Bigg Boss 5: ఇచ్చిపడేస్తా శ్వేతా వర్మకు బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?

తెలుగులో కూడా బిగ్ బాస్ షో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుందని ఫస్ట్ సీజన్ మొదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. ఈ కాంట్రవర్సీ షో ఎలా నిలదొక్కుకుంటుందో అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మన స్టార్ హీరోలు బిగ్ బాస్ షోకు ఒక అగ్రపీఠం వచ్చేలా హోస్టింగ్ చేశారు. ప్రస్తుతం నాగార్జున అయితే సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ లలో కూడా గెలిచిన వారే కాకుండా ఇతరులలో కూడా ప్రతి సీజన్లో ఎవరో ఒకరు హైలెట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈసారి ఎవరు కూడా అనుకున్నంతగా పైలెట్ అవ్వడం లేదు అనే టాక్ వస్తోంది. షో మొదలై 40 రోజులు దాటినా ఇంకా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు కూడా రావడం లేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సారి హౌస్ లోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఏ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. గత వారం ఎలిమినేట్ అయినటువంటి శ్వేతా వర్మకు కూడా ఎంత ఇచ్చారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఎవరు ఊహించలేదు

ఎవరు ఊహించలేదు

శ్వేత వర్మ మొదట హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు పెద్దగా ఎవరు గుర్తు పట్టలేదు. ఆమె ముగ్గురు మొనగాళ్లు - ద రోస్ విల్లా అనే కొన్ని చిన్న సినిమాల్లో మాత్రమే నటించింది. ఏదైనా సరే చాలా బలంగా మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ వచ్చింది. అయితే ఏడు వారాల పాటు శ్వేత వర్మ చాలా పవర్ఫుల్ గానే కొనసాగింది. గత వారం ఎలిమినేట్ అవుతుంది అని ఎవరూ ఊహించలేదు.

అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్

అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్

కొన్ని సందర్భాల్లో శ్వేతా వర్మ చేసిన పొరపాట్లు కూడా ఆమెకు హౌస్ లో నుంచి బయటకు వచ్చేలా చేశాయి. గత వారం ఆమె తన తల్లి సమానురాలు అయినటువంటి ఆనీ మాస్టర్ తో కూడా గొడవ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతర కంటెస్టెంట్స్ తో ఇంతకుముందు చాలా సార్లు గొడవ పెట్టుకున్నా కూడా శ్వేతా వర్మపై పెద్దగా నెగిటివ్ కామెంట్స్ రాలేదు. కానీ ఎప్పుడైతే తన సన్నిహితులు అని చెప్పుకున్న వారితోనే గొడవ పెట్టుకుందో అప్పటినుంచి శ్వేతా వర్మ పై ఆడియన్స్ లో కొంత నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

అప్పుడే తప్పించుకున్న శ్వేతా

అప్పుడే తప్పించుకున్న శ్వేతా

మొదటి నుంచి కూడా శ్వేతా వర్మ ఇచ్చి పడేస్తాను అనే డైలాగ్ తో బాగా వైరల్ అయ్యింది. ఆమె చెప్పే విధానం కూడా ఓ వర్గం వారిని ఎక్కువగానే ఆకట్టుకుంది. ఎక్కువగా శ్వేతా వర్మ నామినేషన్ ప్రక్రియ లో చాలా పర్ఫెక్ట్ గా కనిపించేది. గతంలో హమీదా విషయంలో శ్వేతా చేసిన పొరపాట్లు కూడా ఎలిమినేషన్ వరకు తీసుకు వచ్చాయి. కానీ అప్పుడే ఆమె డేంజర్ జోన్ నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుంది.

Recommended Video

Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Filmibeat Telugu
రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

శ్వేతా వర్మ నటిగా బయటి ప్రపంచంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ ద్వారా మాత్రం ఆమెకు మంచి ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఓ వర్గం ప్రేక్షకులు ఈమెకు చాలాసార్లు మద్దతు పలికారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఆమెకు వచ్చిన రెమ్యూనరేషన్ వివరాల్లోకి వెళితే.. శ్వేత వర్మకు వారానికి ఒక లక్ష రూపాయల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 7 వారాలకు గాను ఆమెకు ఏడు లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X