‌లో సైలెంట్‌గా ఉండే శ్వేతా వర్మ.. నామినేషన్స్ టాస్కులో మాత్రం రెచ్చిపోయింది. ముందుగా లోబో ఇచ్చిన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను పడేసిన ఆమె ‘లోబో నీ ఫ్రెండ్‌షిప్ వద్దు. కాజల్ గురించి నువ్వు మాట్లాడావు. ఇప్పుడు శ్వేతా వర్మలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అంటున్నావు. హమీదా నువ్వేమి అంటున్నావ్? ఏం ఇచ్చి పడేస్తావ్ అన్నావ్ కదా' అంటూ ఫైర్ అయింది.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  ముఖం మీద గట్టిగా కొట్టడంతో షాక్

  ముఖం మీద గట్టిగా కొట్టడంతో షాక్

  శ్వేతా వర్మ మాట్లాడుతోన్న సమయంలో హమీదా సమాధానం చెప్పబోయింది. అప్పుడామె ‘నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు. మీరిద్దరూ టోటల్‌గా ఫెయిల్ అయ్యారు' అంటూ ఇచ్చిపడేసింది. దీంతో కంటెస్టెంట్లు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అదే కోపంతో రంగును తీసుకెళ్లి హమీదా ముఖం మీద గట్టిగా కొట్టింది. దీంతో అంతా షాక్ అయ్యారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఓ రేంజ్‌గా సాగబోతుందన్న మాట.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Upcoming Episode.. Swetha Varma, Lobo and Umadevi Fired on Contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X