twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: ఓట్లతో మారుతున్న పరిస్థితులు.. ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరంటే?

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ప్రారంభం ఏమంత ఆసక్తికరంగా లేకపోవడంతో మొదటి వారం రేటింగ్స్ అయితే చాలావరకు దారుణంగా వచ్చాయి. ముఖ్యంగా స్టార్టింగ్ ఎపిసోడ్ కే అతి తక్కువ రేటింగ్స్ రావడం నిర్వాహకులకు చెమటలు పట్టించింది. దీంతో నాగార్జున ఆగ్రహం తర్వాత మూడో వారం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా కంటెస్టెంట్ మధ్యలో కోపాలను రగిలించింది. ఇక ఓట్ల ద్వార కూడా చాలా వరకు ఎలిమినేషన్స్ లో ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు అని వివరాల్లోకి వెళితే..

    వాళ్ళు సేఫ్

    వాళ్ళు సేఫ్

    ఇక ఈవారం నామినేషన్స్ లిస్టులోకి వెళితే ఒకేసారి పదిమంది నామినెట్ అవధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆదిత్య, ఆరోహి, చంటి, గీతూ ఇనయా నేహా రేవంత్ శ్రీహాన్ సుదీప వాసంతి ఇలా మొత్తం పదిమంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. వీరిలో కొందరు తప్పకుండా సేప్ అవుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదిత్య రేవంత్ శ్రీహాన్ ఇప్పట్లో వెళ్లే అవకాశం అయితే లేదు.

    టాప్ లో రేవంత్

    టాప్ లో రేవంత్

    ఇక గత వారం రోజులుగా ఓట్ల విషయంలో మాత్రం ఫాన్స్ ఊహించని విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ గా మూడో వారంకు సంబంధించిన ఓట్ల విషయంలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు అని వివరాల్లోకి వెళితే.. ముందుగా రేవంత్ అయితే టాప్ లిస్టులో కొనసాగుతున్నాడు. గతవారం అతనికి కాస్త ఓట్లు తగ్గినప్పటికీ ఈ వారం మాత్రం మళ్లీ కొంచెం కొంచెంగా ఓట్లు పెరుగుతున్నాయి.

     శ్రీహన్, గీతూ

    శ్రీహన్, గీతూ

    ఇక ఎప్పటిలానే శ్రీహాన్ అయితే జనాల మద్దతును బాగానే అందుకుంటున్నాడు. అతను అవసరమైనప్పుడే తన గొంతును వినిపిస్తున్నాడు. ఇక శ్రీహన్ అత్యధిక ఓట్లు అందుకున్న కంటెస్టెంట్లలో రెండవ స్థానంలో ఉండగా ఆ తర్వాత గీతూ రాయల్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. గీతూ పై ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఓట్లు మాత్రం అసలు తగ్గడం లేదని అనిపిస్తోంది.

    సేఫ్ గేమ్ తో..

    సేఫ్ గేమ్ తో..

    ఇక నాలుగో స్థానంలో ఆదిత్య కొనసాగుతున్నాడు. అతను పెద్దగా వివాదాలకు వెళ్లకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వాసంతి ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఆమె గతవారం ఓట్లు అందుకోవడంలో చివరి స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం జనాల మద్దతును పెంచుకుంటుంది. ఇక చంటి కామెడీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు అని అతనికి జనాలు పెద్దగా ఓటు వేయడం లేదు. అతను ఇప్పుడు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు.

     హడావిడి చేస్తున్నప్పటికీ

    హడావిడి చేస్తున్నప్పటికీ

    ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒకసారి అత్యధిక ఓట్లు అందుకుంటూ మరోసారి అతి తక్కువ ఓట్ల అందుకుంటున్న సభ్యులలో ఆరోహి కొనసాగుతోంది. ఆమె ఇప్పుడు ఏడవ స్థానంలో అన్నారు. నేహా అయితే ఈ మధ్యనే కాస్త హడావిడి చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఓట్లు పెద్దగా పెరగడం లేదు. ఇక అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఆమె ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది.

    డేంజర్ జోన్ లో..

    డేంజర్ జోన్ లో..

    ఇక ఇప్పుడు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న వారు ఎవరెవరు అంటే ముందుగా అయితే ఇనయా పేరు గట్టిగా వినిపించింది. ఇక ఆ తర్వాత సుదీప కూడా హౌస్ లో నుంచి వెళ్లిపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇనయా కంటే సుదీపపై అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె గతవారం పెద్దగా ఆకట్టుకున్నది లేదు అని అందుకే ఓట్లు తగ్గి ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇనయా సుల్తానా 9వ స్థానంలో ఉండగా అతి తక్కువ ఓట్ల అందుకున్న సుదీప్ 10వ స్థానంలో కొనసాగుతోంది.

    English summary
    Bigg boss telugu 5 third week voting results percentage sudeepa in danger zone
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X