For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 Promo: గన్‌తో నాగార్జున మాస్ ఎంట్రీ, అదరగొట్టిన ప్రశాంత్ వర్మ, రాహుల్ సిప్లిగంజ్

  |

  తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఫైవ్ లోగోను విడుదల చేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసి తెలుగు ప్రేక్షకులను అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఈ రోజు విడుదలైన ప్రోమో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  ప్రోమో రిలీజ్

  ప్రోమో రిలీజ్


  తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఐదో సీజన్లో అడుగుపెడుతోంది.. అయితే గత కొద్ది రోజులుగా ఈ బిగ్ బాస్ కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో మీడియా లో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఫైవ్ లోగోను మాత్రమే విడుదల చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ రోజు ఏకంగా ఒక ప్రోమో విడుదల చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నామని శుభవార్త చెప్పారు.. ఈ విధంగా త్వరలోనే బిగ్బాస్ సీజన్ ఫైవ్ స్టార్ మా ఛానల్ లో మళ్లీ సందడి చేయబోతోంది.

   ఆసక్తి పెంచేశారు

  ఆసక్తి పెంచేశారు

  బోర్ కొడుతుంది అన్న మాటే ఇక వినిపించదు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము వచ్చేస్తున్నా అంటూ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రోమోలో పేర్కొన్నారు. సాధారణంగా మనం ఏదైనా సమయం గడవడం లేదు అనుకున్నప్పుడు బోర్ కొడుతుంది అనే మాట వాడుతూ ఉంటాం ప్రోమోలో ఆ బోర్ కొడుతోంది అనే విషయాన్ని కూడా చాలా క్రియేటివ్ గా చూపించారు దర్శకుడు. మరీ ముఖ్యంగా బోర్ డంకి చెప్పేయండి గుడ్ బాయ్ వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ అంటూ మంచి రైమింగ్ లో చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.. అయితే ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకపోయినా త్వరలోనే ప్రకటనతో మరింత ఆసక్తి పెంచేసారు అని చెప్పక తప్పదు.

   ప్రోమో వెనుక ఎవరెవరు అంటే

  ప్రోమో వెనుక ఎవరెవరు అంటే

  స్టార్ మా తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా ప్రసారం కాబోతోందని ఈ ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చినట్లయింది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ పూర్తి కావడంతో జనాలందరూ నిరాశక్తి లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ అందరి జీవితాలలో కళ లేక బోర్ గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా ప్రోమో లో చూపించారు. ఇక ఈ ప్రోమోని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించారు అలాగే బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న పాటను రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ గా ఉన్నారో ఆయన చేత పాట పాడించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎప్పుడు ఈ షో మొదలు కాబోతోంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ దాని కోసం కచ్చితంగా అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి

   ఆ రోజు నుంచి క్వారంటైన్

  ఆ రోజు నుంచి క్వారంటైన్

  జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది. అలాగే ఇప్పటికే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలామంది యాంకర్లు అలాగే సినీ నటులు, సీరియల్ నటులు ఈ సీజన్ లో కనిపించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుండగా చివరి రోజు షోలో అడుగుపెట్టే వరకూ ఎవరి పేరు నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆగస్టు 22 వ తేదీ నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరినైతే కంటెస్టెంట్ లుగా ఫైనల్ చేశారో వారిని తమ అదుపులోకి తీసుకొని బోతున్నారని తెలుస్తోంది. అలాగే ఖచ్చితంగా కంటెస్టెంట్ లు వ్యాక్సిన్ తీసుకునే లాగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ తీసుకుంటే పర్వాలేదు లేదా తామే వ్యాక్సిన్ వేయించేలా గా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

  Sanjana Galrani Exclusive Interview ఇలా ఉండటం చాలా కష్టం | Part 1
  ఆ టెన్షన్ వద్దని

  ఆ టెన్షన్ వద్దని

  గతంలో కన్నడ, తమిళ బిగ్ బాస్ వ్యవహారంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో రూల్స్ పాటిస్తూ ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండేలాగా ఈ సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలాగే గత సీజన్లో కనిపించిన లీకేజీ వ్యవహారం మీద కూడా ఈ సారి గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎడిటర్లు కెమెరా మెన్లను ఈ షో జరిగినన్నీ రోజులు తమ ఆధీనంలోనే ఉంచుకునే ఆలోచనలో కూడా షో నిర్వాహకులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎలా అయితే లీకేజీలు బయటకు వచ్చాయో అందుకు సంబంధించిన అన్ని దారులను వెతికి పట్టుకొని వాటిని కంట్రోల్ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. మరి ఇంత కష్టపడి చేస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు కష్టం ఏ మేరకు ఫలిస్తుందో అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.. అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ సీజన్ ఫోర్ లను నాగార్జున సమర్థవంతంగా నడపడంతో ఈ సీజన్లో కూడా ఆయన ఈజీగానే నడిపిస్తారని భావిస్తున్నారు.

  English summary
  The Bigg Boss makers, who released the Bigg Boss Five logo a few days ago, has now released a promo related to Bigg Boss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X