Bigg Boss Telugu 5 టాప్ 5 జాబితాలో ఆ ఐదుగురు.. అతడి జోస్యం ఫలిస్తుందా?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో పదోవారంలోకి ప్రవేశించింది. ఎన్నో భావోద్వేగాలు, గొడవలు, వివాదాల మధ్య ఈ రియాలిటీ షో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు వెళ్తున్నది.ఈ గేమ్‌లో భాగంగా తొమ్మిదో వారం ఇంటి నుంచి విశ్వ ఎలిమినేట్ అవ్వడం తెలిసిందే. అయితే ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి హెస్ట్ నాగ్ ఉన్న వేదికపైకి విశ్వ చేరుకొని ఎమోషనల్అయ్యారు. అయితే బిగ్‌బాస్ వేదిక మీద నుంచి విశ్వ ఎలా ఫీలయ్యారంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

బిగ్‌బాస్ వేదికపైన నాగ్‌తో కలిసి

బిగ్‌బాస్ వేదికపైన నాగ్‌తో కలిసి

బిగ్‌బాస్ వేదిక మీద ఉన్న నాగ్‌ను కౌగిలించుకొని ఇంటిలో తన జర్నీని చూశాడు. ఎన్నో ఎమోషనల్ సంఘటనలు చూసి మరింత భావోద్వేగానికి గురయ్యాడు. రెండుసార్లు ఇంటి కెప్టెన్‌గా వ్యవహరించిన విశ్వ ఇంటి సభ్యుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నాడు. ఇక వేదిక మీద నాగ్‌తో కలిసి ఇంటి సభ్యులతో ముచ్చటించాడు.

జీవితంలో ఒకేసారి వచ్చే అదృష్టం

జీవితంలో ఒకేసారి వచ్చే అదృష్టం

హోస్ట్ నాగ్‌తో కలిసి ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో అవకాశం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే అదృష్టం. మీ అందరితో ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిని మిస్ అవుతున్నాను అని విశ్వ ఎమోషనల్ అయ్యాడు. దాంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అవుతూ .. నిన్ను కూడా మేమంతా మిస్ అవుతున్నామని చెప్పారు.

విశ్వ బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోవడం

విశ్వ బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోవడం

ఇంటిలో గొప్పగా టాస్కులు ఆడి.. ఎన్నో పనులు చేసిన నీవు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది అని శ్రీరామచంద్ర అన్నారు. బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో ది బెస్ట్ సంచాలకుడు. బెస్ట్ రేషన్ మేజర్, బెస్ట్ కెప్టెన్ అని యాంకర్ రవి అన్నాడు. ఇలా తన ఇంటి సభ్యులతో కలిసి ముచ్చటిస్తూ... వారి గురించి తన అభిప్రాయాలను, వారి ర్యాంకింగ్స్ పెట్టాడు.

 టాప్ 10 జాబితాలో

టాప్ 10 జాబితాలో

ఇంటిలో ఉన్న పది మందికి వారి వారి ఆటను బట్టి ర్యాంకింగ్ ఇవ్వమని విశ్వను హోస్ట్ నాగార్జున కోరారు. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత నా హృదయానికి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ప్రియాంక. ఆమెకు నేను ఇచ్చే ర్యాంక్ 10 అని చెప్పాడు. ఆ తర్వాత కాజల్‌కు 9వ స్థానం, 8వ స్థానంలో జెస్సీ, 7వ స్థానంలో అనీ మాస్టర్, 6వ స్థానంలో మానస్‌ను పెట్టాడు.

బిగ్‌బాస్ తెలుగు 5 టాప్ 5 జాబితా ఇదే

బిగ్‌బాస్ తెలుగు 5 టాప్ 5 జాబితా ఇదే

ఇక బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌లో సిరి హన్మంతు, షణ్ముఖ్, వీజే సన్నీ, శ్రీరామచంద్ర ఉన్నారు. టాప్ 5వ స్థానంలో సిరి హన్మంతు, 4వ స్థానంలో వీజే సన్నీ, 3వ స్థానంలో షణ్ముఖ్ జస్వంత్, 2వ స్థానంలో యాంకర్ రవి, 1వ స్థానంలో శ్రీరామచంద్రను పెట్టారు. రవిని గుంటనక్క, నక్క అంటారు. కానీ ఆయన గేమ్ ప్లాన్ డిఫరెంట్ అని విశ్వ అన్నాడు.

Recommended Video

Samantha Is Super Excited For Marvel Studios 'Eternals'
చనిపోయిన నా సోదరుడు గుర్తుకొస్తాడు అంటూ

చనిపోయిన నా సోదరుడు గుర్తుకొస్తాడు అంటూ

బిగ్‌బాస్ ఇంటిలో టాప్ కంటెస్టెంట్‌లో శ్రీరామచంద్ర ఒక్కరు. శ్రీరామ్‌ను చూస్తే చనిపోయిన నా తమ్ముడు గుర్తుకువస్తావు అని విశ్వ కంటతడి పెట్టాడు. బెస్ట్ కెప్టెన్ శ్రీరామ్, ఎవరైనా ఏమైనా అంటే నీవు నీ ప్రవర్తనను మార్చుకోకు. నీవు నీలాగే ఉండు అని విశ్వ అన్నాడు. అలాగే యాంకర్ రవి నాకు తమ్ముడి లాంటి వాడు. నేను ఇంటిలో ఉండగా రిలేషన్స్ పెట్టుకోవద్దని అనుకొన్నాను అని విశ్వ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X