twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రవి దోషి.. లోబో ముఖం మీదే డోర్ కొట్టిన కంటెస్టెంట్లు.. పందెంకోడి ఎవరంటే?

    Bigg Boss Telugu 5 day 20 september 25th Episode, Nagarjuna warns contestant, Priyanka Singh safe from Third week Elimination, Sreerama Chandra safe from third week elimination, Manas in Jail, Luxury budget Task in Bigg

    |

    ప్రస్తుత వారంలో బిగ్‌బాస్ ఇంటిలో నెలకొన్న పరిస్థితులపై అనేక ప్రశ్నలు ఉన్నాయంటూ కంటెస్టెంట్లపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సభ్యులకు ఉన్న ప్రశ్నలు, ప్రేక్షకులకు కంటెస్టెంట్లపై ఉన్న ప్రశ్నలకు, తనకు కంటెస్టెంట్లపై ఉన్న ప్రశ్నలను తేల్చుకొంటానని సుత్తి పట్టుకొని ఇంటి సభ్యులను ప్రశ్నించేందుకు నాగ్ సిద్దమమ్యారు. అలా శనివారం ఎలిమినేషన్ ప్రారంభించి ఇద్దరిని సేఫ్ చేశారు. ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన వారు ఎవరంటే..

    ప్రియ, యాంకర్ రవి వివాదంపై నాగార్జున ఫోకస్

    ప్రియ, యాంకర్ రవి వివాదంపై నాగార్జున ఫోకస్


    ఇంటిలో గత వారం రోజుల్లో జరిగిన అతిపెద్ద గొడవపై నాగార్జున ఫోకస్ పెట్టారు. ప్రియ, లహరి షారి, యాంకర్ రవి మధ్య జరిగిన గొడవపై ఉన్న కన్‌ఫ్యూజన్‌ను బట్టబయలు చేసేందుకు ప్రయత్నించారు. గొడవకు కారణమేమిటని అడిగితే.. ప్రియ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరితే.. యాంకర్ రవి నిజమే.. ప్రియ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు. అయితే సింగిల్ మెన్ అన్నావా అంటే లేదు అని రవి కామెంట్ చేశాడు. అయితే ప్రియ మాత్రం రవి సింగిల్ మెన్ అన్నారు అని చెప్పారు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి లహరిని పవర్ రూమ్‌లోకి పంపించారు.

    లహరి షారికి వీడియో చూపించి

    లహరి షారికి వీడియో చూపించి


    పవర్ రూమ్‌లో లహరి షారికి ఓ విడియో చూపించారు. ఆ వీడియోలో ప్రియ, యాంకర్ రవి మాట్లాడుకొంటూ.. లహరి షారి బయటకు వెళ్లిన తర్వాత యాంకర్ కావాలని అనుకొంటున్నారు. అందుకే నా వెంట పడుతున్నారు. ఇంటిలో ఎంతో మంది సింగిల్ ఉమెన్ ఉన్నా తన వెనుక ఉంటూ రకరకాల సహాయం చేస్తున్నారు అని రవి అనడం స్పష్టంగా కనిపించింది. దాంతో గొడవకు అసలు కారణం ఏమిటనే లహరికి స్పష్టమైంది. ఆ తర్వాత ఎవరు తప్పు చేయలేదో గ్రహించి వారికి హగ్ ఇవ్వమని నాగ్ చెప్పడంతో బయటకు వచ్చింది.

    ప్రియను అపార్థం చేసుకొన్నాను అంటూ లహరి

    ప్రియను అపార్థం చేసుకొన్నాను అంటూ లహరి

    ఇక పవర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన లహిరి షారి.. ప్రియను అపార్థం చేసుకొన్నాను. రవి చెప్పిన మాటలు నాకు స్పష్టంగా అర్ధమయ్యాయి. అయితే నేను యాంకర్ కావాలంటే రవి సహాయం అవసరం లేదు అని చెప్పింది. యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలను చెప్పి.. ప్రియకు హగ్ ఇచ్చింది. అలా రవి, ప్రియ, లహరి మధ్య ఉన్న గొడవలు కంప్లీట్ అయ్యాయి.

    ఎలిమినేషన్ నుంచి ప్రియాంక సింగ్ సేఫ్

    ఎలిమినేషన్ నుంచి ప్రియాంక సింగ్ సేఫ్

    ఇక ఇంటి నామినేషన్‌లో ఉన్న ప్రియ, ప్రియాంక, శ్రీరామచంద్ర, మానస్, లహరి షారిలో ఒకరిని సేఫ్ చేయాలని ముందుకొచ్చారు. గ్లాసుల్లో సోడా పోసి.. ఏ గ్లాసులో అయితే రెడ్ కలర్ వస్తుందో వారు సేఫ్ కానట్టు.. గ్రీన్ కలర్ వస్తే.. సేఫ్ అయినట్టు చెప్పారు. ఐదుగ్లాసుల్లో సోడా పోస్తే ప్రియాంక పేరు ఉన్న గ్లాస్‌ గ్రీన్‌గా మారింది. దాంతో ప్రియాంక సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించారు. దాంతో ఆమెను అందరూ అభినందించారు.

    లోబో ముఖంపై డోర్ వేసి కొట్టిన కంటెస్టెంట్లు

    లోబో ముఖంపై డోర్ వేసి కొట్టిన కంటెస్టెంట్లు


    ఇక ఇంటిలో షట్ ది డోర్ అనే గేమ్‌ను ఇంటి సభ్యులు ఆడించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన వారి పేరు చెప్పి వారి ముఖంపై డోర్ వేసి ఎందుకు ఇంటిలో ఉండటానికి అర్హత లేదో కారణాలు చెప్పాలి అని రూల్ చెప్పారు. ఎక్కువ మంది లోబో ఇంటి నుంచి వెళ్లాలనే అభిప్రాయాన్ని చెప్పి అతడి ముఖంపై డోర్ కొట్టారు. అలా గేమ్‌ను ఆడిస్తూ చివర్లో రెండో ఇంటి సభ్యుడిని సేఫ్ చేయాలని నిర్ణయించారు. అయితే తలపై జుట్టుకు ఎర్ర రంగు వేసుకొన్న లోబోను చూసి అచ్చం పందెంకోడిలా ఉన్నావు అంటూ కామెంట్ చేశాడు.

    ఎలిమినేషన్ నుంచి శ్రీరామ చంద్ర సేఫ్

    ఎలిమినేషన్ నుంచి శ్రీరామ చంద్ర సేఫ్

    ఇక నామినేషన్‌లో వాడిన పద్దతిని ఉపయోగిస్తూ.. గ్లాస్‌పై రంగు ఉన్న ముద్రను నాగార్జున అద్దాడు. ఆ ముద్రపై ఎవరి పేరు ఉంటే..వారు సేఫ్ అని చెప్పారు. దాంతో గ్లాస్‌పై శ్రీరామచంద్ర పేరు ఉండటంతో సేఫ్ అయినట్టు ప్రకటించారు. వెంటనే హమీదా వచ్చి శ్రీరామచంద్రను కౌగిలించుకొన్నారు. ఇంకా ఎలిమినేషన్‌లో ప్రియ, మానస్, లహరి షారి ఇంకా ఉన్నారు. ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయే వారు ఎవరో తెలుస్తారు. అయితే ఇప్పటికే లహరి షారి ఎలిమినేట్ అయిందనే వార్త బయటకు వచ్చింది.

    English summary
    Bigg Boss Telugu 5 Weekend update: Nagarjuna set house in proper way. Priyanka Singh, Sreerama Chandra Safe from Elimination
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X